breaking news
books distributes
-
పీవీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
సనత్‌నగర్ (హైదరాబాద్): మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులకు సూచించారు. గురువారం బేగంపేట బ్రాహ్మణవాడిలోని స్వామి రామానందతీర్థ మెమోరియల్ స్కూల్‌ను సందర్శించి ఆయన విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగ్‌లు పంపిణీ చేశారు. అలాగే తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 16 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పీవీ నరసింహారావు దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు.ఆయన చూపిన మార్గంలో నడుస్తూ విద్యార్ధులు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. 2023లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభించిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పిల్లలతో గడిపే ప్రతి క్షణం ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా ర్ధులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం కూడా అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.స్వామి రామానందతీర్థ మెమోరియల్ స్కూల్‌కు అవసరమైన అదనపు తరగతి గదులు, ఆధునిక లైబ్రరీ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ హామీనిచ్చారు. విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్సీ వాణీదేవి సేవలను ప్రశంసించారు. ఇది సామాజిక బాధ్యత: ఎమ్మెల్యే తలసాని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్ధులకు చేయూత అందించడం సమాజ బాధ్యత అని తల సాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ట్రస్ట్ కార్యక లాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విద్యా సేవలను విస్తరింపజేస్తున్న ఎమ్మెల్సీ వాణీదేవిని ఆయన అభినందించారు. తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం స్వచ్ఛందంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి నాణ్యమైన విద్యతో పాటు సరైన పోషకాహారం కూడా అవసరమని ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. పిల్లలకు సమతుల్య పోషకాహారం అందించినప్పుడే వారి మేధస్సు వికసిస్తుందన్నారు. -
విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ
అనంతపురం సప్తగిరిసర్కిల్ : దివాకర్ సోషల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆ« ద్వర్యంలో స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జర్నలిస్టుల పిల్లలకు పాఠ్య, నోట్ పుస్తకాలను పంపి ణీ చేశారు. కార్యక్రమం లో ఏపీ డబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వీటి పరిష్కారానికి మీడియో ఉద్యోగులు సమైక్య పోరాటం చేయాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు జేసీ పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి దినపత్రిక బ్రాంచ్ మేనేజర్ కేదార్‌నాథ్‌రెడ్డి, మీడియా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శివానంద, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు సనప రామకృష్ణ, జయరాం, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు రసూల్ పాల్గొన్నారు.


