charita
-
నట్టింట నలుగురి ప్రాణాలు బలిగొన్న బైక్
పుంగనూరు : ద్విచక్ర వాహనం నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువులు పీల్చి, నిద్రలోనే నలుగురు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా పుంగనూరులో కలకలం రేపింది. పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉంటున్న మురళి, రేవతి దంపతులకు కార్తీక్ (15), సుమబిందు (14), చందన (7), చరిత (7) అనే నలుగురు పిల్లలున్నారు. మురళి తండ్రి రామచంద్ర కూడా వీరితో కలిసే ఉంటారు. ఈ క్రమంలో మురళికి చెందిన బజాజ్ సీటీ–100 ద్విచక్ర వాహనం మరమ్మతుకు గురైంది. మెకానిక్ వద్ద ఇంజిన్ బోరు చేయించాడు. మెకానిక్ సూచన మేరకు శనివారం రాత్రంతా బండిని స్టార్ట్ చేసి పెట్టాడు. అయితే బండి ఆన్‌లో ఉన్నందున ఎవరైనా తీసుకెళ్తారనే భయంతో ఏకంగా ఇంటి హాలులో ఉంచాడు. రాత్రి భోజనం చేశాక మురళి దంపతులు మిద్దెపైన రూములో నిద్రకు ఉపక్రమించారు. సుమబిందు బంధువుల ఇంటికి వెళ్లగా.. కింద ఇంట్లో తండ్రి రామచంద్ర (75), కుమారుడు కార్తీక్, కవల పిల్లలు చరిత, చందన తలుపులు వేసుకుని పడుకున్నారు. రాత్రి వారు ఆ బైక్ నుంచి వెలువడిన విష వాయువు (కార్బన్ మోనాక్సైడ్)ను పీల్చి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.ఉదయం మురళి, రేవతి కిందకు వచ్చి చూస్తే నలుగురూ అచేతనంగా పడి ఉన్నారు. తొలుత ఏం జరిగిందో తెలియక గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి పరిశీలించి, నలుగురు మృతి చెందినట్లు గుర్తించారు. బైక్‌కు బోర్ చేసిన తర్వాత ఇంజిన్ స్మూత్‌గా మారే సమయంలో విష వాయువులు వెలువడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడో అర్ధరాత్రి విష వాయువు వెలువడి ఉంటుందని, వారు నిద్రలో ఉన్నందున దాన్ని గుర్తించేలోపే అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెంది ఉంటారని వైద్యులు చెబుతున్నారు. సీఐ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మాజీ మంత్రి, సీనియర్ నేత డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి.. మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషాకు ఫోన్ చేసి ఘటనా స్థలానికి పంపారు. మృతుల కుటుంబాలను పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాతవద్దే పడుకుంటామంటూ తనువు చాలించారు ‘అమ్మా.. నాయనా.. మేము తాత కాడే పడుకుంటాం.. మీరు మిద్దెపైన పడుకోండి..’ అని శనివారం రాత్రి కన్నబిడ్డలు మాట్లాడిన మాటలను తలుచుకుంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. తాత కూలి పనులు చేస్తూ, తండ్రి కులవృత్తి (సెలూన్ షాపు) చేస్తూ సంతోషంగా ఉండేవారు. అందరూ కలిసి మెలసి ఉంటున్న తమలో నలుగురిని తమ సొంత ద్విచక్ర వాహనమే కబళించేస్తుందని మురళి, రేవతి దంపతులు ఊహించలేకపోయారు. వాహనాన్ని ఆన్ చేసి ఇంటి ముందు పెడితే దొంగల బెడదతో పాటు ఇరుగు పొరుగు వారు శబ్దానికి ఇబ్బందులు పడతారని భావించి ఇంటి లోపల హాల్లో ఉంచడమే తన కొంప ముంచిందని మురళి గుండెలవిసేలా విలపించాడు. హాలులో కిటికీ లేకపోవడంతో బైక్ నుంచి వెలువడిన విష వాయువు త్వరగా బయటకు వెళ్లే మార్గం లేకే ఈ దారుణం చోటు చేసుకుందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కర్నూలులో నీటి సమస్యపై మహా ధర్నా
-
నల్లగా ఉన్నావు....అందంగా లేవంటూ..
ఆదోని: అందంగా లేవని వేధించినా..నచ్చలేదంటూ మానసికంగా హింసించినా ఆ మహిళ తన భర్తను వదులు కోవడానికి ఇష్టపడలేదు. పలువురి వద్ద పంచాయితీలు జరిగినా ఏడుగడుగులు నడిచిన భర్తతోనే తన జీవితం అంటూ తెగేసి చెబుతోంది. ఉన్నతమైన సంస్కృతి, సంప్రదాయాల మధ్య తాను పెరిగానని, భర్తకు తగ్గట్టు నడుచుకుంటానని న్యాయం చేయాలంటూ దీక్షకు పూనుకుంది. తన కుటుంబ సభ్యులతో భర్త ఇంటి వద్దే బైఠాయించిన ఓ స్త్రీ 'చరిత' ఇది.. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన శేషమ్మ, వెంకటేశ్వరరెడ్డి దంపతుల కుమార్తె చరిత(అరుణ)కు ఏడాదిన్నర కిందట ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన చంద్రశేఖరరెడ్డితో వివాహమైంది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల వ్యాపారి అయిన చంద్రశేఖరరెడ్డి కుటుంబం ఆదోనిలోని తిరుమలనగర్‌లో నివాసం ఉంటోంది. ఎంటెక్ పూర్తి చేసిన చరిత హిందూపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లిలో చరిత తల్లిదండ్రులు కట్నకానుకల కింద చంద్రశేఖరరెడ్డికి రూ.5 లక్షల నగదు, 15 తులాల బంగారం ఇచ్చారు. నాలుగైదు నెలలు అన్యోన్యంగా ఉన్నా. ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. వ్యాపారం కోసం డబ్బు కావాలని అడిగితే చరిత తల్లిదండ్రులు మరో రూ.2 లక్షలు ఇచ్చారు. అయినా సంతృప్తి చెందని చంద్రశేఖరరెడ్డి.. భార్యను వేధించసాగాడు. "అందంగా లేవని, తన స్థాయికి తగిన సంబంధం కాదని, తనకొద్దని, ఇక ఇంటికి రావద్ద'ని చెప్పాడు. అతని తల్లిదండ్రులు చాముండేశ్వరి, రామచంద్రారెడ్డి కూడా మద్దతుగా నిలిచారు. తానేమి తప్పు చేశానో చెప్పాలని ఆమె భర్తను నిలదీశారు. అందంగా లేకపోతే పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఆదోనిలో కుల పెద్దలు, పోలీసులతో పంచాయితీ కూడా చేశారు. పెద్దల ముందు సరే అన్నా.. ఆతర్వాత చంద్రశేఖరరెడ్డి తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఇంటికి రాగానే దుర్భాషలాడడం, అవమానించడం నిత్యకృత్యం అయింది. తాను తప్పు చేసి ఉంటే చెప్పాలని, అకారణంగా ఏవో సాకులు చెప్పి ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదని నచ్చ చెప్పి సంసారం చేయాలనే కృత నిశ్చయంతో బుధవారం ఇక్కడి వచ్చానని ఆమె తెలిపారు. తనతోపాటు తాత విరుపాక్షరెడ్డి, పిన్నమ్మ లక్ష్మీదేవి, చిన్నాన్న జయచంద్రారెడ్డి వచ్చారని, ఎంత వేడుకున్నా కనికరం చూపక తమను ఇంటి నుంచి బయటకు నెట్టేసి తాళాలు వేసుకుని ఎక్కడికో వెళ్లిపోయారని చరిత విలేకరుల వద్ద కన్నీరు పెట్టారు. తనకు భర్త సర్వస్వమని, ఆయన లేని జీవితం తనకొద్దని, భర్త, అత్త,మామలు ఎలా నడుచుకోమంటే అలా నడుచుకోడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ విషయం ఎప్పడో చెప్పినా తనను నిరాదరణకు గురి చేయడం న్యాయం కాదని పేర్కొన్నారు. తనకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తాని అన్నారు. కాగా ఈ ఘటనపై ఆదోని పోలీసులు స్పందిస్తూ తమకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని తెలిపారు. -
నల్లగా ఉన్నావు..అందంగా లేవంటూ..


