breaking news
cases booked
-
షీ టీమ్ చెప్తున్న రక్షణ పాఠాలు
గత డిసెంబర్ నెలలో షీ టీమ్ పోలీసులు జంట నగరాల్లో 90 కేసులు బుక్ చేశారు. స్త్రీలను పోకిరీలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, వారి భరతం ఎలా పట్టారో తెలుసుకుంటే మరింత జాగ్రత్తగా, ధైర్యంగా ఉండొచ్చు... నగరంలోగానీ, మరెక్కడైనా కానీ.ఒక ఇంజినీరింగ్ విద్యార్థిని ‘రాపిడో’ బుక్ చేసుకుంది. ఆ రాపిడో డ్రైవర్ ఆ విద్యార్థిని నంబర్ నోట్ చేసుకొని పదే పదే ఆమెకు ఫోన్ చేయసాగాడు. ఆ తర్వాత అశ్లీలమైన మెసేజ్‌లు చేస్తున్నాడు. అమ్మాయి ముందు ఆందోళన పడింది. ఆ తర్వాత ధైర్యం చేసి షీ టీమ్‌కు ఫోన్ చేసింది. ఇంకేముంది? కుర్రాడికి తగిన ‘మర్యాద’ జరిగింది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 292 ప్రకాశం కేసు బుక్ అయ్యి నాంపల్లి కోర్టు ద్వారా ఆ పోకిరీకి 7 రోజుల సాధారణ జైలు శిక్ష పడింది.మరో అమ్మాయిని పక్కింటి ‘అంకుల్’ గారు ఫాలో అవుతున్నారు. రోజూ అమ్మాయి కాలేజీకి వెళుతుంటే వెనుక నడుస్తూ కాలేజీ దాకా వస్తున్నారు. అమ్మాయి ఈ విషయాన్ని షీ టీమ్‌కు చెప్పింది. షీ టీమ్ అంకుల్ గారి మీద కేసుగట్టి నాంపల్లి కోర్టులో ప్రవేశ పెడితే 7 రోజుల సాధారణ జైలు శిక్ష పడింది.ఇంకొక పెద్దమనిషి ఏం చేశాడంటే ఒక మహిళ ఇన్‌స్టా అకౌంట్ నుంచి ఆమె ఫొటోలు, వీడియోలు డౌన్లోడ్ చేసి వాటితో ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇలాంటి పని చాలా ఆందోళన కలిగించేదే. కాని ఆ మహిళ వెంటనే షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ పెద్దమనిషిని అరెస్ట్ చేశారు. కోర్టు జైలు శిక్ష విధించింది.ఇవన్నీ డిసెంబర్ 2025 నెలలో హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఘటనలు. డిసెంబర్లో జంట నగరాల నుంచి మొత్తం 98 ఫిర్యాదులు షీ టీమ్‌కు వస్తే వాటిలో 14 ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 13 మందిని ఘటనా స్థలంలోనే పట్టుకున్నారు. అంటే ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే షీ టీమ్‌కు కాల్ చేయగానే వచ్చి పట్టుకున్నారన్న మాట. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. 2025లో స్త్రీలకు సురక్షిత నగరాల సూచీలో హైదరాబాద్ 4వ స్థానంలో ఉంది. బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. స్త్రీల రక్షణ కోసం యాప్స్ ఉన్నాయి. షీ టీమ్స్ ఉన్నాయి. కావలసిందల్లా ... ‘‘వాళ్లు ఉన్నారు, వెంటనే స్పందిస్తారు’’– అనే చైతన్యం కలిగి ఉండటమే. విద్య, ఉపాధి, ఉద్యోగం, వ్యక్తిగత పనులు... వీటి కోసం నగరంలో బయట తిరిగేటప్పుడు, నివాసం ఉన్న చోటు ఇతరుల నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా చట్టం చురుగ్గా పని చేస్తుందనే ఎరుక ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అదే సమయంలో ఇతరుల నుంచి ఎటువంటి ప్రమాదాలు ఎదురు కావచ్చో తెలుసుకొని అలాంటివి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.అపరిచిత వ్యక్తులతో కాల్స్ మాట్లాడటం, వారికి వ్యక్తిగత వివరాలు ఇవ్వడం, సోషల్ మీడియాలో అవసరం లేని విషయాలు షేర్ చేసుకోవడం మంచిది కాదు. అలాగే ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మౌనంగా భరించడమూ మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వ రక్షణ వ్యవస్థల నుంచి వెంటనే సహాయం పొందే సంసిద్ధతను కలిగి ఉండాలి. -
ఆ కేసులు ఉపసంహరించుకోండి లేదంటే...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శనివారం ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం– రైతు సంఘాల ఐక్యవేదిక) డిమాండ్ చేసింది. ఆందోళనలు చేపట్టి ఏడు నెలలైన సందర్భంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్లకు విజ్ఞాపనపత్రాలు ఇవ్వడానికి రైతులు రాజ్‌భవన్‌లవైపు వెళ్లగా... పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ‘చండీగఢ్‌లో పలువురు ఎస్కేఎం నాయకులు, ఆందోళనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 147, 148, 149, 186, 188, 332, 353 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. రాజ్‌భవన్‌కు దారులు మూసివేయడమే కాకుండా రైతులపై వాటర్ క్యానన్లు ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. పైగా అప్రజాస్వామికంగా కేసులు బనాయించారు. ఎస్కేఎం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే భేషరతుగా ఈ కేసులన్నింటినీ ఉపసంహరించాలి’ అని ఎస్కేఎం ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఇంత నిర్లక్ష్యమా?: రాహుల్ రైతుల ఆందోళనలు ఉధృతమవుతున్నా... ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. 200 రోజులకు పైగా ఢిల్లీ శివార్లలో ఆందోళనలను నిర్వహిస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. ‘తమ జీవనోపాధికి రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ దిగుబడులను అమ్మితే వచ్చే డబ్బు కంటే పెట్టుబడులు అధికంగా ఉంటున్నాయి. రైతుల ఆందోళనలు ఉధృతమవుతున్నా... ప్రభుత్వ విధానాల్లో వీరిపట్ల ఎలాంటి సానుభూతి కనిపించడం లేదు’ అని రాహుల్ మండిపడ్డారు. చదవండి: డీఏను తక్షణమే పునరుద్ధరించాలి: కాంగ్రెస్ తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు ఆపాల్సిందే -
బ్యాంక్ అక్రమాల్లో రూ లక్ష కోట్లు ఆవిరి : ఆర్బీఐ
సాక్షి, ముంబయి : బ్యాంకుల్లో అవకతవకలు, మోసాల కారణంగా కోట్లాది ప్రజాధనం పక్కదారిపడుతోంది. గత ఐదేళ్లలో బ్యాంకుల్లో చోటుచేసుకున్న 23,000కు పైగా అవకతవకల కేసుల్లో రూ లక్ష కోట్ల మేర ధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. బ్యాంకుల్లో ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2018 వరకూ అవకతవకల కేసులు 5152 కేసులకు పెరిగాయని ఆర్టీఐ కింద కోరిన సమాచారానికి బదులిస్తూ ఆర్బీఐ వెల్లడించింది. ఈ కేసుల్లో రూ 28,459 కోట్లు చిక్కుకున్నాయని పేర్కొంది. ఇక 2016-17లో రూ 23,933 కోట్ల విలువైన 5976 అక్రమాల కేసులు బ్యాంకింగ్ రంగంలో నమోదయ్యాయని తెలిపింది. గత ఐదేళ్లలో మొత్తం లక్షా718 కోట్ల మేర ధనం 23,866 అక్రమార్కుల అవకతవకల ఫలితంగా ఆవిరైందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ కేసులను సమగ్రంగా పరిశీలించి కేసుల వారీగా వాస్తవాలను క్రోడీకరిస్తూ చర్యలు చేపడుతున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకుల్లో పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు భారీ రుణాల ఎగవేత కేసులు పేరుకుపోతున్న క్రమంలో ఆర్బీఐ వెల్లడించన గణాంకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
పోలీసులపై దాడి: ఆరుగురు మహిళలపై కేసులు
థానె: పోలీసులపై దాడి చేసిన ఆరుగురు మహిళలపై కేసు నమోదు చేశారు. ఓ చీటింగ్ కేసులో నిందితుడిని అరెస్టు చేసేందుకు భీవండిలోని పిరనిపాద వెళ్లిన భీవండి క్రైం యూనిట్, ఓషివర పోలీసులపై అక్కడి మహిళలు ఆరుగురు దాడిచేశారని థానే పోలీసు ప్రతినిధి సుఖదా నర్కర్ తెలిపారు. ఓషివర పోలీసు స్టేషన్లో చీటింగ్, వంచన కేసులు నమోదైన వ్యక్తి కమర్ అలి జాఫ్రి పిరనిపాదలో ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు, భీవండి క్రైం యూనిట్ సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అతని ఇంటిని గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకుంటుండగా ఆరుగురు మహిళలు పోలీసులపై దాడిచేసి కొట్టడమేగాక కొందరి యూనిఫాంలను చింపేశారని, రాళ్లు రువ్వారని తెలిపారు. శాంతినగర్ పోలీసు స్టేషన్లో ఈ మహిళలపై ఐపీసీ 353(ప్రభుత్వ ఉద్యోగిపై దాడిచేయడం, విధులకు ఆటంకం కలిగించడం), 332 కింద కేసులు నమోదు చేసినట్లు సుఖదా నర్కర్ తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
జాతీయ రహదారిపై విజిలెన్స్ తనిఖీలు
14 వాహనాలపై కేసులు వెంకటాచలం : వెంకటాచలం సమీపంలో జాతీయ రహదారిపై విజిలెన్స్ అధికారులు బుధవారం తెల్లవారు జామున నుంచి ముమ్మరంగా తనిఖీలు చేశారు. వెంకటాచలం టోల్‌ప్లాజా నుంచి కృష్ణపట్నంపోర్టు రోడ్డు వరకు రెండు బృందాలుగా ఏర్పడి రాకపోకలు కొనసాగించే వాహనాలను తనిఖీ చేశారు. విజిలెన్స్ డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహించామన్నారు.14వాహనాలు అధిక లోడుతో వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. వాటిలో 9 బొగ్గు రవాణా చేస్తున్న లారీలు, రెండు గ్రానైట్, రెండు పార్శిల్, ఒక కంకర లోడు లారీ ఉన్నట్లు చెప్పారు. వీటిపై కేసులు నమోదు చేసి ట్యాక్స్, అధిక లోడుతో వెళ్లినందుకు పన్ను వసూలు చేస్తామని తెలియజేశారు. ఆయన వెంట సీఐలు శ్రీనివాసరావు, ఉప్పల సత్యనారాయణ, బీటీ నాయక్, డీసీటీఓ రవికుమార్, ఎఫ్ఆర్ఓ ఉమామహేశ్వరరెడ్డి, ఏజీ రాము తదితరులు ఉన్నారు. -
విద్యుత్ చౌర్యంపై కేసులు
రూ.30లక్షల అపరాధరుసుం విధింపు నెల్లూరు(టౌన్) : జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 138 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మనోహరరావు తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో ఉన్న విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాల నుంచి వచ్చిన 120 మంది విజిలెన్స్, ట్రాన్స్‌కో అధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారన్నారు. కొండాపురం, కలిగిరి, కావలి రూరల్, బోగోలు, దగదర్తి, సంఘం, నెల్లూరు రూరల్, ముత్తుకూరు, సైదాపురం, రాపూరు, నాయుడుపేట రూరల్, డక్కిలి ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 138మందిపై కేసులు నమోదు చేసి, వారికి రూ.30 లక్షలు అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. వాటిలో 61 మీటరు బైపాస్, 50 లైన్ నుంచి నేరుగా కనెక్షన్, 10 గృహా సర్వీసులు వ్యాపారానికి వినియోగం, 17 అదనపు లోడ్లు ఉన్నాయన్నారు. కావలి రూరల్, బోగోలు ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 24 మంది ఆక్వా వినియోగదారులపై కేసులు నమోదు చేసి రూ.20 లక్షలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు రానున్న రోజుల్లో మరిన్ని తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో డీపీఈ ఎస్ఈ రవి, నెల్లూరు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సీఐ నాగేశ్వరమ్మ పాల్గొన్నారు.


