breaking news
Catherin teressa
-
చీరలో అందాల భామలు.. భాగ్యశ్రీ ఇలా శ్రద్ధా అలా
నల్లని చీరలో మెరిసిపోతున్న భాగ్యశ్రీ బోర్సేట్రాన్స్పరెంట్ చీరలో నవ్వుతూ శ్రద్ధా శ్రీనాథ్ఆస్ట్రేలియా ట్రిప్‌లో నటి శ్రేయ ధన్వంతరిజిమ్లో తెగ కష్టపడిపోతున్న సారా అలీ ఖాన్స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతున్న వాణీ కపూర్చీరలో అందాల కుందనపు బొమ్మలా కేథరిన్ View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Vaani Kapoor (@vaanikapoor) -
బర్త్‌డే స్ఫెషల్.. హీరోయిన్ క్యాథరిన్ ట్రెసా స్టైలీష్ ఫోటోలు
-
నేను సిక్స్ కొట్టాలనే దిగుతా
‘‘చాలామంది దగ్గర తెలివితేటలు, ప్రతిభ ఉంటాయి. కానీ స్వచ్ఛమైన ప్రతిభ, మంచితనం, తెలివితేటలు కలిపి ఉన్న మనిషి విజయ్. అతని ప్రయాణం ప్రారంభ దశలోనే ఉంది. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లు. కె.ఎస్. రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఒకనాడు నేను ఈర్ష్య పడేంత ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు. సినిమాని ఆయన ప్రేమించినంతగా నేను ప్రేమిస్తానా? అని నాకే ఒక్కోసారి సందేహం వస్తుంటుంది’’ అన్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘అప్పట్లో చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలని తీశారు రామారావుగారు. మళ్లీ అంతకు మించిన హిట్ ఈ సినిమా ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘నేను, కేఎస్ రామారావు విజయవాడ నుంచి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. ఒక నిర్మాతగా ఆయనతో పోటీపడేవాణ్ని. మా సంస్థ నుంచి వచ్చిన ఒక ఆణిముత్యం విజయ్’’ అన్నారు నిర్మాత సి. అశ్వినీదత్. ‘‘ఈ సినిమాతో విజయ్ మరోసారి అందర్నీ అలరిస్తాడని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత డి. సురేష్ బాబు. ‘‘అర్జున్ రెడ్డి’కి ముందు, ‘అర్జున్ రెడ్డి’కి తర్వాత అనేలా విజయ్ కెరీర్ నడుస్తోంది. తన ఫ్యాన్స్, ప్రేక్షకులకు వినోదం కావాలని కోరుకుంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ రాశా’’ అన్నారు క్రాంతిమాధవ్. ‘‘విజయ్ ఎనర్జీ ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది. విజయ్, రాశీ ఖన్నా పోటాపోటీగా నటించారు’’ అన్నారు కేఎస్ రామారావు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘2016లో ‘పెళ్ళిచూపులు’ సినిమాతో ఒక లీడ్ యాక్టర్‌గా మీ ముందుకు వచ్చా. ఈ నాలుగేళ్లలో హిట్లు కొట్టినం.. చేతి నుంచి జారిపోయిన సినిమాలూ ఉన్నాయి. ఈ జర్నీలో స్థిరమైన వాటిలో మీరు (ఫ్యాన్స్) ఉన్నారు. నేను సిక్స్ కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్, డబుల్ నాకు ఓపిక లేదు. ఇక నుంచి సిక్సులు కొట్టడానికే చూస్తా’’ అన్నారు. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా, ఇజాబెల్లా, కేథరిన్, రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ మాట్లాడారు. -
గోపిచంద్ కోసం ఇద్దరు హీరోయిన్లు
లౌక్యం, జిల్ సినిమాలతో ట్రాక్ ఎక్కినట్టే కనిపించిన మాస్ హీరో గోపిచంద్ సౌఖ్యం సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. యాక్షన్ డ్రామాలను పక్కనపెట్టి కామెడీ మీద దృష్టి పెట్టిన ఈ టాల్, స్టార్ ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఆక్సిజన్ సినిమాలో నటిస్తున్నాడు. చాలా రోజులు తరువాత స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా కావటంతో ఆక్సిజన్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ స్టార్ కాస్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆక్సిజన్ సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు గోపిచంద్. రచ్చ, బెంగాళ్ టైగర్ సినిమాల సక్సెస్‌తో మాస్ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న సంపత్ నంది దర్వకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇప్పటికే కథా కథనాలు కూడా ఫైనల్ అయిన ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఈ సినిమాలో గోపిచంద్ ఆడిపాడేందుకు ఇద్దరు ముద్దుగుమ్మలను ఫైనల్ చేశారు సంపత్ నంది. సరైనోడు సినిమా సక్సెస్‌తో మంచి ఫాలో ఉన్న కేథరిన్ థెరిస్సా తొలిసారిగా గోపిచంద్‌తో జతకడుతుండగా, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా ఉన్న హన్సికను మరో హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.


