చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు | Shubman Gill Creates History, Breaks Virat Kohlis Record; Becomes First Player In IPL | Sakshi
Sakshi News home page

IPL 2026: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు

May 22 2026 4:52 AM | Updated on May 22 2026 4:52 AM

Shubman Gill Creates History, Breaks Virat Kohlis Record; Becomes First Player In IPL

ఐపీఎల్ 2026లో అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌ కేవలం 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స్‌ర్లతో 64 ప‌రుగులు చేశాడు. 

దీంతో ఈ ఏడాది సీజ‌న్‌లో శుభ్‌మ‌న్ 600 ప‌రుగుల మైలు రాయిని దాటేశాడు. కెప్టెన్‌గా గిల్ ఒకే సీజ‌న్‌లో 600 ప‌రుగుల‌ను పూర్తి చేసుకోవ‌డం ఇది రెండో సారి. ఈ క్ర‌మంలో 26 ఏళ్ల గిల్ ప‌లు అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

 గిల్‌ సాధించిన రికార్డులు ఇవే
👉ఐపీఎల్ చ‌రిత్ర‌లో 27 ఏళ్ల వ‌య‌స్సులోపు కెప్టెన్‌గా ఒకటి కంటే ఎక్కువ సీజన్లలో 600 ప్లస్ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గిల్ నిలిచాడు.  గ‌తంలో ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న‌ విరాట్ కోహ్లి 27 ఏళ్ల వ‌య‌స్సు లోపు కేవ‌లం ఒక్క సీజ‌న్‌లో మాత్రం ఈ ఫీట్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో కోహ్లిని గిల్ అధిగ‌మించాడు.

👉అదేవిధంగా వ‌రుస సీజ‌న్ల‌లో కెప్టెన్‌గా  600కు పైగా పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ కేఎల్ రాహుల్( 29 ఏళ్ల వయసులో) పేరిట ఉండేది.

👉27 ఏళ్లు నిండకముందే ఒక ఆటగాడిగా ఐపీఎల్‌లో మూడు వేర్వేరు సీజన్లలో 600 ప్లస్ పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్‌గా గిల్ రికార్డులకెక్కాడు.

👉ఐపీఎల్‌ చరిత్రలో వరుస సీజన్లలో కెప్టెన్‌గా 600 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో సారథిగా గిల్ నిలిచాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

ఇక మ్యాచ్‌లో సీఎస్‌కేపై 89 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ టైటాన్స్ ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.  శుబ్‌మన్‌ గిల్‌తో పాటు సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 84), జోస్‌ బట్లర్‌ (27 బంతుల్లో 57 నాటౌట్‌) మెరుపు హాఫ్‌ సెంచరీల‌తో రాణించారు. 

సీఎస్‌కే బౌల‌ర్ల‌లో స్పెన్స‌ర్ జాన్స‌న్‌, అన్షుల్ కాంబోజ్‌, ముకేశ్‌ చౌదరి త‌లా వికెట్ సాధించారు. అనంత‌రం 230 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే.. 13.4 ఓవ‌ర్ల‌లో 140 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. గుజరాత్‌ బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, కగిసో రబాడ, రషీద్‌ ఖాన్‌ తలా మూడు వికెట్లు పడగొట్టి సీఎస్‌కేను దెబ్బ తీశారు. 

Advertisement
 
Advertisement
Advertisement