breaking news
Cabinet Expands
-
కేబినెట్‌కు దూరంగా.. ఆ మూడు జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: తాజా మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చోటు లభించగా, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రాతినిధ్యం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. తొలి విడత కేబినెట్లో చోటు దక్కని నాలుగు జిల్లాల్లో ఆదిలాబాద్ నుంచి వివేక్ మంత్రిగా ప్రమాణం చేయగా, గతంలో ప్రాతినిధ్యం ఉన్న మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల నుంచే మరో ఇద్దరు మంత్రులయ్యారు.అయితే కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కేబినెట్లో ఇప్పటికే ఇద్దరు చొప్పున ఉండగా, ఇప్పుడు ఒకొక్కరి చేరికతో ఆ రెండు జిల్లాల ప్రాతినిధ్యం మూడుకు పెరిగింది. కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తోడుగా ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ చేరారు. సీఎం రేవంత్‌తోపాటు జూపల్లి కృష్ణారావులు మహబూబ్‌నగర్ నుంచి మంత్రివర్గంలో ఇప్పటికే ఉండగా కొత్తగా వాకిటి శ్రీహరి చేరారు. దీంతో ఇప్పటికే ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లా (భట్టి, పొంగులేటి, తుమ్మల) సరసన కరీంనగర్, మహబూబ్‌నగర్‌లు కూడా చేరాయి. భవిష్యత్‌లో ఏమవుతుందో..? మరోమారు కేబినెట్ విస్తరణ జరిగితే మాత్రం నిజామాబాద్ జిల్లాకు స్థానం ఖాయమని..సీనియర్ నేత పి.సుదర్శన్‌రెడ్డి పేరును ఈసారే ప్రకటించాల్సి ఉన్నా సామాజిక సమీకరణల నేపథ్యంలో సాధ్యం కాక చివరి క్షణంలో తొలగించారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఇప్పటికే స్పీకర్ పోస్టు ఉన్న రంగారెడ్డి జిల్లా ఈసారికి చీఫ్ విప్ పదవితో సరిపెట్టుకోవాల్సిందేనని, మంత్రి పదవికి అనుకూల సమీకరణలు ఈ జిల్లాలో లేవని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప రంగారెడ్డి జిల్లాకు మంత్రిపదవి కష్టమేనని వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ నేతల కొరత కారణంగా కేబినెట్ బెర్తు ఎలా భర్తీ చేయాలో ఆ పార్టీ అధిష్టానానికి కూడా అర్థం కావడం లేదని తెలుస్తోంది. -
ఆ శాఖలతోనే సర్దుబాటు?
సాక్షి, హైదరాబాద్: కొత్త మంత్రులకు ఏఏ శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి తన వద్ద ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా? లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా చూడాలి. అయితే..ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని, తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు విభజించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్‌రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతోపాటు హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్ తదితర శాఖలున్నాయి.ఇందులో మున్సిపల్ శాఖను రెండుగా విభజించి ఒకటి తన వద్దనే ఉంచుకొని, మరోటి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక, విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వబోనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమఫోన్ ట్యాపింగ్, ఇతర కీలక కేసులున్న నేప థ్యంలో ప్రాధాన్యమైన హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతోంది.కార్మిక, పశుసంవర్థకం, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టల సంక్షేమం, మైనింగ్ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలో ఫ్లోర్లు, చాంబర్ల కేటాయింపు అనంతరం ఒకట్రెండు రోజుల్లో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. కర్ణాటక తరహాలో పురపాలికల విభజన కర్ణాటకలో బెంగళూరు, పరిసర పట్టణ ప్రాంతాలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రిగా ఉండగా, మిగిలిన కర్ణాటక రాష్ట్రానికి మరో మంత్రి ఉన్నారు. కర్ణాటకలో ఉన్న తరహాలోనే కోర్ ఏరియాకు ఒకరు, మిగిలిన మున్సిపాలిటీ లకు మరొకరిని మంత్రులుగా నియమిస్తారని సమాచారం. అయితే, కోర్ ఏరియాను తన వద్దే ఉంచుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. మూసీ పునరి్నర్మాణం, ఫోర్త్ సిటీ ఏర్పాటు తదితర కీలకాంశాలు చేపట్టాల్సి ఉన్నందున, హెచ్ఎండీఏ తోపాటు తాను నిర్మించతలపెట్టిన ఫోర్త్‌సిటీ పరిధిని మినహాయించి రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాలను ఒక మంత్రికి అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి పురపాలక శాఖ కార్యదర్శులకు కూడా ఇదే తరహాలో పని విభజన చేయడం గమనార్హం.ఎవరికి.. ఏ శాఖ!సామాజిక, ప్రాంతాల వారీగా సమీకరణల నేపథ్యంలో కొత్త మంత్రులకు ఇచ్చే శాఖలపై చర్చ జరుగుతోంది. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వాకాటి శ్రీహరికి మత్స్య, పశుసంవర్థక శాఖతో మరో ముఖ్యమైన శాఖ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, వివేక్‌కు కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఇవ్వొచ్చని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా కూడా సింగరేణి బెల్ట్ కావడం, గతంలోనూ ఈ శాఖను ఆయన సోదరుడు వినోద్ చూసిన నేపథ్యంలో కార్మిక శాఖ కేటాయించవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీనితోపాటు మరో ముఖ్యమైన శాఖ కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. -
రాజస్తాన్ కాంగ్రెస్‌లో మళ్లీ అలజడి
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నిరసన గళాలు వినిపిస్తున్నాయి. అసమ్మతి నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. తమకు గతంలో ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని, ప్రభుత్వ పదవులు దక్కడం లేదని మండిపడుతోంది. అధికారంలో తమ వంతు వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. పార్టీ అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తమ దారి తాము చూసుకుంటున్నామన్న సంకేతాలను పైలట్ వర్గం ఇస్తోంది. పార్టీలో విభేదాలను పరిష్కరించడానికి ఏఐసీసీ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ కూడా ఈ వ్యవహారంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ వర్గం మధ్య సయోధ్య కుదుర్చేందుకు గట్టిగా ప్రయత్నించడం లేదు. తాజా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ వ్యవహారాల ఇన్చార్జి అజయ్ మాకెన్ స్పందించారు. కేబినెట్లో కొన్ని పదవులతోపాటు నామినేటెడ్, కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరలో భర్తీ చేస్తారని, ఎవరూ నిరాశపడొద్దని అసమ్మతి నేతలను కోరారు. సచిన్ పైలట్‌తో తాను తరచుగా మాట్లాడుతూనే ఉన్నానని, ఆయనలో ఎలాంటి అసంతృప్తి లేదని వివరించారు. మరోవైపు తమలో సహనం నశించిపోతోందని పైలట్ వర్గం చెబుతోంది. పైలట్ వర్గం నుంచి బయటకు రావాలని సీఎం గహ్లోత్ తమపై ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపిస్తోంది. పార్టీ పరిధులను అతిక్రమించకుండా హక్కుల కోసం పోరాడుతామని తేల్చిచెబుతోంది. పైలట్ వెంట ఉన్న 19 మంది ఎమ్మెల్యేలు గత ఏడాది తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. దీంతో ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇస్తామంటూ అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం పైలట్ అనుచరులకు హామీ ఇచ్చింది. కొందరు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయ్యాయని పైలట్ వర్గ ఎమ్మెల్యే వేద్‌ప్రకాశ్ సోలంకి ఆరోపించారు. దీనిపై రాజస్తాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా స్పందిస్తూ... గహ్లోత్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను భయపెడుతోందన్నారు. త్వరలో కేబినెట్ విస్తరణ! సచిన్ పైలట్ వర్గం అసంతృప్తి పెరుగుతుండటంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి అజయ్ మాకెన్ వైరివర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పైలట్ రెండురోజులగా ఢిల్లీలోనే మకాం వేశారు. కేబినెట్లో ఖాళీగా ఉన్న 9 స్థానాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో విలీనమైన బీఎస్పీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం, మహిళలు, మైనారిటీల ప్రాతినిధ్యాన్ని పెంచడం.. సామాజికవర్గ సమీకరణాలు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి. -
కీలక భేటీకి సీనియర్ నేత డుమ్మా.. కారణం అదేనా!
సాక్షి, ముంబై : ఆశించిన పదవి దక్కనప్పుడు రాజకీయాల్లో అలకలు, అసంతృప్తులు సర్వసాధారణం. పార్టీ సభలకు గైర్హాజరు కావడం, నేతలకు అందుబాటులో లేకుండా పోవడం కామన్‌గా జరుగుతుంటాయి. సోమవారం జరిగిన మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కూడా ఇలాంటి ఘటన ఎదురైంది. శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత నమ్మకస్తుడిగా పార్టీలో గుర్తింపు పొందిన నేత సంజయ్ రౌత్. శివసేన జాతీయ వ్యవహారాలను ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. అలాగే ఠాక్రే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ కార్యక్రమాలు, సామ్నా వ్యవహారాలను సైతం ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ విషయంలో రౌత్ కొంత అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ సందర్భంగా విధానభవన్‌లో నిర్వహించిన మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంజయ్ హాజరుకాలేదు. మంత్రివర్గ విస్తరణకు ముందు మూడు పార్టీల నేతల మధ్య జరిగిన కీలక భేటీకి కూడా రౌత్ గైర్హాజరు అయ్యారు. ఈ విషయం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. (మంత్రిగా ప్రమాణం చేసిన మాజీ సీఎం) బీజేపీకి గుడ్‌బై చెప్పి.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో ఒప్పందం కుదిర్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో రౌత్ కీలకంగా వ్యవహరించారు. చివరికి అలాంటి వ్యక్తి కీలకమైన కార్యక్రమానికి ఎందుకు రాలేదనేది మరాఠా గడ్డపై ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శివసేన శాసన సభ్యుడిగా ఉన్న రౌత్ సోదరుడు సునీల్ రౌత్‌కు మంత్రివర్గంలో చోటుదక్కకపోవడం అని సమాచారం. సునీల్‌కు మంత్రిపదవి కోసం సంజయ్ తొలి నుంచి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా అతడికి చోటు దక్కలేదు. దీంతో రౌత్ తీవ్ర అసంతృప్తికి గురియ్యారని సమాచారం. ఈ నేపథ్యంలో రౌత్ దూరంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను సంజయ్ తీవ్రంగా ఖండించారు. తన సోదరుడికి మంత్రిపదవి ఆశించలేదన్నారు. పార్టీ నిర్ణయానికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. పదవుల కోసం తానెప్పుడూ పాకులాడలేదని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. -
కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా: గంగుల
-
తెలంగాణ కేబినెట్లోకి ఆరుగురు
-
గవర్నర్ చేతికి కొత్తమంత్రుల జాబితా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని టీఆర్ఎస్ నేత గుంగుల కమలాకర్ తెలిపారు. కేబినెట్లో చోటు దక్కించుకున్న ఆయన ఇవాళ సాయంత్రం మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తానని అన్నారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. కాగా తెలంగాణ కేబినేట్ విస్తరణలో భాగంగా మరో ఆరుగురికి మంత్రి పదవులు దక్కనున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు హరీశ్‌రావు (సిద్దిపేట), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్ (కరీంనగర్), పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం), శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్ పేర్లు ఖరారయ్యాయి. తొలిసారిగా కేసీఆర్ కేబినేట్ ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. ఇప్పటికే మంత్రుల జాబితాతో రాజ్‌భవన్ వెళ్లిన కేసీఆర్.. ఆ జాబితాను గవర్నర్‌కు అందజేశారు. సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లోకొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు కేటీఆర్, హరీశ్ రావు కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. చదవండి: కేబినెట్లోకి ఆరుగురు -
కేబినెట్లోకి ఆరుగురు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో విస్తరించేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ముహూర్తం నిర్ణయించారు. ఆది వారం దశమి మంచిరోజు కావడంతో నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని శనివారం రాత్రి సీఎం ఆదేశించారు. ఆదివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న తమిళిసై సౌందరరాజన్‌కు మంత్రివర్గ విస్తరణ సమాచారాన్ని ముఖ్యమంత్రి తెలియజేశారు. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో నూతన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో సీఎం కేసీఆర్‌తోపాటు మరో 10 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరుగురికి మంత్రిమండలిలో చోటుకల్పించేందుకు అవకాశం ఉండటంతో పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతమున్న మంత్రులను కొనసాగిస్తూనే కొత్తగా ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించడంపై సీఎం కసరత్తు పూర్తి చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు హరీశ్‌రావు (సిద్దిపేట), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్ (కరీంనగర్), పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం), శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్ పేర్లు ఖరారయ్యాయి. మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఆరుగురికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఉండటంతో జోగు రామన్న, గుత్తా సుఖేందర్‌రెడ్డికి అవకాశాలు అంతగా లేవని తెలిసింది. నేటి రాత్రి మంత్రివర్గం భేటీ... ఆదివారం సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యాక రాత్రి 7 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 2019–20కి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించనుంది. మంత్రిమండలి సమావేశానికి ముందే నూతన మంత్రులకు శాఖల కేటాయింపుతోపాటు కొందరు మంత్రుల శాఖలను సీఎం కేసీఆర్ పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. కేటీఆర్‌కు మరోసారి కీలకమైన ఐటీ, పరిశ్రమలశాఖ దక్కే అవకాశాలు ఉండగా నీటిపారుదల, ఆర్థికశాఖల్లో ఏదో ఒకటి హరీశ్‌కు కేటాయిస్తారని సమాచారం. మండలి చైర్మన్‌గా గుత్తా? మంత్రివర్గంలో చోటు కల్పించే పరిస్థితి లేనిపక్షంలో ఇటీవలే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డిని మండలి చైర్మన్‌గా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే పార్టీలో కీలక నేతలైన కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులకు కీలక పదవులు అప్పగించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంతోపాటు మాజీ మంత్రి నాయినికి టీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి అప్పగించే అవకాశం ఉంది. మాజీ మంత్రి జూపల్లికి రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి కట్టబెడతారని తెలియవచ్చింది. 12 మంది శాసనసభ్యులకు ఉన్నత పదవులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో కీలక పదవులు ఇచ్చే యోచనలో సీఎం ఉన్నారు. మానకొండూరు శాసనసభ్యుడు రసమయి బాలకిషన్‌కు సాంస్కృతిక సారథి చైర్మన్ పదవి మరోసారి దక్కే అవకాశం ఉంది. పల్లాకు పార్టీలో కీలక పదవి... శాసనమండలిలో విప్‌గా పనిచేస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి పార్టీలో కీలక పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలనా యంత్రాంగంతోపాటు పార్టీని కూడా బలోపేతం చేయాలని భావిస్తున్న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్... పల్లా రాజేశ్వర్‌రెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలు తదితరాలను పల్లా రాజేశ్వర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డు, డివిజన్ కమిటీలు, సోషల్ మీడియా కమిటీల ఏర్పాటు వంటి అంశాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. పార్టీ కార్యాలయాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడం, పార్టీ కమిటీల నిర్మాణం ద్వారా అటు ప్రభుత్వం, ఇటు పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రభుత్వం, పార్టీలో గుర్తింపు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. పదవుల పందేరంలో దూకుడు... అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచే సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు పదవుల పందేరాన్ని ప్రారంభించారు. శాసనసభ, శాసనమండలిలో చీఫ్ విప్, విప్ పదవులను భర్తీ చేసిన సీఎం కేసీఆర్.. శాసనసభ సమావేశాల్లో 12 సభా కమిటీల చైర్మన్లు, సభ్యులను కూడా నియమిస్తామని ప్రకటించారు. శనివారం రాత్రి మంత్రివర్గ విస్తరణకు ఆదేశాలు జారీ చేయడంతోపాటు మరికొందరు నేతలకు కీలక పదవులు ఇస్తామనే సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వ, పార్టీ పనితీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో పదవుల పందేరం ద్వారా చెక్ పెట్టాలనే వ్యూహంతో కేసీఆర్ శరవేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తొలి మహిళా మంత్రులు సబిత, సత్యవతి... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు దక్కుతోంది. 2014–2018 మ«ధ్యకాలంలో తెలంగాణ తొలి శాసనసభలో మహిళలకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. పద్మా దేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్‌గా, గొంగిడి సునీతకు ప్రభుత్వ విప్‌గా గతంలో అవకాశం లభించింది. తాజా మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లకు చోటు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
ముస్లింలకు దగా
మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీలకు చోటు కల్పించని చంద్రబాబు ► మేమేం పాపం చేశామంటున్న ముస్లింలు ► వక్ఫ్, హజ్ యాత్రికుల సమస్యలు ముస్లిమేతరులకు ఎలా తెలుస్తాయని నిలదీత ► వచ్చే ఎన్నికల్లో సత్తా చూపుతామని హెచ్చరిక కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లింలకు మరోసారి మొండిచేయిచూపించారు. తాజాగా చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో కూడా వారికి చోటు కల్పించలేదు. దీంతో జిల్లాలోని ముస్లింలు బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మైనారిటీ వ్యతిరేకిలా మారిందని విమర్శిస్తున్నారు. మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు ఏర్పరుచుకున్న తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నాయకులను ఎదగనివ్వకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ సంక్షేమ శాఖను ముస్లిమేతరులకు ఇస్తే మసీదులు, వక్ఫ్, హజ్ యాత్రికులు ఎదర్కొంటున్న సమస్యలు ఎలా తెలుస్తాయని, మైనారిటీల సంక్షేమం కోసం ఎలా పని చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కనీసం పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారిని కూడా చంద్రబాబు గుర్తించడం లేదని వాపోతున్నారు. నంద్యాలకు చెందిన సీనియర్ మైనారిటీ నేత ఎన్ఎండీ ఫరూక్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అందులోనే ఉన్నారు. పార్టీకి వీర విధేయుడిగా పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తిని గుర్తించకపోవడం, పదవులు ఇవ్వకపోవడం దారుణమని పేర్కొంటున్నారు. ముస్లింల వ్యతిరేకి చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ మతోన్మాదం వైపు నడుస్తోంది: తెలుగుదేశం పార్టీ క్రమంగా మతోన్మాదంవైపు అడుగులేస్తోంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ఒక్క ముస్లింకి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అలా మైనారిటీలను అణిచివేయాలనే ధోరణి చంద్రబాబులో కూడా మొదలైంది. ముస్లింలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. చంద్రబాబు అసలు రూపం తెలుసుకోవాలి. ఆత్మాభిమానం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆపార్టీకి తగిన బుద్ధి చెప్పాలి.-ఎంఎ.గఫూర్, సీపీఎం మాజీ ఎమ్మెల్యే ముస్లింలను అవమానించిన చంద్రబాబు: కేబినెట్ విస్తరణలో మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముస్లింలను అవమానించారు. అన్ని వర్గాలకు సమాన హక్కులు, పదవులు కల్పించాలని రాజ్యాంగం చెబుతుంది. టీడీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మైనారిటీలను విస్మరించడం దారుణం.-మౌలాన హాఫీజ్ ఖాజీ అబ్దుల్ మాజిద్, ముస్లిం జేఏసీ చైర్మన్, జామేతే ఉలమా జిల్లా అధ్యక్షుడు ప్రజల్లోకి ఎలా వెళ్లాలి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో మైనార్టీలకు స్థానం కల్పించకుండా అన్యాయం చేశారు. జనాభాలో 12శాతం మంది ఉన్న ముస్లింలు ఆయనకు గుర్తుకు రాకపోవడం సరికాదు. త్వరలో నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల్లో ముస్లింల వద్దకు వెళ్లి ఓటు ఎలా అడగాలి. -ఎన్ఎండీ ఫిరోజ్, నంద్యాల టీడీపీ యువనేత హామీలతో మభ్యపెడుతున్నారు: చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లింలను అణచివేస్తూనే ఉన్నారు. పదవులు ఇవ్వకుండా హామీలతో మభ్యపెడుతున్నారు. ప్రస్తుతం మంత్రి వర్గంలో మళ్లీ ముస్లింలకు అన్యాయం జరిగింది. ముస్లింలందరూ సంఘటితమై బాబుకు గుణపాఠం చెప్పాలి.– ఖాద్రి, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం