breaking news
Central Control Room
-
అమెరికాలో 911..ఇక్కడ 112
న్యూఢిల్లీ : అమెరికాలో అత్యవసర సర్వీసులకు 911 నంబర్ ఉన్నట్లే, త్వరలో భారత్‌లో కూడా ఎమర్జన్సీ నంబర్ 112 అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా మహిళల ఒత్తిడికి సంబంధించి తొలుత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అన్ని విషయాలకు ఈ ఎమర్జన్సీ సర్వీస్ నంబర్‌ను ప్రవేశపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజా సంబంధ రవాణా వాహనాలలో ఓ బటన్ సర్వీస్ తీసుకురానున్నారు. ఈ ఎమర్జన్సీ నంబర్ కు వచ్చే కాల్స్ న్యూఢిల్లీలోని కేంద్ర కంట్రోల్ రూమ్‌కు వెళ్తాయి, తిరిగి అవే కాల్స్ సంబంధిత నగరాలకు ఆ కాల్స్‌ను కనెక్ట్ చేస్తారు. ఈ ఎమర్జీన్సీ సర్వీస్ కాల్స్ స్వీకరించి వివరాలు సేకరించేందుకు సుమారు 3000 నుంచి 4000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. ప్రతిరోజు 10 లక్షల కాల్స్ రావచ్చని అంచనాలున్నాయి. ల్యాండ్ లైన్, మొబైల్ నుంచి మాత్రమే కాదు యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. -
విపత్తుల నివారణకు ప్రణాళిక
అధికారులకు కలెక్టర్ ఆదేశం విశాఖ రూరల్: తుపాను ప్రభావిత మండలాల అధికారులు విపత్తుల నివారణకు ప్రణాళిక రూపొందించుకోవాలని, రెండు రోజుల్లో తన కార్యాలయానికి అందజేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి విపత్తుల నివారణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విశాఖ తీర ప్రాంతానికి తుపానుల ప్రభావం ఉండే అవకాశమున్నందున తీర ప్రాంతాల మండలాధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. తుపాను షెల్టర్లకు మరమ్మతులు వెంటనే నిర్వహించాలన్నారు. తుపాను సమయంలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సెంట్రల్ కంట్రోల్ రూమ్ నిర్వహిస్తే బాగుంటుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఏజేసీ న రసింహారావు మాట్లాడుతూ రెండేళ్లుగా వచ్చిన భారీ వర్షాలు, తుపాన్లు, పరిస్థితుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఆలోచనలకు రూపకల్పన చేసి విపత్తుల నివారణకు ప్రణాళిక తయారు చేయాలన్నారు. అంటు వ్యాధులపై అప్రమత్తం ఈ సీజన్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను కలెక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మలేరియా, డెంగీ, ఇతర అంటువ్యాధులకు సంబంధించిన కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రతి వారం మండలాల్లో పర్యటించే అధికార బృందం వ్యాధుల నివారణపై ప్రచారం చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ శ్యామల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డెంగీ, మలేరియా వ్యాధుల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలను కలెక్టర్‌కు వివరించారు.