బన్ని-చెర్రి నవ్విస్తారు | 'Bunny n Cherry' releasing on 6th december | Sakshi
Sakshi News home page

బన్ని-చెర్రి నవ్విస్తారు

Nov 26 2013 11:36 PM | Updated on Sep 2 2017 1:00 AM

బన్ని-చెర్రి నవ్విస్తారు

బన్ని-చెర్రి నవ్విస్తారు

ఓ పెనుమార్పు ఇద్దరి జీవితాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బన్ని ఎన్ చెర్రి’. ప్రిన్స్, మహత్ రాఘవేంద్ర, కృతి, సభా హీరో, హీరోయిన్లుగా

ఓ పెనుమార్పు ఇద్దరి జీవితాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బన్ని ఎన్ చెర్రి’. ప్రిన్స్, మహత్ రాఘవేంద్ర, కృతి, సభా హీరో, హీరోయిన్లుగా... మల్టీ డైమన్షన్ సమర్పణలో హరూన్ గని ఆర్ట్స్‌పై హరూన్ గని నిర్మించారు. రాజేష్ పులి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల 6న విడుదల కానుంది. హరూన్ గని మాట్లాడుతూ -‘‘మారుతి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన రాజేష్ పులి ఈ చిత్రాన్ని చెప్పిన బడ్జెట్‌లో తీశారు.
 
  ప్రేక్షకుల పల్స్ బాగా తెలిసిన దర్శకుడాయన. ఇప్పటివరకు భారతీయ తెరపై ఇలాంటి సినిమా రాలేదు. వినోద ప్రధానంగా తీసిన చిత్రం ఇది. శ్రీవసంత్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని, అందర్నీ నవ్వించాలనే లక్ష్యంతో చేసిన సినిమా ఇది అనిదర్శకుడు తెలిపారు. యండమూరి వీరేంద్రనాధ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, చంద్రమోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రవికుమార్, మాటలు: తిరుమలశెట్టి కిరణ్.
 

Advertisement
 
Advertisement
Advertisement