బ్యాంక్‌ అక్రమాల్లో రూ లక్ష కోట్లు ఆవిరి : ఆర్‌బీఐ | Bank Fraud Cases Involving Rs 1 Lakh Crore Reported In 5 Years | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ అక్రమాల్లో రూ లక్ష కోట్లు ఆవిరి : ఆర్‌బీఐ

May 2 2018 7:55 PM | Updated on May 2 2018 7:55 PM

Bank Fraud Cases Involving Rs 1 Lakh Crore Reported In 5 Years - Sakshi

సాక్షి, ముంబయి : బ్యాంకుల్లో అవకతవకలు,  మోసాల కారణంగా కోట్లాది ప్రజాధనం పక్కదారిపడుతోంది. గత ఐదేళ్లలో బ్యాంకుల్లో చోటుచేసుకున్న 23,000కు పైగా అవకతవకల కేసుల్లో రూ లక్ష కోట్ల మేర ధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిందని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి. బ్యాంకుల్లో ఏప్రిల్‌ 2017 నుంచి మార్చి 2018 వరకూ అవకతవకల కేసులు 5152 కేసులకు పెరిగాయని ఆర్‌టీఐ కింద కోరిన సమాచారానికి బదులిస్తూ ఆర్‌బీఐ వెల్లడించింది.

ఈ కేసుల్లో రూ 28,459 కోట్లు చిక్కుకున్నాయని పేర్కొంది. ఇక 2016-17లో రూ 23,933 కోట్ల విలువైన 5976 అక్రమాల కేసులు బ్యాంకింగ్‌ రంగంలో నమోదయ్యాయని తెలిపింది. గత ఐదేళ్లలో మొత్తం లక్షా718 కోట్ల మేర ధనం 23,866 అక్రమార్కుల అవకతవకల ఫలితంగా ఆవిరైందని ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ కేసులను సమగ్రంగా పరిశీలించి కేసుల వారీగా వాస్తవాలను క్రోడీకరిస్తూ చర్యలు చేపడుతున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. బ్యాంకుల్లో పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు భారీ రుణాల ఎగవేత కేసులు పేరుకుపోతున్న క్రమంలో ఆర్‌బీఐ వెల్లడించన గణాంకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement