bsc student died
-
పెంచుకున్న మమకారం తెంచుకొని వెళ్లిపోతే..!
పెంపుడు పిల్లి చనిపోయిందని బీఎస్సీ చదువుతున్న ఒక అమ్మాయి, పిల్లిని ఇంట్లోకి తేవద్దని తల్లి మందలించినందుకు ఎంబీబిఎస్ చదువుతున్న మరో అమ్మాయి– ఇటీవల సూసైడ్ చేసుకున్నారు. పెట్స్‌ను పెంచుకునేవారి శాతం ఇటీవల బాగా పెరుగుతోంది. పెట్స్‌తో అనుబంధమూ పెరుగుతోంది. దీని వల్ల కొత్త సమస్యలూ ఉత్పన్నమవుతున్నాయి. ఇంటిల్లిపాదీ ముందుగా పెట్స్‌కు సంబంధించిన వాస్తవాలను తెలుసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించవచ్చు అంటున్నారు నిపుణులు...‘పిల్లి చనిపోతే ఏడుస్తున్నావా, కుక్కపోతే అంత దుఃఖమా..’ అంటూ బాధపడుతున్నవారితోనే అవమానకరంగా మాట్లాడేవారుంటారు. దీనివల్ల వారి బాధ మరింత పెరుగుతుంది అంటున్నారు మనస్తత్వ నిపుణులు. పెట్ అంటే కేవలం ఒక జంతువు కాదు. అది మనసుకు అండగా నిలిచే ఒక జీవం. మనం బాధల్లో లేదా ఆనందంలో ఉన్నప్పుడు మాటలేమీ లేకుండానే మనసును అర్థం చేసుకునే తోడు. అందుకే, ఇటీవలి కాలంలో చాలామంది పెట్స్‌తోనే ఎక్కువ అటాచ్‌మెంట్‌ను ఏర్పరుచుకుంటున్నారు. మనతో కలిసి జీవించే ప్రాణి అకస్మాత్తుగా దూరమైతే, ఇక ఎప్పటికీ రాదని తెలిస్తే మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. సున్నిత మనస్కులు మరింత భావోద్వేగాలకు గురయ్యే అవకాశాలున్నాయి. అత్యంత ప్రియమైన వ్యక్తిని కోల్పోతే ఎంత బాధ కలుగుతుందో పెంపుడు జంతువును కోల్పోయినా అంతే బాధ కలుగుతుంది.వాస్తవం ఏంటంటే...∙పెట్స్‌కి మనుషుల కంటే తక్కువ జీవనప్రమాణం ఉంటుంది. పిల్లి జీవితం కాలం 13 నుంచి 20 ఏళ్లు. కుక్క ఆయుష్షు బ్రీడ్‌ను బట్టి 10 – 13 ఏళ్లు, కుందేలు 7 –10 ఏళ్లు. ఇలాగే, ఇతర జంతువులు, పక్షులకు.. నిర్దిష్టమైన ఆయుష్షు ఉంటుంది. ∙పోషణ, అనారోగ్య పరిస్థితులు, ప్రమాదాలు, బరువు నిర్వహణ.. ఇవన్నీ కూడా పెంపుడు జంతువుల ఆయుర్దాయాన్ని నిర్దేశిస్తాయి. వీటిని తప్పక అంగీకరించాల్సిందే. ఈ విషయాన్ని పెట్‌ను ఇంటికి తీసుకురావడానికి ముందే కుటుంబ సభ్యులందరూ తెలుసుకోవాలి. పిల్లలు ఉంటే వారికి ఈ నిజాలు తప్పక చెప్పాలి. ∙పెంపుడు ఎలా ఉండాలి, క్రమశిక్షణ, వాటికి ఇవ్వాల్సిన శిక్షణ, కుటుంబంలో అందరూ నిబంధనను తప్పక పాటించాలి. నెలకు ఒకసారైనా పెట్స్ పెంపకం గురించి మంచి–చెడులను అందరూ కలిసి బేరీజు వేసుకోవాలి. ∙పెట్ చనిపోవడం ఒక్కటే కాకపోవచ్చు... సూసైడ్‌కు ఒత్తిడికి సంబంధించిన కారణాలు మరిన్ని ఉండి ఉండవచ్చు.తేలిగ్గా తీసేయవద్దుకుటుంబంలో పెంపుడు జంతువుతో ఎవరికి ఎక్కువ అటాచ్మెంట్ ఉందో అలాంటి వ్యక్తిని ఒంటరిగా ఉండనివ్వకూడదు. ‘పిల్లికి, కుక్కకే.. ఇలా అయిపోతే ఎలా.. అది ఒక జంతువు మాత్రమే కదా’ అనే మాటలతో వాళ్ల బాధను చిన్నచూపు చూడద్దు. దీనివల్ల ఇంట్లో తమ భావోద్వేగాలను పట్టించుకోనివారిగా, తమ బంధాన్ని అగౌరవ పరిచినట్టుగా భావిస్తారు. ఇవి చేయించవచ్చు...∙పెట్ రెస్క్యూ సెంటర్స్, అడాప్షన్ సెంటర్స్‌కి వెళ్లి రావచ్చు. ∙మరో చిన్న పెట్‌ను కుటుంబంలోకి ఆహ్వానించవచ్చు. ∙యానిమల్ రెస్క్యూ టీమ్స్‌తో కలిసి స్వచ్ఛందంగా తమ సేవలను అందించవచ్చు. ∙పెట్ లాస్ – ఆన్లైన్ సపోర్ట్ గ్రూప్స్, హ్యూమన్ వరల్డ్ లింక్ వంటి గ్రూప్స్ ఉన్నాయి, వాటిలో చేరి బాధను పంచుకోవచ్చు. ∙పెట్ జ్ఞాపకార్ధం ఒక మొక్కను తెచ్చి నాటి, ఆ మొక్క పెంపకంలో సేదతీరవచ్చు. ∙పెంపుడు జంతువు గురించి నచ్చిన విషయాలను రాసి, ఇంట్లో అందరూ ఆ విషయాలను పంచుకోవచ్చు. ∙బాధ నుంచి కోలుకోవడానికి స్థల మార్పిడి బెటర్. ∙మనసుకు దగ్గరగా ఉండే స్నేహితులు, బాధను పంచుకోగలవారు దగ్గరగా ఉండాలి. పెట్ మన జీవితంలో ఒక భాగం మాత్రమే. జీవితం మొత్తం కాదు. పెంపుడు జంతువు పంచిన ప్రేమను గుర్తుంచుకోవాలి. కానీ మన జీవితాన్ని వదిలేయకూడదు.. అనే వాస్తవాల్ని పెట్ లవర్స్ తెలుసుకోవాలి, సన్నిహితులకు తెలియజెప్పాలి.నిపుణుల సాయం అవసరం...పెట్స్‌ను ప్రేమించడం మంచి విషయం. కానీ, ఆ ప్రేమ మన బతుకుని బలి తీసుకునేలా ఉండకూడదు. ఎక్కువ ఎమోషన్‌కు గురవుతుంటే, మూల కారణాలను కూడా తెలుసుకోగలగాలి. దుఃఖిస్తున్నవారితో మాట్లాడుతూ ఉండాలి. గతంలో పెంపుడు జంతువుతో ఉన్న సమయాలు పదే పదే గుర్తుకు వస్తుంటే, ఆ సమయం లో మరో ఇష్టమైన వ్యాపకంతో పూరించుకోవాలి. అధిక ప్రేమ, భావోద్వేగాల విషయంలో కుటుంబంలో ఎవరైనా బాధపడుతుంటే కౌన్సిలర్ సాయం తప్పక అవసరం.– డాక్టర్ సునీత ప్రసాద్, సైకాలజిస్ట్ -
ప్రేమ విఫలమై విద్యార్థిని బలవన్మరణం
హైదరాబాద్: మూడేళ్లుగా ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో బీఎస్సీ విద్యార్థిని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం పోలీసులు తెలిపిన మేరకు.. వైజాగ్‌కు చెందిన కోమలి (21)చిత్రపురి కాలనీలో బంధువుల వద్ద ఉంటూ బీఎస్సీ చదువుతూ యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వైజాగ్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, యూట్యూబర్ అఖిల్ రెడ్డితో కోమలి మూడేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే ఇటీవల ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం కోమలి ఆత్మహత్యా యత్నం చేయడంతో పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. అఖిల్ దూరంగా ఉంటానని చెప్పినా కోమలి వినిపించుకోలేదు. రెండు రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. అఖిల్ పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహన్ని స్వా«దీనం చేసుకున్న పోలీసులు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అఖిల్ రెడ్డిని విచారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తన కూతురు కోమలిని అఖిల్ రెడ్డి మోసం చేయడంతో చనిపోయిందని తల్లి వరలక్ష్మీ పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
విద్యార్థిని అనుమానాస్పద మృతి
హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి శివారులోని ఓ విద్యాసంస్థలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్ధిని అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే తన కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి రాథోడ్ మోహన్‌సింగ్ ఆరోపించారు. ఈ మేరకు హసన్‌పర్తి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కండెపల్లికి చెందిన రాథోడ్ మోహన్‌సింగ్ (డిప్యూటీ కలెక్టర్, మైనారిటీ కార్పొరేషన్ అ«ధికారి, నిర్మల్) కూతురు రాథోడ్ దీప్తి(19) కళాశాల హాస్టల్లోనే ఉంటూ అగ్రికల్చర్ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం దీప్తి కళాశాల హాస్టల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఉరి వేసుకున్నట్టు సమాచారం ఇవ్వలేదు దీప్తి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, గురువారం సాయంత్రం తాను ఫోన్లో మాట్లాడినట్టు తండ్రి మోహన్‌సింగ్ పేర్కొన్నారు. ఉదయం తన భార్య ఫోన్ చేస్తే త్వరగా ఎంజీఎంకు రమ్మన్నారే తప్ప ఆత్మహత్య చేసుకున్న విషయం చెప్పలేదన్నారు. మృతదేహాన్ని కిందకు దింపిన సమయంలో సెక్యూరిటీ సిబ్బందితోపాటు మరికొంతమంది మగవారు ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. కిందకు దింపినప్పుడు తహసీల్దార్, పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. దీప్తిపై అత్యాచారం, ఆపై హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి మోహన్‌సింగ్ పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. 11,12 తేదీల్లో సీసీ ఫుటేజీ సేకరించాలని పోలీసులను కోరారు. దీప్తి మృతిపై సమగ్ర విచారణకు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. టీజీవీపీ, టీఎస్ఎఫ్, గిరిజన శక్తి మోర్చ సంఘాలు ఆ విద్యాసంస్థ ఎదుట ఆందోళన నిర్వహించాయి. యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. దీప్తి మృతిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ గోపి తెలిపారు. కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న గదిని సీజ్ చేసినట్టు తెలిపారు. -
ప్రేమించపోతే ప్రాణం తీస్తారా?
బొమ్మనహళ్లి (మంగళూరు): సరస్వతీ నిలయంలో రక్తం చిందింది. అమ్మాయి త న ప్రేమను అంగీకరించలేదని ఒక యువకుడు ఉన్మాదిగా మారి ఆమెను కత్తితో పొడిచి చంపాడు. తాను కూడా పొ డుచుకుని ఆత్మహత్యా యత్నం చేయబోయాడు. ఈ విషా ద ఘటన మంగళవారం దక్షిణకన్నడ జిల్లా మంగళూరు స మీపంలో ఉన్న సుళ్యలో చోటు చేసుకుంది. అక్కడి నెహ్రు మెమోరియల్ కళాశాల్లో బీ.కాం చదువుతున్న కార్తీక్ (21) అనే విద్యార్థి ఈ ఘోరానికి ఒడిగట్టాడు. మృతురాలు అక్షత (21) ఇదే కళాశాల్లో బీఎస్సీ విద్యార్థిని. ఇద్దరు సుళ్యవాసులే. కొంత కాలంగా కార్తీక్ అక్షతను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. అక్షత అతని ప్రేమను నిరాకరిస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ కళాశాల నుంచి అక్షత బయటకు వస్తున్న సమయంలో కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆరుసార్లు పొడవడంతో అమ్మాయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కార్తీక్ కూడా ఆత్మహత్యయత్నం చేస్తుండగా స్థానికులు పట్టుకుని అతన్ని ఆస్పత్రికి తరలించారు. సుళ్య పోలీసులు సంఘటనా çస్థలానికి వచ్చి పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
ప్రేమ కోసం బలైన ఓ‘లేడి’కూన
బాపట్ల (గుంటూరు): ప్రేమ మధురమైనదని.. ప్రేమే జీవితమని.. ప్రియుడు తోడే ప్రపంచమని భావించిన ఆ యువతి చివరకు ఆ ప్రేమను పొందలేక తనకుతానే మరణశిక్ష విధించుకున్న ఉదంతం కన్నవారి కడుపు కోతను మిగిల్చింది. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన మీసాల సాయితేజస్విని (19) ప్రేమికుల రోజుకు రెండు రోజుల ముందే మృత్యువును ఆశ్ర యించింది. బుధవారం రాత్రి ఒంటిగంట వరకు ఫోన్లో ప్రియుడుతో సంభాషించి ఆ యువతి గురువారం ఉదయం 10గంటలకు మృత్యువాతపడింది. కిట్టు ఆలియాస్ యోగేశ్వరరావుతో ఆ యువతి ఫోన్ సంభాషణల రికార్డులను పోలీసులు, కళాశాల యాజమాన్యం పరిశీలించాయి. ఎస్ఎంఎస్లో ప్రియుడి నుంచి నిర్దేశించిన సమయంలోపు ఫోన్ రాకపోతే తరువాత తనతో మాట్లాడేందుకు అవకాశం ఉండదని స్పష్టంగా తెలిపినట్టు సమాచారం. తనకు తానే ప్రేమ కోసం శిక్షించుకున్న ఆ ‘లేడి’కూనను చూసి సాటి విద్యార్థినులు బావురమన్నారు. పుట్టిన రోజు బట్టలే.. పుట్టికి ఉపయోగపడ్డాయి సాయితేజస్విని చనిపోయిన సమాచారం తెలుసుకుని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి వచ్చిన తల్లిదండ్రులు భాస్కరరావు, వెంకటలక్ష్మి, సోదరుడు పవన్ బోరున విలపించారు. ఈనెల 22న తన పుట్టిన రోజు కోసం తల్లిదండ్రులతో కలిసి తాను ఎంతో ముచ్చటపడి కొనుగోలు చేసిన దుస్తులు చివరకు ఆ యువతి పుట్టికి ఉపయోగపడ్డాయి. ఈనెల 7న కొవ్వూరులో జరిగిన పెళ్లికి హాజరైన సాయితేజస్వితో మధుర సృ్మతులను తండ్రి భాస్కరరావు గుర్తుచేసుకుని విలపించిన తీరు చూపరులను కలచివేసింది.


