breaking news
Bunny N Cherry
-
బన్ని-చెర్రి నవ్విస్తారు
ఓ పెనుమార్పు ఇద్దరి జీవితాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బన్ని ఎన్ చెర్రి’. ప్రిన్స్, మహత్ రాఘవేంద్ర, కృతి, సభా హీరో, హీరోయిన్లుగా... మల్టీ డైమన్షన్ సమర్పణలో హరూన్ గని ఆర్ట్స్‌పై హరూన్ గని నిర్మించారు. రాజేష్ పులి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల 6న విడుదల కానుంది. హరూన్ గని మాట్లాడుతూ -‘‘మారుతి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన రాజేష్ పులి ఈ చిత్రాన్ని చెప్పిన బడ్జెట్లో తీశారు. ప్రేక్షకుల పల్స్ బాగా తెలిసిన దర్శకుడాయన. ఇప్పటివరకు భారతీయ తెరపై ఇలాంటి సినిమా రాలేదు. వినోద ప్రధానంగా తీసిన చిత్రం ఇది. శ్రీవసంత్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని, అందర్నీ నవ్వించాలనే లక్ష్యంతో చేసిన సినిమా ఇది అనిదర్శకుడు తెలిపారు. యండమూరి వీరేంద్రనాధ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, చంద్రమోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రవికుమార్, మాటలు: తిరుమలశెట్టి కిరణ్. -
ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న 'బన్ని n చెర్రి'
బస్టాప్ వంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రంతో నటించిన యంగ్‌హీరో ప్రిన్స్, బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ సినిమాతో క్రేజి యూత్‌ఫుల్ హీరోగా మారిన మహత్ రాఘవేంద్రులు హీరోలుగా, అందాలబామలు కృతి, సభా హీరోయిన్స్‌గా ప్రముఖ నిర్మాణసంస్థ మల్టీడైమన్షన్ సమర్పణలో, హరూన్ గని అర్ట్సు బ్యానర్లో నిర్మాత హరూన్ గనినిర్మిస్తున్నారు. రాజేష్ పులి దర్శకుడిగా పరాచయమవుతున్నారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మరియూ కామెడి కింగ్ బ్రహ్మనందం కీలక పాత్రలు చేస్తున్నారు.