breaking news
Business turnover
-
SBI: రూ. 200 లక్షల కోట్ల టర్నోవర్!
న్యూఢిల్లీ: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2030లో 75వ వ్యవస్థాపక దినోత్సవం (ప్లాటినం జూబ్లీ) జరుపుకునే నాటికి మొత్తం వ్యాపారం రూ. 200 లక్షల కోట్లకు చేరుకోవచ్చని బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి చెప్పారు. ప్రస్తుత వృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే టర్నోవర్ రెట్టింపయ్యే అవకాశం ఉందన్నారు. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యకలాపాల బదిలీ సహా ఇతర అంశాల కోసం పార్లమెంటులో చట్టం ద్వారా 1955 జూలై 1న ఎస్బీఐ ఆవిర్భవించింది.దేశంగా అతిపెద్ద బ్యాంకుగా నిలుస్తున్న ఎస్బీఐ మొత్తం వ్యాపారం (మొత్తం రుణాలు, అడ్వాన్సులు) గత ఆర్థిక సంవత్సరం (2025–26) రెండో త్రైమాసికంలో తొలిసారి రూ.100 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ నాటికి ఇది రూ.110.01 లక్షల కోట్లకు ఎగబాకింది. కాగా, ప్లాటినం జూబ్లీ నాటికి నిర్దిష్ట టార్గెట్ ఏదీ బ్యాంకు నిర్దేశించుకోలేదని, అయితే, ప్రస్తుత వృద్ధి ప్రకారం చూస్తే టర్నోవర్ రూ.170–180 లక్షల కోట్లుగా ఉండొచ్చని, గరిష్టంగా రూ.200 లక్షల కోట్లను కూడా తాకే చాన్సుందని చెప్పారు. అది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.ఎకానమీతో పాటే... ఎస్బీఐ కార్యకలాపాలు భారత ఎకానమీ పనితీరుతో ముడిపడి ఉన్నాయని శెట్టి పేర్కొన్నారు. ‘మన ఆర్థిక వ్యవస్థ ఏటా 7–8 శాతం మేర గనుక వృద్ధి చెందితే, ఎస్బీఐ బ్యాలెన్స్ షీట్ కూడా 11–12 శాతం వార్షిక వృద్ధి రేటును సాధించే సామర్థ్యం ఉంటుంది. అంటే, ప్రతి ఆరేళ్లకు బ్యాలెన్స్ షీట్ రెట్టింపవుతుంది. దీని ప్రకారం చూస్తే 2030 కల్లా ఎస్బీఐ మొత్తం బిజినెస్ రూ. 200 లక్షల కోట్లకు చేరవచ్చు‘ అని ఆయన వివరించారు. కస్టమర్లు, ఉద్యోగులు, వాటాదారులు, అలాగే ఆర్బీఐతో సహా ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు... ఈ నాలుగు పక్షాల ప్రయోజనాలు లేదా అవసరాలను తీర్చేవిధంగా బ్యాంకు కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో విజన్ 2030పై ఫోకస్ చేస్తున్నామని కూడా ఎస్బీఐ చైర్మన్ తెలిపారు. -
రాష్ట్రంలో టర్నోవర్ 1.30 లక్షల కోట్లు: ఎస్బీఐ
ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ విభాగం వ్యాపార టర్నోవర్ 1.30లక్షల కోట్లకు చేరినట్లు బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ సీఆర్ శశికుమార్ వెల్లడించారు. వీటిలో అడ్వాన్స్‌ల రూపంలో రూ. 61వేల కోట్లు,వ్యవసాయ రుణాలు రూ.25వేల కోట్లు, వ్యక్తిగత రుణాల విభాగంలో కార్లు, ద్విచక్రవాహన తదితర రుణాల కింద రూ.20వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. విశాఖలోని బ్యాంకు ప్రధాన బ్రాంచ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన ఉద్యమాల వలన కొన్ని ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో సీమాంధ్రలో బ్యాంకింగ్ వ్యాపారం మరింత పెరగగలదని అంచనా వేస్తున్నట్లు శశికుమార్ వివరించారు. ప్రస్తుతం బ్రాంచ్‌ల సంఖ్య 3,400 ఉండగా, రానున్న ఆర్థికసంవత్సరంలో అదనంగా మరో 100 ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే మరో 600 ఏటీఏం కేంద్రాలను కూడా నెలకొల్పనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా క్యాష్‌డిపాజిట్ యంత్రాలు70 ఉండగా, వీటి సంఖ్యను 90కి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆరు ఈ-లాబీలు కూడా ప్రారంభిస్తామని శశి కుమార్ చెప్పారు. ఏటీఏం కేంద్రాల్లో అదనపు భద్రత అంశంపై ఉన్నతస్థాయి చర్చలు జరుగుతున్నాయన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాలపై ఈ ఏడాది రూ.11కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. మార్కెట్లోకి బీఎండబ్ల్యూ దేశీ గ్రాన్ టూరిజ్మో చెన్నై: భారత్‌లో తయారు చేసిన 3 సిరీస్ గ్రాన్ టూరిజ్మో కారును బీఎండబ్ల్యూ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 42.75 లక్షలు (ఆల్ ఇండియా ఎక్స్ షోరూం ధర). గంటకు 226 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగే గ్రాన్ టూరిజ్మో.. డీజిల్ వెర్షన్లో లభ్యమవుతుంది. చెన్నైకి దగ్గర్లోని మహీంద్రా వరల్డ్ సిటీలో ఉన్న తమ ప్లాంటులో ఈ కారును తయారు చేసినట్లు బీఎండబ్ల్యూ తెలిపింది.


