breaking news
Campaigning ends
-
బిహార్ ప్రచారానికి తెర
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ప్రచార పర్వం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇన్నాళ్లూ రాజకీయ పారీ్టల నినాదాలు, ప్రసంగాలతో హోరెత్తిపోయిన గ్రామాలు, పట్టణాలు నిశ్శబ్దంగా మారిపోయాయి. చివరిదైన రెండో దశ పోలింగ్ ఈ నెల 11వ తేదీన 122 నియోజవర్గాల్లో జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 6వ తేదీన 121 స్థానాల్లో జరిగిన తొలి దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 65 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో కీలక నేతలు పోటీపడుతున్నారు. బిహార్ ఎన్నికల చరిత్రలో 5 శాతానికి మించి ఓటింగ్ పెరిగిన ప్రతిసారీ.. అది అధికార మారి్పడికే దారితీసిందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఈసారి భారీ ఓటింగ్ నమోదు కావడం తమకే అనుకూలమని ఇరుపక్షాలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సమీకరణాల చదరంగం రెండో దశలో పోలింగ్ జరుగనున్న 122 నియోజకవర్గాలు అత్యంత సంక్లిష్టమైనవి. ఇక్కడ ప్రచారం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో కుల సమీకరణాలు, ఓట్ల చీలిక వంటి అంశాలే అభ్యర్థుల గెలుపోటములను శాసించనున్నాయి. రెండో దశలో సీమాంచల్ అత్యంత కీలకం. కిషన్‌గంజ్, అరారియా, పూరి్ణయా, కతిహార్ వంటి జిల్లాలున్న ఈ ప్రాంతంలో ముస్లిం మైనారిటీల జనాభా ఎక్కువ. ఇది దశాబ్దాలుగా ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమికి కంచుకోట. అయితే, 2020 నాటి ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ నేతత్వంలోని ఎంఐఎం ఇక్కడ 5 స్థానాలు గెలుచుకొని మహాగఠ్‌బంధన్ ఓట్లను చీల్చింది.మైనారిటీల ఓట్లను ఆకర్శించేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతుండగా.. ఎంఐఎం సైతం అదే ఓటు బ్యాంకుకు గాలం వేస్తోంది. ఈ ’ఓట్ల చీలిక’అంతిమంగా ఎన్డీఏకు లాభం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. రెండో దశలోనూ కులమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ముస్లిం–యాదవ్ సమ్మేళనం మహాగఠ్‌బంధన్‌కు ప్రాణవాయువు లాంటిది. ఆర్జేడీ అభ్యర్థులు పూర్తిగా ఈ ఓటు బ్యాంకును నమ్ముకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బలం ఈబీసీలు, మహాదళితులే. ఈ నిశ్శబ్ద ఓటు బ్యాంకు గత రెండు దశాబ్దాలుగా జేడీయూ వెంటే నడుస్తోంది. భూమిహార్, రాజ్‌పుత్, బ్రాహ్మణ వర్గాలు ఆనవాయితీగా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నాయి.ఓట్ల చీలికలతో తంటాలు ఈ ఎన్నికల్లో ‘ఓట్లను చీల్చే’పార్టీల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ చాలా నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టింది. ఇది సంప్రదాయ రాజకీయాలకు అలవాటుపడని ఓటర్లను ఆకర్శిస్తోంది. ఈ పారీ్టతో జేడీ(యూ), ఆర్జేడీలకు కొంత నష్టం జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘సన్ ఆఫ్ మల్లా’గా పిలుచుకునే ముకేశ్ సహానీ.. బిహార్ నిషాద్ (మత్స్యకార) వర్గంలో గట్టి పట్టున్న నాయకుడు. ఈయన మహాగఠ్‌బంధన్‌లో భాగస్వామిగా ఉండటం ఆర్జేడీకి కలిసొచ్చే అంశం. సమస్యాత్మక ప్రాంతాలు రెండో దశలో పోలింగ్ జరగనున్న పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామఢీ వంటి జిల్లాలు నేపాల్ సరిహద్దును ఆనుకొని ఉన్నాయి. ఇక్కడ ఎన్నికల నిర్వహణ భద్రతా బలగాలకు పెద్ద సవాల్. ఎన్నికలకు 72 గంటల ముందే నేపాల్ సరిహద్దును మూసివేశారు. అసాంఘీక శక్తులు సరిహద్దులు దాటకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు సీమాంచల్ ప్రాంతం మతపరంగా అత్యంత సున్నితమైనది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రాంతాల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించింది. ప్రజలు స్వేచ్ఛగా, శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 14న ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. -
రేపే బిహార్ తొలి పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ ప్రచార ఘట్టానికి తెరపడింది. తొలి దశలో భాగంగా గురువారం 121 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. తొలి దశ ఎన్నికలు జరిగే స్థానాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. చివరిరోజు ఇటు ఎన్డీయే, అటు మహాగఠ్‌బంధన్ అగ్రనేతలు సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీజేపీ ముఖ్య నేతలు ఎన్డీయే తరఫున... ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నాయకులు మహా కూటమి తరఫున చివరి అ్రస్తాలను సంధించారు.తేజస్వీ యాదవ్ ‘10 లక్షల ఉద్యోగాల’ హామీతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా, నితీశ్ కుమార్ తనదైన శైలిలో జంగిల్‌రాజ్‌ను గుర్తుచేస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ పాలనపై విమర్శలు గుప్పించారు. తలరాతను నిర్ణయించనున్న తొలి దశ బిహార్ ఎన్నికల్లో పారీ్టల భవితవ్యాన్ని తొలి దశ ఎన్నికలే నిర్ణయించనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ 121 స్థానాల్లోనే ఆర్జేడీ, జేడీ(యూ) బలాబలాలు పరీక్షకు నిలవనున్నాయి. ఆర్జేడీ తన ‘ముస్లిం–యాదవ్’ సమీకరణాన్ని పటిష్టం చేసుకుందో లేక నితీశ్ కుమార్ తన ‘ఈబీసీ, మహాదళిత్’ ఓటు బ్యాంకును నిలబెట్టుకున్నారో లేదో మొదటి దశ ఎన్నికలే స్పష్టం చేస్తాయి.అందరి కళ్లూ చిరాగ్పైనేఈ ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయగల ఏకైక అంశం ‘చిరాగ్ ఫ్యాక్టర్’. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, ప్రధాని నరేంద్ర మోదీకి జై కొడుతూనే సీఎం నితీశ్ కుమార్‌ను టార్గెట్ చేస్తున్న చిరాగ్ పాశ్వాన్(ఎల్జేపీ–రామ్ విలాస్).. ఈ తొలి దశలో అత్యంత కీలకంగా మారారు. జేడీ(యూ) పోటీ చేస్తున్న దాదాపు అన్ని స్థానాల్లో ఎల్జేపీ–రామ్ విలాస్ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ అభ్యర్థులు జేడీ(యూ) ఓటు బ్యాంకును భారీగా చీల్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఓట్ల చీలిక నేరుగా మహాగఠ్‌బంధన్ అభ్యర్థుల గెలుపునకు దారితీస్తుందని విశ్లేషకుల అంచనా. పోటాపోటీ ఇక్కడే తొలి దశలో నితీశ్ కేబినెట్లోని 8 మంది మంత్రులతో సహా పలువురు ఉద్ధండుల భవితవ్యం తేలనుంది. ⇒ ఇమామ్‌గంజ్: మాజీ సీఎం జితన్‌రామ్ మాంఝీ (హిందూస్తానీ అవామ్ మోర్చా) భవితవ్యాన్ని తేల్చనున్న ప్రతిష్టాత్మక స్థానం. ⇒ జముయి: అంతర్జాతీయ షూటర్ శ్రేయసి సింగ్ (బీజేపీ) రాజకీయ అరంగేట్రం చేస్తున్న స్థానం.⇒ గయా టౌన్: బీజేపీ కంచుకోటలో మంత్రి ప్రేమ్ కుమార్ మరోసారి బరిలో ఉన్నారు.⇒ బాంకా: మంత్రి రామ్ నారాయణ్ మండల్ (బీజేపీ), మాజీ మంత్రి జైప్రకాశ్ నారాయణ్ యాదవ్ (ఆర్జేడీ) మధ్య ముఖాముఖి పోరు.ప్రభావిత అంశాలు ⇒ ఈ ఎన్నికల మొత్తంలో రాజకీయ చర్చను నిర్దేశించిన ఏకైక అంశం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టి. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కలి్పస్తూ తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించడం కులాలకు అతీతంగా యువతను ఆకర్శిస్తోంది. ⇒ 15 ఏళ్ల నితీశ్ కుమార్ పరిపాలనపై ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి విపక్ష కూటమి తీవ్రంగా యతి్నంచింది. ⇒ ఎన్డీయేకు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాయే అతిపెద్ద బలం. నితీశ్‌పై ఉన్న వ్యతిరేకతను మోదీ ఇమేజ్‌తో అధిగమించాలని బీజేపీ వ్యూహరచన చేసింది. ⇒ నితీశ్ కుమార్ తన ప్రచారంలో ప్రధానంగా అభివృద్ధి, శాంతి భద్రతల గురించే ప్రస్తావించారు. రాష్ట్రానికి ‘జంగిల్‌రాజ్’ నుంచి విముక్తి కల్పించానని చెప్పారు. ప్రతి గ్రామానికీ విద్యుత్, రోడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించానని గుర్తుచేశారు. ⇒ నితీశ్ కుమార్ ‘అభివృద్ధి’ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రతిపక్షాలు ప్రాధాన్యం ఇచ్చాయి. రాష్ట్రంలోనే పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు ఉంటే బిహార్ బిడ్డలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలస వెళ్తున్నారని ప్రశ్నించాయి. -
ప్రచారం.. నేటితో పరిసమాప్తం! ఇకపై గెలిచేవరకు మూగనోమే..
సాక్షిప్రతినిధి, వరంగల్: సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌నుంచే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నా.. ఈ నెల 15న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ప్రచారం ఊపందుకుంది. 20వ తేదీ నుంచి ఉమ్మడి వరంగల్‌కు అగ్రనేతలు వరుసకట్టడంతో ప్రచారం పతాకస్థాయికి చేరింది. అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీల క్యాంపెయినర్లు, అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు చెమటోడ్చారు. రోజూ నేతల రోడ్‌షోలు, సమావేశాలు, మైక్‌ల మోతలతో ఉమ్మడి జిల్లా హోరెత్తింది. ప్రచారం ముగింపునకు ఒక్కరోజు ముందుగానే అగ్రనేతలు పోటెత్తారు. సోమవారం భారత ప్రధాని నరేంద్రమోదీ మహబూబాబాద్‌లో, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పరకాలలో, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, డోర్నకల్ నియోజకవర్గంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఏటూరు నాగారంలో రోడ్‌షోలు, సభలు నిర్వహించారు. ప్రముఖుల రాకతో ఉమ్మడి జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. సుమారు 13 రోజులపాటు ఉధృతంగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు పరిసమాప్తం కానుంది. చివరి రోజు మంగళవారంన ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉమ్మడి వరంగల్‌లోని 12 నియోజకవర్గాల్లో ప్రచారం ముగింపు తర్వాత ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు వ్యూహరచనలో నిమగ్నం కానున్నారు. నోటిఫికేషన్ తర్వాత విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటించినప్పటికీ ప్రతికూల పరిస్థితులున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోల్ మేనేజ్మెంట్పై నజర్ పెట్టిన ప్రధాన పార్టీలు ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మద్యం షాపులు మూడు రోజులు బంద్! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజులు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మద్యం అక్రమంగా విక్రయిస్తే చర్యలు తీసుంటామని హెచ్చరించారు. ఇవి చదవండి: ఎన్నికలకు 2 రోజుల ముందు నుంచే బల్క్ మెసేజ్‌లు బంద్! : రాజర్షిషా -
Karnataka Assembly election 2023: భూమిపుత్రున్ని: ఖర్గే
కలబురిగి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ కర్ణాటక ప్రజలనుద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. సోమవారం కలబురిగిలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘నన్నెవరైనా చంపితే చంపొచ్చు గాక! తుదిశ్వాస దాకా పేదల కోసం, వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా’’ అని స్పష్టం చేశారు. ‘‘నేను కన్నడ భూమిపుత్రున్ని. అందుకు ఎంతగానో గర్వపడతా’’ అన్నారు. ఖర్గేను, ఆయన భార్యాపిల్లలను చంపేందుకు బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ కుట్ర పన్నారని కాంగ్రెస్ ఆరోపించడం, అందుకు రుజువుగా ఆడియో రికార్డు విడుదల చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. అది కచ్చితంగా బీజేపీ అగ్ర నేతల మనసు లోంచి పుట్టుకొచ్చిన ఆలోచనే అయ్యుంటుందని ఆరోపించారు. వారి దన్ను లేనిదే ఎవరూ అలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. ‘‘చిన్నతనంలోనే కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలాను. వాళ్లేమైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి బెదిరింపులకు భయపడను. నన్ను కాపాడేందుకు అంబేడ్కర్ అందించిన రాజ్యాంగముంది. కర్ణాటక ప్రజలంతా నా వెనక ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాక దేశ ప్రజలంతా నా వెనకే ఉన్నారు. మన దేశంలో సగటు ఆయు ప్రమాణం 70 ఏళ్లే. నాకు 81 ఏళ్లు. అంటే ఇప్పటికే బోనస్ పీరియడ్‌లో ఉన్నా. మహా అయితే మరో ఎనిమిదేళ్లు బతుకుతానేమో. నన్నూ, నా కుటుంబాన్నీ తుడిచి పెట్టొచ్చు గాక. భయపడేది లేదు. నా స్థానంలో మరొకరు పుట్టుకొస్తారు’’ అన్నారు. ‘‘ప్రధాని మోదీ కూడా పదేపదే నా కుమారుని గురించి మాట్లాడుతున్నారు. అతనిది మోదీ స్థాయి కాదు. నా గురించి మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. ‘‘తాను భూమిపుత్రున్నని గుజరాత్లో మోదీ చెప్పుకుంటారు. తన కోసం బీజేపీని గెలిపించాలని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను కోరారు. అలాగే కర్ణాటక భూమిపుత్రుడినైన నా కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుతున్నా’’ అన్నారు. తాను కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉండగా రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సహకరించాలని కోరారు. బెంగళూర్‌లో రాహుల్ బస్సు ప్రయాణం బనశంకరి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ బెంగళూరులో హల్చల్ చేశారు. కన్నింగ్‌హాం రోడ్డులో కాఫీ డేలో కాసేపు గడిపారు. అక్కడ కాఫీ రుచి చూశాక దగ్గర్లోని లోకల్ బస్టాప్‌లో కాలేజీ విద్యార్థులు, వర్కింగ్ విమెన్‌తో మాటలు కలిపారు. స్టూడెంట్లతో సెల్ఫీ దిగారు. తర్వాత లోకల్ బస్సెక్కి ప్రయాణికురాళ్లతో మాట్లాడారు. లింగరాజపురంలో బస్సు దిగి బస్టాప్‌లో మహిళలతో మరోసారి ముచ్చటించారు. ‘ధరల పెరుగుదల, ఇంటి పెద్ద అయిన ప్రతి మహిళకూ నెలకు రూ.2,000 ఇస్తామన్న కాంగ్రెస్ హామీ, ఉచిత బస్సు ప్రయాణం తదితరాలపై వారు నాతో లోతుగా చర్చించారు’’ అని చెప్పుకొచ్చారు. -
Karnataka, assembly elections 2023: మైకులు బంద్
బెంగళూరు: కర్ణాటకలో మైకులు మూగబోయాయి. నెలకు పైగా జోరుగా కొనసాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడింది. పార్టీలు, అభ్యర్థులు మంగళవారం కేవలం ఇంటింటి ప్రచారానికే పరిమితం కావాల్సి ఉంటుంది. కాంగ్రెస్ తరఫున రాహుల్, ప్రియాంక, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తదితరులు నెల రోజులుగా ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారును 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా అభివర్ణిస్తూ అవినీతే ప్రధానాంశంగా ప్రజల్లోకి వెళ్లారు. ఇక బీజేపీ పూర్తిగా ప్రధాని మోదీపైనే ఆశలు పెట్టుకుంది. అమిత్ షా, నడ్డా వంటి అతిరథులు రంగంలోకి దిగినా ప్రధానంగా మోదీయే సుడిగాలి పర్యటనలు, వరుస సభలు, రోడ్‌షోలతో హోరెత్తించారు. ఎన్నికల షెడ్యూలుకు ముందు నుంచే కర్ణాటకలో పదేపదే పర్యటించిన ఆయన, 10 రోజుల్లో ఏకంగా 19 భారీ బహిరంగ సభలు, ఆరు రోడ్‌షోలతో రాష్ట్రమంతటా చుట్టేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే స్థిరత్వం, అభివృద్ధి సాధ్యమంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 40 శాతం కమీషన్ల సర్కారు విమర్శలకు విరుగుడుగా కాంగ్రెస్ 85 శాతం కమిషన్ల పార్టీ అంటూ ప్రతి దాడికి దిగారు. ఇక ప్రచారం చివరి దశలో బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని బీజేపీ రెండు చేతులా అందిపుచ్చుకుంది. ఆ పార్టీని హిందూ వ్యతిరేకిగా చిత్రించేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. బీజేపీ జాతీయ నేతలు మొత్తం 206 సభలు, 90 రోడ్‌షోలు, రాష్ట్ర నేతలు 231 బహిరంగ సభలు, 48 రోడ్ షోలు నిర్వహించారు. ఇక కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నేతలంతా కలిసి 99 బహిరంగ సభలు, 33 రోడ్‌షోలు జరిపారు. విషసర్పం, పనికిమాలిన కుమారుడు, విషకన్య తదితర వ్యక్తిగత విమర్శలు ఈసారి కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో హైలైట్‌గా నిలిచాయి. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కమలనాథులు, ఎలాగైనా గెలిచి విశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ప్రయత్నించాయి. ఈసారి ఎలాగైనా పూర్తి మెజారిటీ సాధనే లక్ష్యంగా రెండు పార్టీలూ పరిశ్రమించాయి. జేడీ(ఎస్) నేతలు కూడా నిప్పులు చెరిగే ఎండల్లో చెమటలు కక్కారు. ఇప్పుడిక బుధవారం జరగబోయే కీలకమైన పోలింగ్ మీదే అందరి దృష్టీ నెలకొంది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఫలితాలు 13వ తేదీన వెలువడనున్నాయి. రూ.375 కోట్లు జప్తు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో డబ్బు కట్టలు తెంచుకుని పారింది. మార్చి 29 నుంచి ఏకంగా రూ.375.6 కోట్ల మేరకు నగదు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. ఇందులో రూ.147 కోట్లు నగదు, రూ.84 కోట్ల విలువైన మద్యం, రూ.97 కోట్ల విలువైన బంగారం, వెండి, రూ.24 కోట్ల విలువైన కానుకలు, రూ.24 కోట్ల డ్రగ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఏకంగా 2,896 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. మార్చి 29కి ముందు కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న రూ.58 కోట్ల విలువైన నగదు తదితరాలు దొరికాయి. -
Gujarat Polls: ముగిసిన ప్రచారం.. తొలిదశకు అంతా సిద్ధం
గాంధీనగర్: గుజరాత్ శాసనసభ తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. కొద్ది రోజులుగా ముమ్మర ప్రచారంతో దూసుకెళ్లిన రాజకీయ పార్టీలు.. తొలిదశ ప్రచారానికి ముగింపు చెప్పాయి. మొదటి విడతలో భాగంగా 89 స్థానాలకు డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. మరో 93 స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుండగా.. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 27 ఏళ్లుగా సుదీర్ఘంగా సాగుతున్న తమ అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ చూస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. అయితే, 2017లో ఒక్కసీటు కూడా సాధించని ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ గెలుపు ఉత్సాహంతో గుజరాత్‌లోనూ పాగా వేయాలని భావిస్తోంది. 90 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గుజరాత్ ప్రధాన ఎన్నికల అధికారి పి భారతి.. ఓటింగ్‌పై పలు వివరాలను వెల్లడించారు. గురువారం జరగనున్న తొలి దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ‘డిసెంబర్ 1న ఓటింగ్ జరగనుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 19 జిల్లాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. 50 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్‌క్యాస్టింగ్ ఉంటుంది. తొలి దశలో 2,39,76,760 మంది ఓటర్లు తమ ఓట హక్కును వినియోగించుకోనున్నారు. ’ అని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించినట్లు చెప్పారు. బీజేపీ తరఫున పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు భావ్‌నగర్, కచ్ జిల్లాలోని గాంధీధామ్‌లలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. తొలిదశలో ఆమ్ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ బరిలో ఉన్నారు. ద్వారకా జిల్లాలోని ఖాంభాలియా అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. గుజరాత్ మాజీ మంత్రి పురుషోత్తం సోలంకీ, ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన కున్వార్జీ బవాలియా, మోర్బీ హీరో కాంతీలాల్ అమృతీయ, క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా, ఆమ్ఆద్మీ పార్టీ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా వంటి ముఖ్య వ్యక్తులు తొలిదశ పోటీలో ఉన్నారు. ఇదీ చదవండి: షాకింగ్ ఘటన.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు -
పుర ప్రచారం నేటితో సమాప్తం
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం ముగియనుంది. రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమవ్వడంతో అక్కడ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు. మిగిలిన నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఈ నెల 10న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. -
ముగిసిన ఐదో దశ ప్రచారం
న్యూఢిల్లీ: లోక్‌సభ ఐదో దశ ఎన్నికలకు శనివారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లో 14 సీట్లు, రాజస్తాన్‌లో 12, పశ్చిమబెంగాల్లో 7, మధ్యప్రదేశ్‌లో 7, బిహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, కశ్మీర్‌లోని 2 స్థానాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 51 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 6వ తేదీన జరగనున్న పోలింగ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునే వారిలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్, స్మృతి ఇరానీ, జయంత్ సిన్హా, అర్జున్ రామ్ మేఘ్వాల్, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ తదితరులున్నారు. పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారంపై ఫొని తుపాను ప్రభావం పడింది. వివిధ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని పొరుగునే ఉన్న ఒడిశాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఇలా ఉండగా, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భూమిపై హక్కు కోసం వీరోచితంగా పోరాడిన, గిరిజనులు దైవంగా భావించే బిర్సా ముండా జన్మించిన జార్ఖండ్‌లో పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్ర రాజధాని రాంచీకి 50 కిలోమీటర్ల దూరంలోని మావోయిస్టుల ప్రభావిత ఖుంతి జిల్లాలో 100కు పైగా గిరిజన గ్రామ పంచాయతీల ప్రజలు ఈ లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తామే పాలకులమనీ, తమ గ్రామాల్లోకి ఎవరినీ అనుమతించబోమంటూ తీర్మానించారు. తమను గురించి కనీసం పట్టించుకోని నేతలతో పని లేదని వీరు వాదిస్తున్నారు. -
ముగిసిన ‘ప్రచార’ పర్వం
హుస్నాబాద్‌లో టీఆర్ఎస్ రోడ్‌షోలో పాల్గొన్న కార్యకర్తలు బెజ్జంకి: చిలాపూర్‌లో ఎద్దును తీసుకెళ్తున్న రైతును ఓటు అడుగుతున్న టీఆర్ఎస్ నేతలు సదాశివపేటలో టీఆర్ఎస్ ర్యాలీ కౌడిపల్లిలోని ఓ కూరగాయాల దుకాణం వద్ద ఓటు అభ్యర్థిస్తున్న నర్సాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌రెడ్డి సిద్దిపేటలో ప్రచారం అనంతరం టీ తాగుతూ సేదతీరుతున్న మంత్రి హరీశ్ సతీమణి శ్రీనిత జోగిపేట: బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఓటు వేయాలని కోరుతున్న ఖేడ్ బీజేపీ అభ్యర్థి సంజీవరెడ్డి హత్నూర: ప్రచారం నిర్వహిస్తున్న నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి మెదక్ మున్సిపాలిటీ: కుమారుడితో కలిసి ప్రచారం చేస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డి రామాయంపేట: మెదక్ బీజేపీ అభ్యర్థి రాజయ్య ప్రచారం -
ఇక.. ప్రలోభాల జాతర
నోళ్లకు తాళం పడింది. మైకుల మోత ఆగిపోయింది. మూడు నెలలుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి బుధవారం బ్రేక్ పడింది. మరో 24 గంటల్లో తుదిపోరు ప్రారంభం కానుంది. కీలకఘట్టం ముగియడంతో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. చివరి నిమిషంలో తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ఓటర్లకు నగదు ఆశ జూపుతున్నారు. ఇప్పటికే మందు, విందులతో నిండిపోయిన పల్లెలు.. రాజకీయం క్లైమాక్స్ చేరడంతో మరింత హాట్‌హాట్‌గా మారాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 163 మంది బరిలో నిలిచారు. కేవలం ప్రధాన పార్టీలేగాకుండా తొలిసారి చిన్నా చితక పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతుండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా గెలుపే ధ్యేయంగా జట్టుకట్టిన టీడీపీ–కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ కూటమి ఒకవైపు.. మరోసారి విజయం సాధించాలని ముందస్తు సమరానికి సై అన్న టీఆర్ఎస్ మరోవైపు.. మెరుగైన ఫలితాలను సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ ఇంకోవైపు.. పోటాపోటీగా సమరక్షేత్రంలోకి దిగాయి. మొదటి రోజే అభ్యర్థులను ప్రకటించి శంఖారావం పూరించిన గులాబీ దళపతి కేసీఆర్ జిల్లాలోని రాజేంద్రనగర్, మహేశ్వరం మినహా అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల ఆశీర్వాదాన్ని కోరారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సైతం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అలుపెరగకుండా.. శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అతిరథ మహారథులతో ప్రచారపర్వం కొనసాగించిన ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ మునుపెన్నడూలేని రీతిలో బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. ముందస్తు సంకేతాలు రావడమే తరువాయి రాజేంద్రనగర్‌లో దాదాపు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్లో పర్యటించారు. అగ్రనేతలు గులాంనబీ అజాద్, అజారుద్దీన్, సినీ తారలు విజయశాంతి, నగ్మా, కుష్బూ ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. చంద్రబాబు సైతం.. ప్రజాకూటమి అభ్యర్థులకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సైతం రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, మహేశ్వరంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సినీ నటుడు బాలకృష్ణ ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. హోరెత్తించిన కమలదళం బీజేపీ అధినేత అమిత్‌షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, హాన్స్‌రాజ్, గంగ్వార్, స్మృతి ఇరానీ, పురందేశ్వరి, స్టార్ క్యాంపెయినర్ పరిపూర్ణానంద తదితరులు జిల్లాలో విస్తృతంగా పర్యటించి కమలం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. ప్రధాన పార్టీలకు దీటుగా ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌లో బీఎస్పీ పార్టీ అభ్యర్థులు ప్రచారపర్వాన్ని కొనసాగించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ టికెట్లు దక్కకపోవడంతో ఏనుగెక్కిన మల్రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్లు ప్రజాకూటమి, కాంగ్రెస్ అభ్యర్థులకు తీసిపోని రీతిలో ప్రచారం హోరెత్తించారు. ఉరుకులు పరుగులకు తెర ఉరుకులు పరుగులకు తెరపడింది. ఇక ఉత్కంఠ మిగిలింది. ఎన్నికల క్రతువులో కీలక రోజుగా భావించే ఈ కొన్ని గంటల్లో ఫలితాన్ని తారు మారు చేసేందుకు అభ్యర్థులు తెర వెనుక రాయ‘బేరాలు’ కొనసాగిస్తున్నారు. ఓటరును బుట్టలో వేసుకునేందుకు ఎత్తులు.. చీకట్లో చిత్తులు చేసే కార్యక్రమం మొదలు కానుంది. వీరి భవితవ్యం 11న వెలువడే ఫలితాలతో తేలిపోనుంది. -
ప్రచారానికి తెర!
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ విధానసభ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. దీంతో ఎన్నికల ప్రకటనతో అక్టోబర్‌లో మొదలై, నామినేషన్ల ప్రక్రియతో ఊపందుకున్న ప్రచారానికి తెరపడినట్లయింది. ఎన్నికల్లో పోటీచేస్తున్న 810 మంది అభ్యర్థులు, వారి బంధుమిత్రులు, పార్టీల కార్యకర్తలు ప్రచారం గుడువు ముగిసే ఆఖరి నిమిషం వరకు వీలైనంత మంది ఓటర్లపై తమ ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఓటర్లపై హామీల జల్లులు కురిపించారు. ఎన్నికల కమిషన్ కఠిన వైఖరి కారణంగా ఈసారి ఎన్నికల ప్రచారం సాదాసీదాగానే సాగింది. మొట్టమొదటి సారిగా నగరంలో ఎన్నికల ప్రచారంలో గోడలపై పోస్టర్లు, బ్యానర్లు అతికించలేదు. ఎన్నికల కమిషన్ ఆంక్షలతో గతంతో పోలిస్తే ప్రచారం పేలవంగా సాగినప్పటికీ ఓటర్లను చేరుకోవడానికి అభ్యర్థులు, పార్టీలు గట్టిగానే ప్రయత్నించాయి. బహిరంగ సభ లు, ర్యాలీలు, రేడియో జింగిల్స్, కరపత్రాలు, రోడ్ షోలు, ఎస్ఎంఎస్లు, ప్రీ రికార్డెడ్ ఫోన్ కాల్స్, ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా, టెలివిజన్ అడ్వర్టయిజ్మెంట్లు, పోస్టర్లు, బ్యానర్లు, పాదయాత్రలతోపాటు ఇంటింటికీ తిరుగుతూ జోరుగానే ప్రచారం చేశారు. ప్రధానంగా పోటీపడుతున్న మూడు పార్టీల విషయానికొస్తే.. ‘ఫిర్ ఏక్‌బార్.., నహీ రుకేంగీ మేరీ దిల్లీ’ సందేశంతో కాంగ్రెస్... ‘బద్లేగీ దిల్లీ.. బద్లేగీ భారత్’ సందేశంతో బీజేపీ, ఇమాన్దార్ పార్టీ నినాదంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లను ఆక ట్టుకునేందుకు ప్రయత్నించాయి. కొత్తగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ తలపై టోపీలు, చేతుల్లో చీపుళ్లతో, ఆటోల వెనుక పోస్టర్లు, జాడూ చలావ్ యాత్రలతో మొదలుపెట్టివినూత్న ప్రచార వ్యూహాలతో ఓటర్లపై ముద్రవేయడానికి ప్రయత్నించింది. 15 ఏళ్ల పాలనలో తాము సాధించిన విజయాలను చూపుతూ అభివృద్ధి నినాదంతో.. ‘మెరుగైన ఢిల్లీ కావాలంటే తమకే ఓటువేయాలని’ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఏకవ్యక్తి సైన్యంలా అంతా తానై ప్రచారం నిర్వహించారు. ధరల పెరుగుదల ప్రధానాంశంగా బీజేపీ ప్రచారం సాగించింది. నరేంద్ర మోడీని చూపించి ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే ఆయన బహిరంగ సభలకు జన సమీకరణకు పార్టీ అత్యఅధిక ప్రాధాన్యాన్ని ఇచ్చింది. అవినీతి వ్యతిరేక నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ ఓసారి తమకూ అవకాశాన్ని ఇవ్వాలని ఓటర్లను కోరింది. రోడ్‌షోలతో పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ జోరుగా ప్రచారం చేసి ఢిల్లీలో ఎన్నికల పోరును ముక్కోణ పుపోటీగా మార్చడంలో సఫలమయ్యారు. మహిళల భద్రత, విద్యుత్తు చార్జీలు, నీటి సరఫరా సమస్యలు, ట్రాఫిక్ సమస్యలపై జనాలు ప్రచారానికి వచ్చిన నేతలను నిలదీశారు. ఉల్లిధరల పెరుగుదల ప్రచారంలో ప్రధానాంశమైంది. ప్రముఖులతో ప్రచారం.. విధానసభ ఎన్నికల్లో విజయావకాశాలను మెరుగుపరచడం కోసం అన్ని పార్టీలు జనాకర్షణగల నేతలను, సెలబ్రిటీలను ప్రచారబరిలోకి దింపాయి. కాంగ్రెస్ తరఫున అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అజహరుద్దీన్, రాజ్ బబ్బర్ వంటి సెలబ్రిటీ ఎంపీలు ప్రచారం చేశారు. ఎల్కే అద్వానీ, సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీ, నితిన్ గడ్కారీతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్మృతి ఇరానీ, వినోద్ ఖన్నా, మనోజ్ తివారీ వంటి సెలబ్రిటీలు కమలం పార్టీ కోసం ప్రచారం నిర్వహించినప్పటికీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ బీజేపీ ప్రచారానికి కేంద్ర బిందువయ్యారు. సెప్టెంబర్ ఆఖరున నిర్వహించిన మోడీ సభతో ఊపందుకున్న పార్టీ ప్రచా రం డిసెంబర్ 1న మోడీ సభతో పతాకస్థాయికి చేరింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జేడీయూ అభ్యర్థుల విజయం కోసం, మాయావతి బీఎస్పీ అభ్యర్థుల కోసం బహిరంగ సభలు నిర్వహించారు. ఆమ్ ఆదీ పార్టీ కూడా బాలీవుడ్ నటులతో ప్రచారం నిర్వహించింది. అరవింద్ కేజ్రీవాల్ రోడ్ షోలు జనాలను ఆక ట్టుకున్నాయి. ప్రవాసులను ఆకట్టుకోవడానికి తంటాలు.. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారితోపాటు అస్సాం, బెంగాల్, ఒడిశా రాష్ట్రాత వారు నగరంలో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. బీహార్, యూపీ, జార్ఖండ్ తదిరత రాష్ట్రాలవారు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో కీలకంగా మారారు. అలాగే హర్యానా, ఉత్తరాఖండ్‌లకు చెందిన ఓటర్ల సంఖ్య కూడా రాజధానిలో గణనీయంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కారు ఏర్పాటులో ప్రవాసులకున్న కీలక పాత్రను అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక బహిరంగ సభలో ఢిల్లీని ప్రవాసుల నగరంగా అభివర్ణించారు. తమిళులు, దక్షిణ భారతీయుల ఓటర్లను దృష్టిలో ఉంచుకొని తమిళ పార్టీ డీఎండీకే విధానసభ ఎన్నికల బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో ప్రవాసులను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు ఆయా ప్రాంతాలకు చెందిన నేతలతో ప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్ తరఫున కేరళ ఓటర్లను ఆకట్టుకోవడానికి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ఉత్తరాఖండ్ వాసులను ఆకట్టుకోవడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, హర్యానా వాసులను ఆకట్టుకోవడానికి భూపిందర్ సింగ్ హూడా, హిమాచలీయులను ఆకట్టుకోవడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీర్‌భద్రసింగ్ ప్రచారం చేశారు. పంజాబీలను ఆకట్టుకునేందుకు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ప్రయత్నించారు. పూర్వాంచలీయులను ఆకట్టుకోవడానికి ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు నగరంలో ప్రత్యేకంగా తిష్ట వేసి ప్రచారం జరిపారు. బీజేపీ పూర్వాంచలీయులను అభ్యర్థులుగా బరి లోకి దింపడమేకాక, మనోజ్ తివారీవంటి భోజ్‌పురి సెలబ్రిటీలతో, ఆ ప్రాంత నేతలతో ప్రచారం నిర్వహించింది. శత్రుఘన్ సిన్హా మినహా జనాకర్షణగల సెలబ్రిటీ నేతలను బరిలోకి దింపి బీజేపీ ప్రవాసులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. ప్రచారంలో అడ్డంకులు... ఢిల్లీలో అధికారం కోసం పోరాడుతున్న మూడు ప్రధాన పార్టీలకు ప్రచారంలో ఊహించని సమస్యలు ఎదురయ్యాయి. కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ సభను రద్దు చేయవలసి రాగా... రాహుల్ గాంధీ సభలకు స్పందన కరువైంది. దక్షిణ పురిలో రాహుల్ గాంధీ సభ నుంచి జనాలు మధ్యలోనే వెనుతిరగడం పార్టీని ఇరుకున పడేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయమై తలెత్తిన వివాదంతో బీజేపీ ప్రచారం మధ్యలో కొన్ని రోజుల పాటు పట్టాలు తప్పినప్పటికీ ఆ తరువాత సర్దుకుంది. అంతా తానే అన్నట్లుగా పార్టీ తరపున ప్రచారం చేసిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఉత్సాహం డాక్టర్ హర్షవర్ధన్ని ముఖ్యమంత్రిగా ప్రకటించిన తరువాత చతికిల బడింది. స్టింగ్ ఆపరేషన్ వివాదం, అన్నా హజారే లేఖ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారానికి ఇబ్బందులు సృష్టించాయి.


