breaking news
cricket pich
-
ఇంత దారుణమా.. ఇదేం పిచ్?.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో చారిత్రాత్మక మ్యాచ్‌కు గురువారం తెరలేచింది. లండన్‌లోని ఈ ప్రఖ్యాత వేదికపై 150వ టెస్టుగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య పోరు అట్టహాసంగా ఆరంభమైంది. అయితే, తొలి రోజే ఏకంగా 16 వికెట్లు పడ్డాయి. లార్డ్స్ పిచ్ మీద ఇరుజట్ల పేసర్లు పండుగ చేసుకున్నారు.140 పరుగులకేఇంగ్లండ్తో తొలి టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఇంగ్లిష్ జట్టు 140 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ 56 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా వాళ్లంతా కనీసం 20 పరుగుల మార్కు దాటలేదు.కివీస్ బౌలర్లలో కైలీ జెమీషన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నాథన్ స్మిత్ మూడు, విలియం ఓరూర్కీ రెండు వికెట్లతో సత్తా చాటారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కివీస్.. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి కేవలం 61 పరుగులకే ఆరు వికెట్లు నష్టపోయింది.కివీస్ మరీ దారుణంగాఓలీ రాబిన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి రోజే 16 వికెట్లు పడటం చూసి ప్రేక్షకుడిగా వినోదం పొందినా.. ఓ క్రికెటర్‌గా తనకు ఇది ఏమాత్రం నచ్చలేదన్నాడు.పిచ్ మరీ దారుణంగా ఉందిబీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు పిచ్‌ను దగ్గరగా చూశాను. బంతిని అంచనా వేయడం కష్టమైపోయింది. ఇరుజట్లలో కలిపి దాదాపుగా ఆరుగురు లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగారు. డిఫెన్స్ ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయారు.బంతి నేరుగా ప్యాడ్ల మీదకే వచ్చింది. దీనిని బట్టి పిచ్ ఎంత దారుణంగా ఉందో చెప్పవచ్చు. నిజానికి ప్రేక్షకుడిగా తొలిరోజే 16 వికెట్లు పడటం చూసి నేను సంతోషించాను. కానీ ఇది మంచి పిచ్ కాదు. లార్డ్స్ మైదానంలో ఇలాంటి పిచ్ చూసి మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ఏమాత్రం సంతోషించదని చెప్పగలను.గత కొన్నేళ్లుగా ఈ సమస్య కొనసాగుతోంది. గతేడాది టీమిండియాతో మ్యాచ్ అద్భుతంగా సాగింది. కానీ అప్పుడు కూడా పిచ్ గురించి ఫిర్యాదులు వచ్చాయి. ముందుగా చెప్పినట్లు ఈ పిచ్ అంత గొప్పగా లేదు. కానీ ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. ఈ మ్యాచ్ కూడా అలాగే సాగుతుందని అనుకుంటున్నా’’ అని మైకేల్ వాన్ విమర్శించాడు.చదవండి: ‘ఇండియాలో లైఫ్ కోహ్లికి అస్సలు నచ్చదు’ -
ఓవర్ టు సిల్వర్ స్క్రీన్
క్రికెటర్‌గా... అంతకు మించి కాంట్రావర్షియల్ సెలబ్రిటీగా బాగా పాపులర్ అయిన శ్రీశాంత్ హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో శుక్రవారం ప్రత్యక్షమయ్యాడు. అడిగిన వారికల్లా ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడమే కాదు.. ఫొటోలకూ ఫోజులిస్తూ కనిపించాడు. ఈ సడెన్ విజిట్ వెనుక సీక్రెట్ ఏంటని అడిగితే.. ‘సిల్వర్ స్క్రీన్‌పై చూడండి’ అంటూ అభినయిస్తూ మరీ చెప్పాడు. ‘తెలుగు సినిమాల్లో నటించబోతున్నా.. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులతో చర్చలు జరుగుతున్నాయి’ అని సిటీ విజిటింగ్ గుట్టు రట్టు చేశాడు. ఎవరితో చర్చలు జరుపుతున్నారో చెప్పమంటే.. ‘ప్రస్తుతానికి పూరీ జగన్నాథ్‌తో డిస్కషన్స్‌లో ఉన్నా’నంటూ ట్విస్ట్ ఇచ్చాడు. మంచి ఫిజిక్‌తో.. బాడీపై టాటూలతో.. టాప్ టు బాటమ్ ఫుల్ మేకోవర్ చేయించుకున్నట్టు కనిపించిన ఈ క్రికెటర్ తాజా అవతారం కాస్త డిఫరెంట్‌గానే ఉంది. మొన్నటి దాకా క్రికెట్ పిచ్, ఆ తర్వాత ర్యాంప్‌లూ, టీవీ షోలు... ఇలా ఏదో రూపంలో అలరిస్తున్న శ్రీని త్వరలోనే తెలుగు తెరపై చూడొచ్చన్నమాట. - ఎస్బీ -
సినీ తారల క్రికెట్
సినీ తారల క్రికెట్ సందడి మొదలైంది. తారలు వెండి తెర నుంచి క్రికెట్ పిచ్‌పైకి వచ్చారు. ఈ సీసీఎల్ టోర్నమెంట్ వారం క్రితం ముంబైలో మొదలైంది. రే పు బెంగళూరులో జరగబోయే మ్యాచ్‌లో చెన్నై తారల టీం పాల్గొంటోంది. దీనికి త్రిష అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆటయినా, పాటయినా ఆ మాట కొస్తే ఏ క్రీడయినా సై అంటోంది సీసీఎల్‌లోని చెన్నై రైనోస్ టీమ్. సినిమా, క్రీడలు ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. వీటి నుంచి ప్రేక్షకులు కోరుకునేది ఎంటర్ టెయిన్మెంట్. క్రీడల్లో హాకీ మన జాతీయ క్రీడ కంటే క్రికెట్ అంటేనే ఎక్కువ క్రేజ్. ఈ క్రీడకు సాధారణ ప్రేక్షకుడితోపాటు ప్రముఖ స్థాయికి చెందిన వారు ఎడిక్ట్ అనే చెప్పాలి. అశేష అభిమానులు ప్రేమించే సినీ కళాకారులు కూడా క్రికెట్ ప్రియులే. అలాంటి తారలు క్రీడాకారులయితే అయితే ఆ మజానే వారు. అలా పుట్టిందే క్రికెట్ సెలబ్రెటీస్ లీగ్ (సీసీఎల్) 2011లో నాలుగు భాషలకు చెందిన (తమిళం, తెలుగు, ముంబై, కర్ణాటక) టీమ్స్‌తో మొదలైన ఈ క్రికెట్ సెలబ్రెటీ లీగ్ ఒక్కో ఏడాది ఒక నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఐపీఎల్‌కు దీటుగా తయారైందంటే అతిశయోక్తి కాదు. చెన్నై రైనోస్ టీమ్‌కు విశాల్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహిస్తుండగా, విక్రాంత్, రమణ, విష్ణు, శాంతను, శ్యామ్, జిత్తన్ రమేష్, జీవా, శ్రీకాంత్, సుందరం తదితరులు టీమ్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు వారియర్స్‌కు నటుడు వెంకటేష్ నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ జట్టులో శ్రీకాంత్, అల్లరి నరేష్, అఖిల్ తదితరులు ఆడుతున్నారు. ముంబై హీరోస్ జట్టుకు నటుడు సునిల్ శెట్టి, కర్ణాటక బుల్డోజర్స్ జట్టుకు సుదీప్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంతింతై - వటుడింతైనట్లు 2011లో చెన్నై రైనోస్, తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, ముంబై హీరోస్ టీమ్‌లుగా బరిలోకి దిగి, క్రికెట్, సినీ అభిమానుల్ని అలరించాయి. ఈ లీగ్‌లో చెన్నై రైనోస్ విజేతగా నిలిచింది. 2012లో జరిగిన రెండవ సీజన్లో ఈ నాలుగు టీమ్‌లకు మరో రెండు కేరళ స్ట్రైకర్స్, బెంగాల్ టైగర్స్ అదనంగా వచ్చి చేరాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లోనూ కప్‌ను చెన్నై రైనోస్నే కైవసం చేసుకోవడం విశేషం. 2013లో జరిగిన మూడవ సీజన్లో మరో రెండు టీమ్‌లు వీర మరాఠి, బోజ్‌పూరి డేబాగ్స్ వచ్చి చేరాయి. ఈ సిరీస్ కప్‌ను కర్ణాటక బుల్డోజర్స్ తన్నుకుపోయింది. నాలుగు సీజన్ ఆట మొదలైంది నాలుగో సీజన్ సీసీఎల్ ఆటలో కప్ ఎవరిదన్నపై ఎవరికి వారే తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ ఆట జనవరి 25న ముంబాయిలో మొదలైంది. మలి ఆట రేపు (ఆదివారం) బెంగుళూర్లోని చిన్నసామి స్టేడియంలో ప్రారం భం కానుంది. ఆ రోజున నాలుగు జట్లు తలపడబోతున్నాయి. సాయంత్రం 7 గంటలకు మొదల య్యే ఆటలో చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్తో తలపడనుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో విజ యాన్ని కైవసం చేసుకున్న చెన్నై రైనోస్ మంచి రైజింగ్‌లో ఉంది. నాలుగో సీజన్ కప్ తామే సాధించి తీరుతామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. ఈ టీమ్‌కు తాజాగా నటి త్రిష బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం విశేషం. టీమ్ కెప్టెన్ విశాల్ శుక్రవారం చెన్నైలో మీడియూతో మాట్లాడుతూ తమ టీమ్‌లో యూనిటీ ఉందన్నారు. తమ టీమ్‌కు సంతోష్ గోపి కోచ్‌గా వ్యవహరించ డం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మూడు సీజన్ మ్యాచ్‌ల్లో ప్రతిభ ఆధారంగా ఈ లీగ్‌కు చాలా మార్పులు చేర్పు లు చేసుకున్నామని తెలిపారు. తమ టీమ్‌లో ప్రతి ఒక్కరూ కప్ గెలవాలన్న లక్ష్యంతోనే ఉన్నట్టు మళ్లీ విజేతగా నిలుస్తామనే నమ్మకంతో ఆడుతున్నట్లు తెలిపారు. ఆనందంగా ఉంది చెన్నై రైనోస్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉందని నటి త్రిష పేర్కొన్నారు. తొలి సీజన్ నుంచి ఈ జట్టును ఉత్సాహపరచాలని కాంక్షించానని ఇప్పటికి అది నెరవేరిందని తెలిపారు. చెన్నై రైనోస్ టీమ్ చాలా పటిష్ఠంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చెన్నై అభిమానులకు నిరాశే ఈ సీసీఎల్ పోటీ ఫిబ్రవరి 2న చెన్నై చేపాక్ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వానికి క్రికెట్ బోర్డుకు మధ్య విభేదాలతో సీసీఎల్ పోటీకి అనుమతి లభించలేదని కెప్టెన్ విశాల్ తెలిపారు. దీంతో చెన్నైలో సీసీఎల్ మ్యాచ్ లేనట్లేనని తెలుస్తోంది.


