breaking news
chidrens died
-
పిల్లలకు విషమిచ్చి.. తల్లి..
సాక్షి, గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు మగ పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహతాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు విజయవాడలోని అస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన శంకర్ అనే ఐదేళ్ల బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి అంకమ్మ, మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక గన్నవరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముగ్గురు ఒకేసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణం, కుటుంబ కలహాలేనా.. లేక మరేమన్నా ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
వరంగల్ జిల్లాలో విషాదం
వరంగల్ : వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కేససముద్రం మండలం గుడిచందలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు నరేష్(8), సురేష్(8) మృతి చెందారు. వ్యవసాయబావి వద్దకు వెళ్లిన చిన్నారులు విద్యుత్ వైర్లు తెగిపడి ఉండటాన్ని గమనించక పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.