breaking news
Cloud Seeding
-
కృత్రిమ వర్షాల కథేమిటి? లాభమా? నష్టమా?
వాయు కాలుష్యంతో అల్లాడుతున్న దేశ రాజధాని నగరానికి ఉపశమనం కల్పించేందుకు ఇటీవల క్లౌడ్ సీడింగ్‌తో ( cloud seeding) కృత్రిమంగా వర్షాలు కురిపించే ప్రయత్నాలు రెండుసార్లు జరిగాయి. గత అయిదు దశాబ్దాల కాలంలో ఢిల్లీలో ఇలాంటి ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి. ఐఐటీ – కాన్పూర్ భాగస్వామ్యంతో ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాలు అంతగా ఫలించకపోయినప్పటికీ, అందరి దృష్టినీ ఆకర్షించాయి. అసలింతకీ ఈ కృత్రిమ మేఘమథనం అంటే ఏమిటి? ఎలా చేస్తారు? ఏం చేస్తారు? ప్రపంచవ్యాప్తంగా దీని ఫలితాలేమిటి? ఇలా కృత్రి మంగా వర్షాలు కురిపించడంలో లాభమెంత? నష్టమెంత? కృత్రిమ మేఘమథన ప్రయత్నాలు ఏడున్నర దశాబ్దాల పైగా జరుగుతూనే ఉన్నాయి. సౌదీ, అమెరికా, చైనా, ఇజ్రాయెల్, ఇండొనేషియా, ఆస్ట్రే లియా సహా 50 దేశాలు ఈ ప్రయోగాలు చేశాయి. అయితే, మిశ్రమ ఫలితాలే వచ్చాయి. మన దేశంలోనూ 1952 నుంచి ప్రయోగాలు జరిగాయి. అప్పట్లో హైడ్రోజెన్ బెలూన్లలో ఉప్పు, సిల్వర్ అయొడైడ్లను పంపేవారు. ఢిల్లీలోనూ ఎప్పుడో 1960ల్లోనే ప్రయోగం చేసి, విఫలమయ్యారు. ఆ తర్వాత 1970ల నుంచి విమానాల వినియోగం వచ్చింది. తాజాగా అక్టోబర్ 28న ఢిల్లీలో చేసిన ప్రయత్నాలతో వర్షం రాలేదు కానీ, ప్రమాద స్థాయిలో ఉన్న వాయునాణ్యత కాస్తంత మెరుగైంది. ఏమిటీ క్లౌడ్ సీడింగ్?మేఘాలు వర్షం కురిపిస్తాయి. కానీ, అన్ని మేఘాలూ వర్షించవు. అందుకే క్లౌడ్ సీడింగ్. ‘క్లౌడ్ సీడింగ్’ అంటే మేఘాలను మథించి, కృత్రిమ పద్ధతిలో వర్షాలు కురిసేలా చేయడం. సామాన్యుల భాషలో... పనిచేస్తున్న వాహనం పెట్రోల్ ఉన్నా సరే బ్యాటరీ బలహీనమై స్టార్ట్ కానప్పుడు బండిని వెనక నుంచి ముందుకు తోసి ఆ ఊపుతో స్టార్ట్ అయ్యేలా చేసి నట్టే, సైన్స్ ఆసరాతో కృత్రిమంగా మేఘాలను ప్రేరేపించి కురిసేలా చేస్తారు. ఓ విమానాన్ని వాడి, మేఘానికి కొన్ని కణాలను జత చేరుస్తారు. జీరో డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండే చల్లటి మేఘాలలో సిల్వర్ అయొడైడ్ కణాలను జత చేర్చే ప్రక్రియ సాగుతుంది. సదరు ఆ కణాలే ‘సీడ్స్’ (విత్తనాలు)గా పనిచేస్తాయి. వాటి చుట్టూ నీటి ఆవిరి ఘనీభవిస్తుంది. అలా బరువెక్కిన కణాలు నేల రాలే క్రమంలో దోవలో అధిక ఉష్ణోగ్రతకు లోనై, ద్రవీభవించడం వాన చినుకులుగా మారడం జరుగు తుంది. అదే వెచ్చటి మేఘాలలో అయితే సోడియం క్లోరైడ్, లేదా పోటాషియం క్లోరైడ్ లాంటి రసాయన ద్రావణాలను సీడింగ్ ఏజెంట్లుగా వినియోగిస్తారు.తొలి ప్రయోగాలు... తాజా అధ్యయనాలు...కృత్రిమ వర్ష ప్రయత్నాలు 1946లోనే జరిగాయి. అవపాతం జరిగే భౌతిక సూత్రాలను లోతుగా అవ గాహన చేసుకొనేందుకు అమెరికన్ రసాయనవేత్త, వాతావరణ నిపుణుడు విన్సెంట్ షేఫెర్ అప్పట్లోనే ల్యాబ్‌లో ప్రయోగాలు చేశారు. ఆయన డ్రై ఐస్‌తో ప్రయోగాలు చేస్తే, ఆ తర్వాత శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో కాక, బయటే అనేక ప్రయోగాలు చేశారు. సిల్వర్ అయొడైడ్ స్ఫటికాలను ఉపయోగించి, మెరుగైన ఫలితాలు సాధించారు. అనేక చోట్ల వర్షాలు కురిపించారు. పుణేకు చెందిన ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ’ మాత్రం 1970ల నుంచి ఈ ప్రయోగాలు చేస్తున్నామంటోంది. దీని వల్ల వర్షపాతం 17 శాతం మేర పెరిగినట్టు చెబుతోంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా క్లౌడ్ సీడింగ్. ఆశించిన ఫలితాలు అందించలేదని అమెరికన్ ప్రభుత్వ వర్గాల 2024 నాటి నివేదిక కూడా చెప్పింది. చదవండి: స్కిన్ కేర్‌పై క్రికెటర్ ప్రశ్న, ప్రధాని మోదీ సమాధానం ఏంటో తెలుసా?లాభమెంత? నష్టమెంత?మేఘమథనాన్ని ప్రేరేపించడానికి వాడిన సిల్వర్ అయొడైడ్ తాలూకు అవశేషాలు భూమిపై పడి, పర్యావరణానికి హానికరం కావచ్చని పరిశోధకుల తాజా అధ్యయనం మాట. అలాగే, డ్రై ఐస్ అంటే ఘనరూప కార్బన్ డయాక్సైడే గనక అది కూడా భూతాపాన్ని పెంచుతుందంటున్నారు. సీడింగ్‌కు విమానం, పైలట్లు, సాంకేతిక సిబ్బంది సేవలతో పాటు రసాయన మిశ్రమాలకు బాగా∙ఖర్చవుతుంది గనక అది ఏ మేరకు లాభదాయకమో స్పష్టత లేదు. గత ఏడేళ్ళుగా ఢిల్లీలో మేఘమథన ప్రతిపాదనలు వస్తున్నా, ఈసారే ప్రయోగాలు జరిగాయి. తాజా ప్రయత్నం విఫలమైనా, ప్రయోగాలు కొనసాగిస్తా మని ఐఐటి–కాన్పూర్ చెబుతోంది. వాయు కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలు మానేసి, ఇలా తాత్కాలిక ఉపశమనానికై పాకులాడ డమే విచిత్రం. (మమ్దానీ లవ్ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్ యువరాణి డయానా’) -
‘కోట్లు కుమ్మరించారు.. ఢిల్లీలో వర్షం కురవలేదు’
ఢిల్లీ: ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్‌కు బ్రేక్ పడింది. కాలుష్య రాజధానిగా మారిన ఢిల్లీలో వాయు కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని రేఖా గుప్తా సారథ్యంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్ ఫెయిల్ అయ్యింది. మేఘాలను చల్లబరిచి వర్షింపజేసే రసాయనాలను చల్లే విమానాలను రంగంలోకి దింపింది. ఐఐటీ–కాన్పూర్ సహకారం, సమన్వయంతో నిన్న (అక్టోబర్ 28, మంగళవారం)రాజధానిలో మేఘావృత గగనతలంలో మేఘమథన క్రతువుకు శ్రీకారం చుట్టింది. మరికొన్ని రోజుల పాటు ఈ విమానాలు రసాయనాలను వెదజల్లే ప్రక్రియ కొనసాగుతుందని కూడా ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మేఘాల్లో తగినంత తేమ లేకపోవడంతో వర్షం కురవలేదు. దీంతో ఈ ప్రక్రియను రాష్ట ప్రభుత్వం నిలిపివేసింది.ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. వర్షించని మేఘాల నుంచి చినుకులు కురిసేలా చేసే ఈ ప్రక్రియను సాధారణంగా క్లౌడ్–సీడింగ్ అంటారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.3.21 కోట్లు కేటాయించింది. అయితే, ఇది వాయు కాలుష్యానికి తాత్కాలిక ఉపశమనంగా పనిచేస్తుందని, ఖరీదైన ఈ ప్రక్రియను శాశ్వత పరిష్కారంగా భావించకూడదని పలువురు పర్యావరణవేత్తలు అంటున్నారు.ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ ఇవాళ(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. క్లౌడ్ సీడింగ్ ప్రయోగం ద్వారా కృత్రిమ వర్షం రాలేదు కానీ భవిష్యత్తు ప్రయత్నాలకు ముఖ్యమైన సమాచారం లభించిందని తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన 15 మానిటరింగ్ స్టేషన్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం, PM 2.5, PM 10 మలినాల స్థాయిల్లో 6–10 శాతం తగ్గుదల కనిపించిందని ఆయన చెప్పారు.కాగా, ఢిల్లీ స్థానిక ప్రాంతాలను కృత్రిమ వర్షాలతో తడిసి ముద్దచేసేందుకు ప్రత్యేక విమానాలు మంగళవారం(అక్టోబర్ 28) కాన్పూర్ నుంచి బయల్దేరాయి. ఢిల్లీలోని బురారీ, నార్త్ కరోల్ బాగ్, మయూర్ విహార్ వంటి ప్రాంతాల మీది మేఘాలపై ఈ విమానాలు సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ మిశ్రమాలను చల్లాయి. దాదాపు 20 శాతం తేమ ఉన్న మేఘాలను కృత్రిమ వర్షాల కోసం ఎంపిక చేశారు. సెస్నా రకం విమానం ఒక్కోటి 2–2.5 కేజీల బరువైన రసాయన మిశ్రమాన్ని వేర్వేరు చోట్ల వెదజల్లింది. దాదాపు 8 ప్రాంతాల్లో క్లౌడ్–సీడింగ్‌ను చేపట్టారు. -
Delhi: నేడు కృత్రిమ వర్షం.. కురిపిస్తారిలా.. ప్రయోజనమిదే..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెను సమస్యగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమంగా వర్షాలను కురిపించేందుకు సిద్ధమయ్యింది. శీతాకాలంలో క్షీణిస్తున్న గాలి నాణ్యతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీపావళి అనంతరం పొగ, దుమ్ము, పొగమంచు కలగలిసి ఢిల్లీని గ్యాస్ చాంబర్ మాదిరిగా మార్చాయి. దీనికి క్లౌడ్ సీడింగ్ (కృత్రిమ వర్షాలు) పరిష్కారం చూపనుంది.వాతావరణం అనుకూలిస్తే..వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఢిల్లీ ప్రభుత్వం నేడు (మంగళవారం)తొలి క్లౌడ్ సీడింగ్ ట్రయల్‌ను నిర్వహించనుందని సంబంధిత అధికారి తెలిపారు. ఈ పరీక్షను నిర్వహించే ముందు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా మీడియా సంస్థ పీటిఐకి తెలిపారు. ఈ ప్రయోగానికి ఉపకరించే విమానం కాన్పూర్ నుండి ఢిల్లీకి చేరుకుంటుందని, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే క్లౌడ్ సీడింగ్ ట్రయల్ నిర్వహిస్తామన్నారు. క్లౌడ్ సీడింగ్ ప్రయోగానికి సన్నాహాలు ఇప్పుటికే పూర్తయ్యాయి.రూ.3.21 కోట్ల వ్యయంప్రభుత్వం ఇటీవల బురారి మీదుగా ఒక టెస్ట్ ఫ్లైట్ నిర్వహించిందని, టెస్ట్ రన్ సమయంలో కృత్రిమ వర్షపాతాన్ని ప్రేరేపించేందుకు ఉపయోగించే చిన్న పరిమాణంలో సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ సమ్మేళనాలను విమానం నుండి విడుదల చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. వాయువ్య ఢిల్లీలో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించడానికి ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 25న ఐఐటీ, కాన్పూర్‌తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)కుదుర్చుకుంది. దీనికి ముందు ఢిల్లీ క్యాబినెట్ మే 7న రూ.3.21 కోట్ల వ్యయంతో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించాలనే ప్రతిపాదనను ఆమోదించింది.క్లౌడ్ సీడింగ్ అంటే..క్లౌడ్ సీడింగ్(కృత్రిమ వర్షం) అంటే మేఘాలలో రసాయనాలను విడుదల చేసి, వర్షం కురిసేలా చేసే విధానం . ఇందుకోసం సాధారణంగా సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ లాంటి రసాయనాలు వాడుతారు. మేఘాలు తగినంతగా ఉన్న సమయంలో ఈ రసాయనాలను వాటిలోకి చిమ్మి, నీటి బిందువులు ఏర్పడేలా చేస్తారు. దాంతో మేఘాలు వర్షం కురిపిస్తాయి. ఈ ఆపరేషన్ కోసం సెస్నా అనే చిన్న విమానాన్ని ఎంచుకున్నారు. ఇది శాస్త్రీయ ప్రయోగాలకు, తక్కువ ఎత్తులో ఎగరడానికి, కచ్చితమైన నియంత్రణ సామర్థ్యాలను కలిగివుంటుంది. ఈ విమానాన్ని ప్రత్యేకంగా క్లౌడ్ సీడింగ్‌కు ఉపయోగపడే విధంగా మార్పులు చేశారు.ఉపయోగాలివే..కృత్రిమ వర్షం కారణంగా గాలిలే తేలియాడే కాలుష్య కణాలు కిందికి చేరతాయి. ఫలితంగా గాలి శుభ్రపడి, ఆక్సిజన్ స్థాయి మెరుగుపడుతుంది. ఇది తాత్కాలిక పరిష్కారంగా కనిపించినప్పటికీ, కాలుష్యం అధికంగా ఉన్న సమయంలో ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ ప్రయోగానికి వాతావరణం అనుకూలించడం అత్యవసరం. సెస్నా విమానంతో చేసే ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో ఇతర నగరాల్లో కూడా ఇదే తరహాలో కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇది కూడా చదవండి: మరో నగరం పేరు మార్పు.. ముస్తఫాబాద్ ఇకపై.. -
దుబాయ్‌లో వర్షం ఎలా పడుతుందో తెలుసా..!
భారత్‌లో వర్షం కోసం మనం ఎదురూ చూడాల్సిన పరిస్థితి ఉండదు. కాలానుగుణంగా వర్షాలు పడుతూనే ఉంటాయి. మన దేశంలో కూడా కొన్ని వానలు కురవని ప్రాంతాలు ఉన్నాయి. అయితే మరీ అస్సలు పడకుండా మాత్రం ఉండదు. అయితే దుబాయ్‌లాంటి అరబ్ దేశాల్లో అస్సలు వర్షాలూ పడవనే విషయం ఎంతమందికి తెలుసు. అక్కడ ఏడాదంతా వేడి వాతావరణంతో పొడిపొడిగా ఉంటుందట. నీటి సమస్య కూడా ఎక్కువే. మరి అలాంటి ప్రదేశాల్లో వర్షం లేకపోవడం కారణంగా వ్యవసాయాధారిత పంటలు కూడా ఏమి ఉండవు. అందుకని వర్షం పడేలా వాళ్లు ఏం చేస్తారో తెలుసా..! ఆయా దేశాల్లో వర్షాలు పడకపోవడంతో కృత్రిమ వర్షం సృష్టిస్తారు. దీన్ని క్లౌడ్ సీడింగ్ అని పిలుస్తారు. వర్షం లేదా మంచు ఏర్పడటాన్ని ప్రోత్సహించడానికి పదార్థాలను గాలిలోకి వెదజల్లి వర్షం పడేలా చేస్తారు. ఈ విధానంలో సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లేదా డ్రై ఐస్ వంటి పదార్థాలతో మేఘాలను విత్తడం జరుగుతుంది. ఇవి నీటి బిందువులు చుట్టూ ఏర్పడటానికి కేంద్రకాలుగా పనిచేస్తాయి. ఈ కణాలకు తేమను ఆకర్షించే గుణం ఉండటం వల్ల పెద్దగా వర్షంలా పడేందుకు దారితీస్తాయి. ఈ పద్ధతి వర్షం లేదా మంచును ఉత్పత్తి చేయని మేఘాలలో వర్షపాతాన్ని ప్రేరేపిస్తాయి. అయితే దీన్ని దశాబ్దాలుగా ప్రయోగం చేస్తున్నప్పటికీ.. వాతారణ పరిస్థితులు, కారకాల కారణంగా ఒక్కోసారి ప్రభావం మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ విధానంలోనే వర్షం పడేలా చేస్తుంది. అక్కడ అధికారులు నీటి కొరత సవాళ్లను పరిష్కరించేందుకు ఈ వ్యూహాత్మక విధానాన్ని ఉపయోగిస్తుంటోంది. ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఎక్కువగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లోనే ఉపయోగిస్తారు. అక్కడ తీవ్రమైన వేడి వాతావరణం దృష్ట్యా నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. దీన్ని పరిష్కరించేందుకు యూఏఈ శాస్త్రవేత్తలు ఈ క్లౌడ్ సీడింగ్ అనే టెక్నాలజీని ఉపయోగించారు. అందుకోసం వారు దేశ వాతావరణంపై చాలా అప్రమత్తమైన నిఘా ఉంచుతారు. ఈ క్లౌడ్ సీడింగ్ పద్ధతితో పొడి వాతావరణ పరిస్థితుల్లో 30% నుంచి 35%, ఎక్కువ తేమతో కూడిన వాతావరణంలో 10% నుంచి 15% వరకు వర్షపాతాన్ని పెంచగలవని శాస్త్రవేత్తల చెబుతున్నారు. ఈ పద్ధతిలోనే దుబాయ్‌లో వర్షం పడేలా చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. This is Dubai's artificial rain which happens because of cloud seeding pic.twitter.com/O5Uqcf4xC7 — Historic Vids (@historyinmemes) April 8, 2024 (చదవండి: యుద్ధ భయంతో పడవ ఎక్కితే..నడి సంద్రంలో ఇంజన్ ఫెయిల్..!) -
చైనా: కరువుపై మేఘమథన అస్త్రం!
చాంగ్కింగ్(చైనా): దక్షిణ చైనాలో కరువు ఉరుముతోంది. ఎండలు మండిపోతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. నదుల్లో నీరు లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని, ఏసీలు వాడొద్దని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కరెంటు లేక ఫ్యాక్టరీలకు తాళాలు వేయాల్సి వస్తోంది. రిజర్వాయర్లలో నీరు అడుగంటుతోంది. తాగునీరు కూడా సరఫరా కావడం లేదు. కరువు నేపథ్యంలో కొన్నిచోట్ల అత్యవసర పరిస్థితిని సైతం ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కరువు సమస్యను అధిగమించడానికి మేఘ మథనంపై చైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మేఘాలపై రసాయనాలు వెదజల్లి, వర్షాలు కురిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. సిచువాన్, హూబే ప్రావిన్స్‌ల్లోనూ ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు చేతికి రాకుండా పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో పంటలను కరువు బారినుంచి కాపాడుకోవాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొంది. చైనాలో వర్షపాతం, ఉష్ణోగ్రతలను ప్రభుత్వం అధికారికంగా రికార్డు చేసే ప్రక్రియ 61 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యింది. ఇప్పటినుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ ఏడాదే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సిచువాన్ ప్రావిన్స్‌లో 45 డిగ్రీల సెల్సియస్(113 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదయ్యింది. దక్షిణ చైనాలో వరిసాగు అధికం. పంట దెబ్బతినకుండా కాపాడుకోవడానికి రాబోయే 10 రోజులు చాలా కీలకమని వ్యవసాయ శాఖ మంత్రి టాంగ్ రెంజియాన్ చెప్పారు. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసే అవకాశం లేదు. దాంతో చైనా సర్కారుకు ఇప్పుడు మేఘమథనం (క్లౌడ్ సీడింగ్) ఒక ప్రత్యామ్నాయంగా మారింది. డ్రోన్ల సాయంతో మేఘాలపై రసాయనాలు చల్లి, కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, ఉత్తర చైనాలో మాత్రం వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కింగాయ్ ప్రావిన్స్‌లో వరదల కారణంగా 26 మంది మృతిచెందారు. ఐదుగురు గల్లంతయ్యారు. -
చంద్రబాబుకు రఘువీరా సవాల్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మేఘమథనంలో అవినీతి చోటు చేసుకుందంటూ చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు చంద్రబాబుకు రఘువీరా లేఖ రాశారు. అనంతపురంలో ప్రముఖుల సమక్షంలో మేఘమథనంలో అవినీతి జరిగిందని చంద్రబాబు చేసిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. ఆ వ్యవహారంలో సీబీఐ లేదా హైకోర్టు, సుప్రీం కోర్టు, సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని రఘువీరా డిమాండ్ చేశారు.


