breaking news
Chandra Mohan cintada
-
ఆరోగ్యకరమైన కామెడీ ఉంటుంది: దర్శకుడు చంద్రమోహన్ చింతాడ
‘అల్లరి’ నరేష్ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి, రాశి సింగ్, ప్రిషా, విష్ణుప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రమోహన్ చింతాడ మాట్లాడూ– ‘‘ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో సక్సెస్ కావాలని ఆశపడుతుంటారు.ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో దేవతలు ప్రత్యక్షమై మన ఆకాంక్షను నెరవేరిస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి మ్యాజిక్ నుంచి పుట్టిన కథే ఈ సినిమా. ఇందులో సినిమా హీరో కావాలన్నది హీరో కల. కానీ ఊర్లోనే ఉంటూ, ఏదో ఒక మ్యాజిక్ జరిగి, సినిమా హీరో కావాలని కోరుకుంటుంటాడు. ఈ క్రమంలో అతని కుటుంబంలో ఉన్న ఒక పుస్తకంలో ఓ ప్రత్యేక ప్యాటర్న్‌ను గీస్తే, రంభ–ఊర్వశి–మేనక ప్రత్యక్షం అవుతారు. దీంతో తాను హీరో అయిపోవచ్చని అనుకుంటుంటాడు. ఇందుకోసం అతను రంభ కోటి రాస్తాడు.ఊర్వశి ఉత్సవాలు చేస్తాడు. మేనక అంటూ మేనక మాల ధరిస్తాడు. చివరికి రంభ, ఊర్వశి, మేనక ప్రత్యక్షం అవుతారు. వీళ్లు భూమిపైకి దిగక ముందు అతని జీవితంలో ఏం జరిగింది? వీళ్ళు భూమిపైకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథ. కొంత గ్యాప్ తర్వాత హీరో నరేష్‌గారు మళ్లీ తన కంఫర్ట్ జోన్‌కు వచ్చి, ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది.ఈ సినిమాలో ఆరోగ్యకరమైన నవ్వులు ఉంటాయి. ఈ సినిమా షూటింగ్‌ను యాభై రోజుల్లోనే పూర్తి చేయాలని ΄ప్లాన్ చేసి, 44 రోజుల్లోనే పూర్తి చేశాం. నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. దర్శకుడిగా నా బలం కామెడీనే. నా తొలి సినిమా ‘రంభ ఊర్వశి మేనక’ ఫ్యాంటసీ కామెడీ బ్యాక్‌డ్రాప్ కావడం హ్యాపీగా ఉంది. నా కొత్త సినిమా వివరాలు త్వరలో చెబుతాను’’ అని అన్నారు. -
జోడీ కుదిరింది!
‘రన్ రాజా రన్’తో దర్శకుడు సుజిత్‌కు బ్రేక్ ఇచ్చిన శర్వానంద్ మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు. ‘డార్లింగ్’ చిత్రానికి దర్శకుడు కరుణాకరన్ దగ్గర పనిచేసిన చంద్రమోహన్ చింతాడ చెప్పిన కథ నచ్చి, ఆయన దర్శకత్వంలో నటించడానికి అంగీకరించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై భోగవల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘అందాల రాక్షసి’తో మంచి పేరు తెచ్చుకుని, సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్న లావణ్యా త్రిపాఠి ఈ చిత్రంలో కథానాయిక. ‘‘జూన్ 1న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మిగతా నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: భోగవల్లి బాపినీడు.


