breaking news
codavaram
-
జన శంఖారావం
సమైక్య సారథికి నీరా‘జనం’ జగన్‌కు అడుగడుగునా అఖండ స్వాగతం చోడవరంలో పోటెత్తిన ప్రజానీకం దుడ్డుపాలెం (కె.కోటపాడు), న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి పార్టీ సీపీ సీఈసీ సభ్యుడు బూడి ముత్యాలునాయుడు ఆధ్వర్యంలో దేవరాపల్లి మండలప్రజలు చోడవరం మండలం దుడ్డుపాలెం జంక్షన్ వద్ద ఘనస్వాగతం పలికారు. చోడవరంలో సమైక్య శంఖారావం సభకు జగన్మోహన్రెడ్డి వస్తున్న మార్గంలో సుమారు పదివేలమంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు రెండు కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా నిలబడి శనివారం స్వాగతం పలికారు. దుడ్డుపాలెం జంక్షన్‌కు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్న అభిమానులు ఎండను సైతం లెక్క చేయకుండా అభిమాన నాయకుడి రాక కోసం గంటలకొద్దీ వేచి ఉన్నారు. పార్టీ అధినేతకు గిరిజనులు థింసా నృత్యం, కోలాటాలతో అపూర్వ స్వాగతం పలికారు. గంటల తరబడి వేచిఉన్న కార్యకర్తలు, మహిళలను పలుకరిస్తూ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్‌ను ముందుకు సాగించారు. ఈ సందర్భంగా అశేష జనాన్ని చూసిన జగన్మోహన్రెడ్డి బూడి ముత్యాలనాయుడుతో మాట్లాడారు. పార్టీ పట్టిష్టతకు చేసిన సేవలను బూడి వివరించారు. రెండు కిలోమీటర్ల పొడవునా ఉన్న మహిళలు, కార్యకర్తలకు జగన్మోహన్రెడ్డి భివాదం చేసి ఉత్తేజపరిచారు. ఈ స్వాగత కార్యక్రమాల్లో దేవరాపల్లి వైఎస్సార్ సీపీ నాయకులు కర్రి సత్యం, బూరె బాబూరావు, పోతల లక్ష్మి, గూడెపు రాము, రొంగలి శంకరరావు, రెడ్డి బలరాం, నాగిరెడ్డి శఠారినాయుడు, వరదపురెడ్డి లలితానాయుడు, బొడ్డు పేరునాయుడు, ఈర్లె గంగునాయుడు (నాని) పాల్గొన్నారు. విమానాశ్రయంలో హోరెత్తిన జగన్నినాదం విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో శని వారం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి అఖండ స్వాగతం లభించింది. సమైఖ్య శంఖారావం సభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను కలిసేందుకు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో అభిమానులు, నేతలు తరలి వచ్చారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, డాక్టర్ జహీర్అహ్మద్, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకటరావు, ఉత్తరాంధ్ర ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, సమన్వయకర్తలు గండి బాబ్జీ, దాడి రత్నాకర్, తిప్పల నాగిరెడ్డి, జి.వి.రవిరాజు, కోలా గురువులు, కోరాడ రాజబాబు, పెట్ల ఉమాశంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి, చెంగల వెంకటరావు, నగర మహిళా కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్, పార్టీ నాయకురాలు పీలా ఉమారాణి, మాజీ కార్పొరేటర్ చొప్పా నాగరాజు తదితర నాయకులు జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. ఇక్కడి నుంచి దారిపొడువునా మహిళలు, యువకులు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మంగళ హారతులతో అభిమానాన్ని చాటుకున్నారు. జై..జగన్ నినాదాలతో హోరెత్తించారు. పులకించిన చోడవరం.. చోడవరం, న్యూస్‌లైన్: తమప్రియతమ నాయకుడు రావడం తో చోడవరం పులకరించిపోయింది. సుమా రు మూడు సంవత్సరాల త ర్వాత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనరెడ్డి చోడవరం రావడంతో అభిమానులు ఆయనను చూసేందుకు బారులు తీరా రు. చోడవరం పట్టణంలోని ప్రజలతోబాటు పరిసర మండలాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో చోడవరం జన సం ద్రంగా మారింది. మద్యాహ్నం రెం డు గం టల నుంచే అభిమాన నాయకుని రాకకోసం చోడవరం కార్యకర్తలు, అభిమానులు, సమైక్యవాదులు చేరుకున్నారు. సుమారు మూడు గంటల పాటు జగన్ రాక ఆలస్యమైనా ఏ ఒక్కరూ నిరాశ చెందలేదు. అంతకంతకు జనం పెరగడంతో ఇసుక వేస్తే రాలనంతగా కొత్తూరు జంక్షన్ నిండిపోయింది. 2011 జనవరిలో ఓదార్పు యాత్ర అనంతరం మూడేళ్ల తర్వాత వచ్చిన జగన్‌ను చూసేందుకు చిన్నా పెద్ద అంతా ఉత్సాహం చూపారు. మహిళలు, విద్యార్థులు, యువకులు, వృద్దులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభా స్థలి వద్ద చుట్టు పక్క ఉన్న భవ నాల పైకి సైతం ఎక్కి తమ అభిమాన నాయకుడిని తనివి తీరా చూసుకున్నారు. జగన్ ప్రసంగానికి అడుగడుగునా కరతాళ ధ్వనులతో తమ స్పందనను వ్యక్తపరిచారు. చంద్రబాబుపై విమర్శలకు జనం నుంచి అనూహ్యస్పందన వచ్చింది. చోడవరం, మాడుగుల నియోజకవర్గాలతోపాటు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది సభకు తరలిరావడంతో రోడ్లన్నీ నిండిపోయాయి. జగన్ నినాదంతో సభా ప్రాంతమంతా మారుమోగింది. -
నేడు సమైక్య శంఖారావం
వైఎస్సార్సీపీ అధినేత జగన్ రాక నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు విమానాశ్రయానికి.. 3 గంటలకు చోడవరం సభ సాయంత్రం 5కు పాతగాజువాకలో.. విస్తృత స్థాయిలో ఏర్పాట్లు సమైక్య ఉద్యమంలో ఇది మహోజ్వల ఘట్టం. కుత్సితాల చీకట్లను తొలగించుకుని వేయివెల్గులరేడుగా ప్రభవించిన అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారిగా విశాఖ గడ్డపై సమైక్య సమర శంఖం పూరించేందుకు శనివారం రానున్నారు. ఈ సందర్భంగా జనహృదయాధినేతకు ఘన స్వాగతం పలికేందుకు అభిమాన కోటి ఉవ్విళ్లూరుతున్నారు.మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఆయన విమానాశ్రయానికి చేరుకుంటారు. జగన్ అక్కడినుంచి నేరుగా చోడవరం పయనమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు సమైక్య శంఖారావం సభలో ప్రసంగించనున్నారు. చోడవరం నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకుంటారు. సమైక్య శంఖారావం సభలో జగన్ ప్రసంగిస్తారు. చోడవరం, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే చోడవరం, గాజువాక సమైక్య శంఖారావం సభలను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర పోగ్రాం కో- ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా శాఖ అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు పిలుపునిచ్చారు. పార్టీ అధినేత పాల్గొనే సమైక్య శంఖారావం సభ ప్రదేశాన్ని శుక్రవారం వారిద్దరూ పరిశీలించారు. కొత్తూరులోని నాలుగు కూడళ్ల జంక్షన్ వద్ద సభాస్థలిని చూశాక వారు మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు చోడవరంలో, సాయంత్రం 5 గంటలకు గాజువాకలో జరిగే సభల్లో జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం సభలో కూడా పార్టీ అధినేత పాల్గొంటారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న దృఢనిశ్చయంతో జగన్మోహన్రెడ్డి ఆది నుంచీ పోరాటం చేస్తున్నారని చెప్పారు. సమైక్యవాదులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. సభ నిర్వహణపై సీఈసీ సభ్యుడు పీవీఎస్ఎన్ రాజుతో, సమన్వయకర్తలు బలిరెడ్డి సత్యారావు, బూడి ముత్యాలనాయుడుతో సమీక్షించారు. పార్టీ నాయకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
పల్లెల్లో గుర్రాల రేసులు
చోడవరం రూరల్, న్యూస్‌లైన్ : కనుమరుగయ్యాయనుకుం టున్న గుర్రపు పందాలు మళ్లీ ఇప్పుడిప్పుడే ఊపందుకుం టున్నాయి. ఇంతకాలం తీర్థ మహోత్సవాల్లో ఎడ్ల పరుగు పందాలు ప్రజలకు ఉత్సాహం కలిగిస్తుండగా తాజాగా గుర్రం పందాలు కూడా వినోదాన్ని పంచుతున్నాయి. తీర్థాలు, తిరునాళ్ల సందర్భం గా నిర్వహిస్తున్న గుర్రం పరుగు పం దాలు గ్రామీణ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. గతేడాది కూడా కొన్ని గ్రా మాల్లో వీటిని నిర్వహించగా, ఈ ఏడా ది పలు గ్రామాల్లో వీటి కోసం ఏర్పా ట్లు చేశారు. విశాఖపట్నం, అచ్యుతాపురం మండలం రామయ్యపేట, రావి కమతం మండలం కొత్తకోట, టి.అర్జాపురం, దొండపూడి, నాతవరం మండ లం బెన్నవరం తదితర గ్రామాల్లో ఈ గుర్రాలు ఉన్నాయి. పరుగు పందాలకు వస్తున్న గుర్రాల్లో ఎత్తై, బలిష్టమైన జాతి గుర్రాలతోబాటు సాధారణ గుర్రాలు కూడా ఉంటున్నాయి. ఇటీవలే మండలంలోని నర్సయ్యపేటకు చెందిన ముమ్మిన రామకృష్ణ సుమారు రూ.80 వేలతో కొత్తగా గు ర్రాన్ని కొనుగోలు చేశాడు. కేవలం పందాల కోసమే గుర్రాలను కొనుగో లు చేస్తుండడం విశేషం. విశాఖపట్నానికి చెందిన గుర్రం యజమానులు త మ గుర్రాలకు అబ్బాస్, బ్లాకీ, మూనీ, రాణా గుర్రాలుగా పేర్లు పెట్టి పలు పోటీలలో నిలుపుతున్నారు. గుర్రపు పోటీల విజేతలకు వేలాది రూపాయల నగదు బహుమతులను అందచేస్తున్నారు. అలాగే పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కొంత మొత్తాన్ని ప్రోత్సాహకంగానూ ఇస్తున్నారు. దీంతో ఈ పోటీలకు వచ్చే గుర్రాల సంఖ్య పెరుగుతోంది. ఔత్సాహికుల్లో ఆసక్తి కూడా అధికమవుతోంది.