breaking news
cracker factory blast
-
నిజామాబాద్లో భారీ అగ్నిప్రమాదం
-
బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ఒకరు మృతి
చంఢీగడ్: హరియాణలోని కర్నాల్ నగరంలో మంగళవారం రాత్రి ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురి శరీరాలు కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఘోగ్రిపూర్ రోడ్డు సమీపంలోని బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ శబ్ధం, మంటలతో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించి వ్యక్తి మృత దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన ముగ్గురిని శివం కుమార్(28), విజయ్ పాల్(22), విజయ్ కుమార్(25)గా గుర్తించారు. వారంతా వలస కార్మికులని తెలిపారు. ఈ ప్రమాదంతో బాణసంచా కర్మాగారంలోని అధిక భాగం మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. బాణసంచా కర్మాగారం యాజమాని రాకేష్ కుమార్ మాట్లాడుతూ.. పేలుడు సంభవించిన సమయంలో మృతి చెందిన వ్యక్తితో పాటు మరో ముగ్గురు బాణసంచా తయారీ విభాగాన్ని శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియలేదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: కారు టైరు పేలి.. ఏడుగురు అక్కడికక్కడే -
బాణాసంచా పేలుడు: ముగ్గురు మృతి
విశాఖపట్నం: బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం కాగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం ఏ. కొత్తపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికంగా అనధికారికంగా నిర్వహిస్తున్న బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో అక్కడ పని చేస్తున్న ముగ్గురు కూలీలు సజీవదహనమైయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని... ఫైరింజన్లలో మంటలు ఆర్పుతున్నారు. అయితే ఈ ఘటనపై అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.