breaking news
CCDMC
-
స్విస్ చాలెంజ్ తో లక్షకోట్లకు ఎసరు!
-
స్విస్ చాలెంజ్ తో లక్షకోట్లకు ఎసరు!
రాజధాని స్టార్టప్ ప్రాజెక్టు వెనుక మర్మమిదే.. బాబు బినామీలు, సింగపూర్ సంస్థల పక్కాప్లాన్ వాటాల మొదలు లాభాల వరకు అంతా మోసమే.. సాక్షి, హైదరాబాద్: సువిశాలమైన రహదారులు.. జల మార్గాలు.. కనుచూపు మేర విస్తరించిన పచ్చిక మైదానాలు.. అందమైన ఉద్యానవనాలు.. ఆహ్లాద వాతావారణాన్ని పంచే నదీ తీరం.. ప్లై ఓవర్లు.. ఆకాశహర్మా్యలు.. భూతల స్వర్గాన్ని తలపించే రీతిలో అంతర్జాతీయ నగరాలను తలదన్నేలా రాజధాని నిర్మిస్తామంటూ 3డీ సినిమా చూపించిన సీఎం చంద్రబాబు, సింగపూర్ సంస్థల కన్సార్టియం... రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పేర్చకుండానే రియల్ ఎస్టేట్ దందా చేసి రూ.లక్ష కోట్లు కొట్టేయడానికి పథకం వేశారు. అందులో భాగంగా మొదలుపెట్టిన రాజధాని ‘స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు’ ఓ పెద్ద కుంభకోణం. దీని కోసమే ‘స్విస్ చాలెంజ్’ పుట్టుకొచ్చింది. ఇప్పటివరకు ప్రతి అడుగునూ ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే వేసుకుంటూ వచ్చింది. స్థూలంగా ఇదీ కుంభకోణం... 1. సింగపూర్ సంస్థల కన్సార్టియం, సీసీడీఎంసీ(కేపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ)తో కలిసి ఏర్పాటుచేసే ఏడీపీ(అమరావతి డెవలపర్మెంట్ పార్టనర్)కు 1,691 ఎకరాలను అప్పగించింది. ఎకరం రూ.4 కోట్లుగా(కనీస ధర)గా నిర్ణయించింది. 1,691 ఎకరాల విలువ రూ.6,764 కోట్లు. 2. ఈ భూమికి రహదారులు, నీటి సౌకర్యం, వరద మళ్లింపు వంటి కనీస సదుపాయాలు కల్పించేందుకు రూ.5,500 కోట్లు ఖర్చు చేయడానికి సర్కారు అంగీకరించింది. అంతే కాదు.. ఏడీపీలో సీసీడీఎంసీ వాటా రూపంలో రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. వెరసి రూ.12,485.9 కోట్లను ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందన్న మాట. ఇంత పెట్టుబడి పెట్టినా సీసీఎండీసీకి దక్కే వాటా ఎంతో తెలుసా..? కేవలం 42 శాతం మాత్రమే. 3. రూ.306.4 కోట్ల పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియంకు దక్కే వాటా 58 శాతం. అంతేకాదు.. సింగపూర్ కన్సార్టియంకు తొలుత 50 ఎకరాలు, ఆ తర్వాత 200 ఎకరాలను ఉచితంగా కట్టబెట్టేందుకు సర్కార్ అంగీకరించింది. ఇప్పటికిప్పుడు ఎకరం కనిష్ఠంగా రూ.20 కోట్లకు విక్రయించినా.. ఆ సంస్థలు పెట్టే పెట్టుబడి పోను ఆదిలోనే రూ.4,693.6 కోట్ల లాభం సింగపూర్ కన్సార్టియం దక్కించుకోనుంది. 4. ఇదొక ఎత్తయితే.. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ఇచ్చే వాటాను గోప్యంగా ఉంచడం మరొక ఎత్తు. ఆ గోప్యత వెనుక దాగిన వాస్తవం ఏమిటంటే.. ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా సీఎం చంద్రబాబు బినామీలు, సింగపూర్ కన్సార్టియం గుప్పిట్లోని మేనేజ్మెంట్ కంపెనీ ముసుగులో రూ.లక్ష కోట్లు కొట్టేయడానికి పక్కాగా ప్లాన్ వేశారు. తెరపైకి స్విస్‌చాలెంజ్ ఇలా.. రాజధాని ప్రకటనను తన కోటరీకి ముందే లీకులు ఇచ్చి ‘ఇన్సైడర్ ట్రేడింగ్’కు పాల్పడి అత్తెసరు ధరలకే రైతుల భూములు కొట్టేసి రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. రాజధాని నిర్మాణం ముసుగులో తొలి దశలోనే మరో రూ.లక్ష కోట్లు కొల్లగొట్టడానికి సర్కారు పెద్దలు ప్లాన్ వేశారు. అందులో భాగంగానే రాజధాని ‘స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు’కు అంకురార్పణ చేశారు. ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ యాక్ట్(ఏపీడీఈఏ)–2001 చట్టాన్ని సింగపూర్ సంస్థల కన్సార్టియంకు చుట్టంగా మార్చి.. స్విస్ విధానంలో అసెండాస్–సిమ్బ్రిడ్జ్–సెమ్్బకార్ప్(సింగపూర్ సంస్థల కన్సార్టియం)లతో కలిసి ప్రతిపాదనలు రూపొందించారు. వాటికన్నా మెరుగైన ప్రతిపాదనలు ఉంటే దాఖలు చేసుకోవచ్చునంటూ జూలై 18న స్విస్ విధానంలో నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుతో వచ్చే ఆదాయంతో సింగపూర్ సంస్థల కన్సార్టియం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తాయన్నది గోప్యంగా ఉంచాయి. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు 1,691 ఎకరాలు రాజధానికి భూసమీకరణ ముసుగులో 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా లాక్కుంది. ఇందులో 1,691 ఎకరాల భూమిని రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం సింగపూర్ సంస్థల కన్సార్టియంకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ భూమిలో 371 ఎకరాల్లో రహదారులు, పార్కులు, మురుగునీటి కాలువలు వంటి కనీస మౌలిక సదుపాయాలకు కేటాయించారు. తొలి విడతగా 50 ఎకరాలు.. రెండో దశలో 200 ఎకరాల భూమిని సింగపూర్ సంస్థలకు ఉచితంగా అప్పగించడానికి ప్రభుత్వం అంగీకరించింది. 50 ఎకరాల్లో ఉత్రే్పరక అభివృద్ధి కింద సింగపూర్ సంస్థలు ఎనిమిది లక్షల చదరపు గజాల్లో భనవాలు నిర్మిస్తాయి. ఈ 250 ఎకరాల్లో నిర్మించే భవనాలను విక్రయించగా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి పైసా వా టా కూడా సింగపూర్ సంస్థల కన్సార్టియం ఇవ్వదు. ఇది పోను మిగతా 1,070 ఎకరాలను అభివృద్ధి చేసి.. ప్లాట్లుగా వేసి విక్రయిస్తారు. ప్లాట్లు విక్రయించగా వచ్చిన ఆదాయంలో ఈ ప్రాజెక్టుకు అభివృద్ధికి వెచ్చించే వ్యయంపోనూ.. మిగతా సొమ్ములో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ సంస్థలు గోప్యంగా ఉంచాయి. ఇందుకు ప్రభుత్వం అంగీకరించింది. మేనేజ్మెంట్ కంపెనీ ముసుగులో.. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల నియమించే మేనేజ్మెంట్ కంపెనీకి ఏడీపీ అప్పగించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేనేజ్మెంట్ కంపెనీ ఏదన్నది ప్రతి పాదనల్లో వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. ఆ మేనేజ్మెం ట్ కంపెనీ సీఎం చంద్రబాబునాయుడు బినామీలది కావడం వల్లే గోప్యంగా ఉంచారన్నది బహిరంగ రహస్యం. ఈ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును అభివృద్ధి చేయడంతోపాటు ప్లాట్లనూ విక్రయిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఏ పని చేపట్టినా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆడిటింగ్ చేస్తా యి. అక్రమాలపై ఎవరైనా పోలీసులను, కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది. ఆడిటింగ్‌కు దక్కకుండా.. సీఆర్పీసీ, ఐపీసీ చట్టాలకు చిక్కకుండా దోపిడీ చేసేందుకే ‘మేనేజ్మెంట్ కంపెనీ’ అనే బినామీ ప్రైవేటు సంస్థను సీఎం చంద్రబాబు, సింగపూర్ సంస్థల కన్సార్టియం తెరపైకి తెచ్చాయి. ఈ సంస్థ ఎకరం రూ.20 కోట్లకు విక్రయించి.. రూ.4 కోట్లకు పైన ఎంతోకొంత నామమాత్రపు ధరకు అమ్మినట్లు లెక్కలు చూపించినా ప్రశ్నించే అధికారం రాష్ట్ర ఆడిటింగ్ అధికారులకుగానీ.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కుగానీ ఉండదు. ఒకవేళ ఏవైనా వివాదం ఉంటే.. ఇంగ్లాండ్‌లోని లండన్ కోర్టును ఆశ్రయించాల్సిందే! సీసీఎండీసీకి దక్కేది సున్నా.. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో 1070 ఎకరాలను విక్రయించగా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి వాటా ఇవ్వగా మిగిలిన సొమ్ము ఏడీపీకి వస్తుంది. ఎకరం రూ.4 కోట్లు అంతకన్నా కాస్త ఎక్కువకు విక్రయించి.. ప్రభుత్వానికి గ్రాస్ రెవెన్యూ షేర్లో పది శాతం వాటా ఇస్తే ఏడీపీకి దక్కేది రూ.3852 కోట్లు. ఏడీపీకి ఇచ్చే 250 ఎకరాల్లో ఎకరం రూ.నాలుగు కోట్ల చొప్పున విక్రయిస్తే వచ్చే సొమ్ము రూ.వెయ్యి కోట్లును కలిపితే రూ.4,852 కోట్లు వస్తుంది. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వ్యయం రూ.3137 కోట్ల నుంచి ఏటా 20 శాతం చొప్పున పెరిగితే.. సీసీడీఎంసీకి దక్కేది బూడిదే. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో నష్టం వస్తే ఆ మేరకు సింగపూర్ సంస్థలకు పరిహారం చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే సింగపూర్ సంస్థలు లండన్ కోర్టులో కేసు వేస్తాయి. ఆ కోర్టు ఏ మేరకు జరిమానా విధిస్తే ఆ మేరకు ప్రభుత్వం ఆ సంస్థలకు పరిహారం చెల్లించాల్సిందే. రూ.లక్ష కోట్ల దోపిడీ ప్లాన్ ఇదీ.. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు 20 ఏళ్లపాటు అమల్లో ఉంటుంది. అంతకన్నా ముందు ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేస్తే సింగపూర్ సంస్థల కన్సార్టియం పెట్టిన పెట్టుబడికి 150 శాతం మేర అపరాధ రుసుం చెల్లించాలి. ఆ సంస్థలు తీసుకున్న బ్యాంకు రుణాలను ప్రభుత్వమే చెల్లిం చాలి. ఒకవేళ సింగపూర్ సంస్థల కన్సార్టియం ప్రాజెక్టు నుంచి వైదొలగినా ఆ సంస్థలు పెట్టిన పెట్టుబడిని వంద శాతం ప్రభుత్వం చెల్లించాలి. బ్యాంకు రుణాలను చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. 20 ఏళ్లపాటు రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు సింగపూర్ కన్సార్టియం చేతుల్లో ఉండేలా ప్లాన్ వేశారు. మేనేజ్మెంట్ కంపెనీని అడ్డుపెట్టుకుని తాము అనుకున్నది అనుకున్నట్లు చేయడానికి ఎత్తువేశారు. ఎకరం భూమి కనీస ధర రూ.4 కోట్లకు ఎంతో కొంత నామమాత్రపు మొత్తాన్ని.. అంటే ఓ పాతిక లక్షలో యాభై లక్షలో కలిపి అమ్మినట్లు చూపిస్తారనుకుందాం. అది మాత్రమే వైట్ మనీ. ఎకరం రూ.20 కోట్లకు అమ్మినా అడిగేవారుండరు. ఎందుకంటే తమ చెప్పుచేతల్లో ఉండే మేనేజ్మెంట్ కంపెనీ యే ఈ అమ్మకాల లావాదేవీలను చూస్తుంది కాబట్టి మిగిలిన బ్లాక్‌మనీ అంతా దోచుకుంటారన్నమాట. గతంలో చంద్రబాబు హయాంలో ఎమ్మార్ విషయంలోనూ జరిగిందిదే. ఇదే తరహాలో మొత్తం భూమిని సింగపూర్ సంస్థల కన్సార్టియం, చంద్రబాబు బినామీలు కొట్టేయడానికి స్కెచ్ వేశారు. రాజధానిలో అత్యంత ప్రధానమైన ప్రాంతంలో ఇప్పటికప్పుడు గజం కనిష్ఠంగా రూ.40 వేలు పలుకుతుంది. ఈ లెక్కన ఎకరం రూ.20 కోట్లు పలుకుతుంది. 20 ఏళ్లలోపు ఎకరం రూ.50 కోట్లకుపైగా పలుకుతుందని సాక్షాత్తూ సీఎం చంద్రబాబే చెబుతున్నారు. ఈ లెక్కన ఎకరం రూ.50 కోట్ల చొప్పున 1070 ఎకరాల భూమిని అమ్మి రూ.53,500 కోట్ల ను చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థల కన్సార్టియం సొమ్ము చేసుకోనున్నాయి. తొలుత 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాల భూమి సింగపూర్ సంస్థల కన్సార్టియంకు సర్కార్ కట్టబెట్టనుంది. ఈ 250 ఎకరాలను ఎకరం రూ.50 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.12,500 కోట్లు ఆ సంస్థలు సొమ్ముచేసుకున్నాయి. అంటే.. సింగపూర్ సంస్థలు పెట్టే రూ.306.4 కోట్ల పెట్టుబడికి 20 ఏళ్లలోగా రూ.12,193.60 కోట్ల లాభం దక్కించుకోనున్నాయి. మొత్తమ్మీద స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే కనిష్ఠంగా రూ.65,693.60 కోట్లు.. గరిష్ఠంగా రూ.లక్ష కోట్లను చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థలు కాజేయనున్నట్లు స్పష్టమవుతోంది. 1691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే ఈ స్థాయిలో దోచుకుంటే 33 వేల ఎకరాల రాజధాని నిర్మాణంలో ఏ స్థాయిలో దోపిడీ చేయడానికి ప్లాన్ వేశారన్నది అంచనాలకే అందడం లేదు. సింగపూర్ సంస్థల చేతుల్లోనే అంతా.. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల కన్సార్టియం, సీసీడీఎంసీలతో ఏర్పాటయ్యే ఏడీపీ(అమరావతి డెవలపమెంట్ పార్టనర్) చేపడుతుంది. ఏడీపీ ఛైర్మన్‌గా సింగపూర్ సంస్థల ప్రతినిధి వ్యవహరిస్తారు. ఏడీపీలో ఆరుగురు సభ్యుల్లో నలుగురు సభ్యులు సింగపూర్ కన్సార్టియం ప్రతినిధులే ఉంటారు. అంటే.. ఏడీపీపై పూర్తి పెత్తనం సింగపూర్ సంస్థల కన్సార్టియందే. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం రూ.3137 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా రూ.306.4 కోట్లు. సీసీడీఎంసీ వాటా రూ.221.9 కోట్లు. మిగతా రూ.2618.70 కోట్లను బ్యాంకుల్లో భూమిని తనఖా పెట్టి రుణం రూపంలోనూ ప్లాట్లు విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని వెచ్చిస్తారు. రహదారులు, మురుగునీటి కాలువలు వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ నిధులను ఖర్చు చేస్తుంది. ప్రచార ఖర్చులు, కన్సల్టెన్సీ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, మేనేజ్మెంట్ ఫీజు, వేతనాల రూపంలోనే సింగపూర్ సంస్థల కన్సార్టియం కొట్టేయనుంది. ప్రభుత్వానికి గరిష్టంగా రూ.12,057 కోట్ల నష్టం ఏడీపీలో సింగపూర్ సంస్థల కన్సార్టియంది 58 శాతం వాటా.. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీడీఎంసీ వాటా 42 శాతం. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు ప్రాథమికంగా రూ.3,137 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆ వ్యయం ఎంతకైనా పెరగవచ్చు. ఆ మేరకు నిబంధనలు కూడా చేర్చారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా 1,070 ఎకరాలను.. ఎకరం రూ.4 కోట్లకు పైన నామమాత్రపు మొత్తానికి విక్రయించగా వచ్చే మొత్తం ఆదాయంలో ప్రభుత్వం ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ కన్సార్టియం బహిర్గతం చేయలేదు. ఒకవేళ ఎకరం రూ.నాలుగు కోట్లకే విక్రయించి, పది శాతం వాటా ఇస్తే.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.428 కోట్లు.. 20 శాతం వాటా ఇస్తే రూ.956 కోట్లు.. ఒకవేళ 50 శాతం వాటా ఇవ్వడానికి సింగపూర్ కన్సార్టియం ముందుకొచ్చిన సర్కారు దక్కే ఆదాయం రూ.2,140 కోట్లు మాత్రమే. అంటే.. ప్రభుత్వం రూ.12,485.9 కోట్లు పెట్టుబడి పెట్టుబడి పెడితే కనిష్ఠంగా రూ.10,345.9 కోట్లు(ప్రభుత్వానికి 50 శాతం వాటా ఇస్తే).. గరిష్ఠంగా రూ.12,057.9 కోట్ల(సర్కార్‌కు పది శాతం వాటా ఇస్తే) నష్టం వస్తుందన్న మాట. -
టూరిజానికి 10 వేల ఎకరాలు
ల్యాండ్ పూలింగ్ రెండో దశ ► కృష్ణానదికి ఉత్తరాన భూసమీకరణ ► జిల్లాలోని నందిగామ,కంచికచర్ల ప్రాంతాల ఎంపిక ► క్యాపిటల్ పరిధి పెంపు ► మంగళగిరి, విజయవాడల్లో ప్రత్యేక అభివృద్ధికి సీసీడీఎంసీ ► రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాజధాని ల్యాండ్ పూలింగ్ పిడుగు జిల్లాపైనా పడనుంది. ఇప్పటివరకు కృష్ణానదికి దక్షిణం వైపున గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో రాజధాని కోసం ప్రభుత్వం భూ సమీకరణ చేసింది. త్వరలో రెండో దశ కింద టూరిజం అభి వృద్ధి చేయడానికి కృష్ణాజిల్లాలో కూడా భూములు సమీకరించనుంది. ఇందుకోసం కృష్ణానదికి ఉత్తరం వైపున ఐదు నుంచి పది వేల ఎకరాలు తీసుకునేందుకు నిర్ణయించినట్లు రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి.నారాయణ బుధవారం చెప్పారు. ఇదికాక నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో కొంత భూమిని సమీకరించేందుకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు పూర్తిస్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది. కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లో రాజధాని ఉద్యోగులకు క్వార్టర్లు కట్టించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాజధాని నుంచి కృష్ణానది మీదుగా వారధులు నిర్మించేందుకు నిర్ణయం తీసుకోవడంతో అక్కడి నుంచి కంచికచర్ల, నందిగామ ప్రాంతాలకు వెళ్లిరావడం తేలిగ్గా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. హైదరాబాద్‌కు వెళ్లే రహదారి కావడంతో ఇక్కడి భూములకు మంచి డిమాండ్ ఉంది. రాజధాని తుళ్లూరు కావడం వల్ల కూడా ఇక్కడి భూములకు మంచి ధర వచ్చింది. రైతులు తమ భూములకు మంచి ధర వచ్చిందనే ఆనందంలో ఉన్న సమయంలో ఇక్కడ కూడా ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకుంటారని చూచాయగా తెలియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్యాపిటల్ పరిధి 375 చ.కి.మీటర్లకు పెంపు... క్యాపిటల్‌గా ఇప్పటికే 225 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని నిర్ణయించారు. దీనిని 375 చదరపు కిలోమీటర్ల పరిధికి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు క్యాపిటల్ పరిధిలో ఉండే విజయవాడ, మంగళగిరి పట్టణాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ (సీసీడీఎంసీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. దీనివల్ల కూడా నగరంలో కొన్ని భూములు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు సేకరించే పనిలో సీఆర్డీఏ అధికారులు ఉన్నారు. భవానీ ద్వీపం చాలదా? టూరిజం అభివృద్ధి కోసం భవానీద్వీపం చాలదా.. అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో ల్యాండ్ పూలింగ్ జరిపేందుకు మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుపట్టారు. ఇప్పటికే తుళ్లూరు మండలంలో ఏ స్థాయిలో భూములు తీసుకోవాలో ఆ స్థాయిలో తీసుకున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు చెబుతున్న ప్రకారం నదికి ఉత్తరం వైపున భూములు తీసుకుంటే వాస్తు శాస్త్రం అంగీకరించదు కదా అంటూ ఛలోక్తి విసిరారు. - వడ్డే శోభనాద్రీశ్వరరావు,మాజీ మంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధాని పేరుతో ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే. రాజధాని పరిధిలోని రైతులను, కూలీలను, కౌలుదారులను, వ్రుత్తిదారులను రోడ్డున పడేసే కుట్ర జరుగుతోంది. నిర్దిష్టమైన ప్రాజెక్టు కోసం ముందుగా ప్రభుత్వ భూములను, తరువాత చౌడు, తక్కువ పంట పండే భూములను సేకరించాలి. వీటన్నింటినీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా పాలకవర్గ ప్రతినిధులు, అనుచరుల ప్రమేయం కోసం భూ సేకరణ చేస్తోంది. హనుమాన్ సుగర్స్ కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీకి చెందిన 118 ఎకరాల భూమిని కేవలం రూ.10 కోట్లకు గోకరాజు గంగరాజుకు కట్టబెట్టారు. కార్మికుల పొట్టగొట్టి ప్రస్తుతం ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ కట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తక్కువ ధరకు భూములను కట్టబెట్టి తదుపరి ఎన్నికలకు నిధుల సేకరణ, ఓట్ల కొనుగోళ్లు కోసం భూ సేకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పారిశ్రామిక అభివ ృద్ధికి మేము వ్యతిరేకం కాదు. అయితే నిరుద్యోగులకు ఉపాధి కల్పన, ఇతర అంశాలపై పాలకులకు ద ృష్టి లేదు. - ఎం.హరిబాబు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రబాబుది భూ దాహం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పేరుతో లక్షల ఎకరాల భూమిని సమీకరిస్తున్నారు. అవసరానికి మించి భూమిని సేకరించి యోగా గురువులు, బాబాలు, కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు లక్ష ఎకరాలు సేకరించి భూ బ్యాంక్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనది భూ దాహం. రైతుల చేతుల్లో సెంటు భూమి లేకుండా లాక్కునేందుకు సిద్ధమయ్యారు. దీనిని రైతు సంఘం తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అడ్డగోలుగా భూములు తీసుకోవడం సరికాదు. - రావుల వెంకయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం -
రాజధాని అభివృద్ధి కోసం నూతన కమిటీ
-
రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం తరపున మరోసంస్థ
-
రాజధాని అభివృద్ధి కోసం నూతన కమిటీ
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రతిపాదిత ప్రాంతాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు పురుపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్ మెంట్ కమిటీ (సీసీడీఎంసీ) పేరుతో కార్యకలాపాలు సాగించే ఈ కమిటీ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం లభించిందని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రివర్గ సమావేశం అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంతో రైలు, వాయు, బస్సు, ట్రాన్సిస్ట్, వాటర్ సప్లై, డ్రైనేజ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాలన్నింటిని సీసీడీఎంసీయే స్వయంగా చేపడుతుందన్నారు. 7,325 చదరపు కిలోమీటర్ల సీఆర్డీఏ పరిధి నుంచి రాజధాని కోసం నిర్దేశించిన 225 చదరపు కిలోమీటర్లలో మాత్రమే సీసీడీఎంసీ కార్యకలాపాలు సాగిస్తుందని వివరించారు. టూరిజం అభివృద్ధి కోసం 10 వేల ఎకరాల్ని సీసీడీఎంసీ తీసుకుంటుందన్నారు.సరస్సుల నిర్మాణానికి వెయ్యి ఎకరాలు కేటాయించామని, దీనివల్ల సీడ్ క్యాపిటల్ మరింత పెరిగే అవకాశముందన్నారు. దీనితోపాటు మంగళగిరి, విజయవాడ నగరాలను ఎలా అభివృద్ధి చేయాలన్నదానిపైనా కమిటీ దృష్టిసారిస్తుందన్నారు. ఇందుకోసం సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన ప్లాన్ మే 15 నుంచి 20 లోగా ఏపీ ప్రభుత్వానికి అందుతుందన్నారు. ప్లాన్ అందిన వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు.