breaking news
The board of directors
-
పాలకులకు పట్టని ఐటీడీఏ
ఏటూరునాగారం: గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పాలక మండలి సమావేశాలను సకాలంలో నిర్వహించడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారు. ప్రతి మూడు నెలలకోసారి పాలక మండలి సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండు సార్లు మాత్రమే ఐటీడీఏ పాలకమండలి సమావేశాలు నిర్వహించారు. చివరి సమావేశం గత ఏడాది ఏప్రిల్ 8వ తేదీన జరిగింది. సమావేశం జరిగి నేటికి ఏడాది. సంవత్సర కాలంగా సమావేశం ఊసే లేదు. ఐటీడీఏ అధికారులు సమావేశం నిర్వహణను పట్టించుకోకపోవడంతో గిరిజన సంఘాలు తప్పుబడుతున్నాయి. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి చందూలాల్ సొంత నియోజకవర్గలోనే ఐటీడీఏకు ఈ గతి పట్టిందంటే.. ఇతర ఐటీడీఏ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేరకు నిధులు విడుదల చేశాయో...ఏమేరకు పనులు పూర్తి చేశారో అధికారులకు తప్పా మరొకరికి తెలియదు. ప్రతి ఏడాది ఐటీడీఏకు కోట్లాది రుపాయాలు అభివృద్ధి కోసం వివిధ పథకాల కింద కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్నా వాటి అమలులో జరిగే లోపాలను గుర్తించక పోవడం వల్ల గిరిజనులకు అందకుండా పోతున్నాయి. గిరిజన గూడేలకు ఇప్పటికీ రవాణా, తాగునీటి సౌకర్యం, మౌలిక సదుపాయలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇందిర జలప్రభ బోర్లు, విద్య, ఉపాధి హామీ, ఇంజనీరింగ్ శాఖ, స్పెషల్ ఎంఐ, అటవీ హక్కుల చట్టం, పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ, వైద్య విభాగం, పట్టుపరిశ్రమ, ఉద్యానవన శాఖ, ఎల్టీఆర్, ఐకేపీ, గిరిజన సహకార సంస్థ, ఎకనామికల్ సపోర్ట్ స్కిం వంటి పథకాలు గిరిజనులకు అరకొరగానే అందుతున్నారుు. పాలకమండలి నిర్వహించాలి - పొడెం బాబు, తుడుందెబ్బ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు పాలక మండలి సమావేశాలు మూడు నెలలకోమారు నిర్వహించాలి. గిరిజనులకు కావాల్సిన అభివృద్ధి పథకాలు, చేపట్టాల్సిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. ఐటీడీఏ స్థితిగతులు పాలకమండలి ద్వారానే ప్రజలకు వెల్లడవుతాయి. తక్షణమే పాలకమండలి నిర్వహించాలి. -
టీటీడీ ఉద్యోగులకు షాక్
22,600 మంది సిబ్బంది బ్రహ్మోత్సవ బహుమానంలో కోత పాలక మండలి ప్రతిపాదనలను తిరస్కరిస్తూ జీవో నెం.123 జారీ తిరుపతి అర్బన్: ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు టీటీడీ ఉద్యోగులకు షాక్ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఇచ్చిన బ్రహ్మోత్సవ బహుమానంలో రాష్ట్ర ప్రభుత్వం కోత విధించింది. బోర్డు తీర్మానించి పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడంతో బోర్డు సభ్యులకు కూడా భంగపాటు ఎదురైంది. టీటీడీ బోర్డు చైర్మన్‌గా టీడీపీ నేత చదలవాడ కృష్ణమూర్తి, బోర్డు సభ్యుడిగా కేంద్రంలోని బీజేపీకి చెందిన రాష్ట్రనేత భానుప్రకాష్‌రెడ్డి వున్నప్పటికీ వేలాది మంది ఉద్యోగుల కోసం ప్రతిపాదించిన బహుమానంలో ప్రభుత్వం కోత విధిస్తూజీవో నెం.123ను రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జెఎస్వీ ప్రసాద్ బుధవారం మధ్యాహ్నం జారీచేశారు. దీంతో టీటీడీలోని 22,600 మంది ఉద్యోగులకు అందజేస్తున్న బ్రహ్మోత్సవ బహుమానంలో కోతపడింది. దీనిని వ్యతిరేకిస్తూ టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు బుధవారం సాయంత్రం అత్యవసర ఐక్య కార్యాచరణ సమావేశాన్ని నిర్వహిం చారు. ప్రతిసారి తాను జిల్లా వాసినేనంటూ ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చివరకు వేలాది మంది ఉద్యోగుల ఆర్థిక వెసులుబాటుపై దెబ్బకొట్టడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిపై ఇప్పటికే టీటీడీ చైర్మన్‌తో ఫోన్లో సంప్రదించిన పలు ఉద్యోగ సంఘనాయకులకు సానుకూల స్పందన రాలేదని విశ్వసనీయ సమాచారం. టీటీడీ ఉద్యోగులకు బోనస్ బదులుగా బ్రహ్మోత్సవ బహుమానాన్ని 1990 నుంచి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏటా పర్మినెంట్, కాంట్రాక్టు ఉద్యోగుల విభాగాలకు విడివిడిగా బహుమానం అందజేస్తున్నారు. అందుకోసం ఏటా టీటీడీ బోర్డు సమావేశంలో తీర్మానించి ప్రభుత్వ అనుమతితో ఉద్యోగులందరికీ బ్రహ్మోత్సవ బహుమానా న్ని ఖాతాల్లో జమచేసేవారు. ఇదేక్రమంలో 2014లో పర్మినెంట్ ఉద్యోగులకు రూ.11 వేలు, కాంట్రాక్టు / ఔట్సోర్సింగ్/ ఎన్ఎం ఆర్ ఉద్యోగులకు రూ.5,500లు బహుమానం గా ఇచ్చేవారు. అనంతరం టీటీడీలోని అన్ని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ పోరాట సమితి నేతృత్వంలో ఉద్యమం నిర్వహించి బహుమానాన్ని పెంచుకున్నారు. అందులో భాగంగా 2015లో పర్మినెంట్ ఉద్యోగులకు రూ.12,200, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6,100 బహుమానం పెంచుతూ టీటీడీ బోర్డులో తీర్మానించి ప్రభుత్వానికి నివేదిం చారు. అందుకు సంబంధించి డిసెంబర్ 7వతేది జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న తీర్మానాన్ని అదే నెల 14వతేది ఈవో ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందినప్పటికీ టీటీడీ బోర్డు తీర్మానానికి వ్యతిరేకంగా బహుమానంలో కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమేరకు రెగ్యులర్ ఉద్యోగులకు 10 వేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5 వేలు మాత్రమే చెల్లించడానికి అనుమతి ఇచ్చింది. ఆర్థికభారమనే సాకుతో.. టీటీడీ ఉద్యోగులకు అందజేస్తున్న బ్రహ్మోత్సవ బహుమానాన్ని ఏటా పెంచుకుంటూ పోవడం వల్ల టీటీడీకి తీవ్ర ఆర్థికభారం కలుగుతోందనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం జీవోను జారీచేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ప్రధానంగా సూచించింది. 2014లో ఇచ్చిన బహుమానం మేరకు పర్మినెంట్ ఉద్యోగులు 9,600 మందికి రూ.10.56 కోట్లుగా ఉన్న బహుమానం 2015లో పెంచడంతో రూ.11.71 కోట్లకు చేరింది. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులు 13వేల మందికి 2014లో రూ.7.15 కోట్లుగా వుండగా, 2015లో పెంచిన మేరకు రూ.7.93 కోట్లకు చేరింది. వీటన్నింటినీ లెక్కించి సుమారు రూ.కోటి 93 లక్షలు అదనపు భారం టీటీడీపై పడుతోందని.. అందుకే బోర్డు ప్రతిపాదనలను తిరస్కరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. -
పెరిగిన ఓటర్లు 13.61 లక్షలు
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలోకొత్తగా కొలువుదీరనున్న పాలక మండలి ఎన్నికలకు 13.61 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త వారి చేరికతో కలిపి వచ్చే జనవరిలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు 71 లక్షల మంది ఓటర్లు ... 150 మంది స్థానిక ప్రజాప్రతినిధులను ఎన్నుకోనున్నారు. ఇప్పటి వరకు (అక్టోబర్ 5 వరకు నమోదు చేసుకున్నవారు) ఉన్న ఓటర్లు 70.60 లక్షల మంది. నోటిఫికేషన్ వెలువడే వరకు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. దీంతో ఈ సంఖ్య దాదాపు 71 లక్షలకు పెరగవచ్చునని అంచనా. డివిజన్ల సంఖ్య (150)లో మార్పు లేనప్పటికీ, స్వరూప స్వభావాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. డీలిమిటేషన్‌తో కొన్ని డివిజన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోగా... మరికొన్నిటిలో స్వల్ప మార్పులు జరిగాయి. సగటున 43 వేల మంది ఓటర్లు ఒక్కో ప్రజాప్రతినిధి (కార్పొరేటర్)ని ఎన్నుకోనున్నారు. 2009 అక్టోబర్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల (వార్డుల)లోని ఓటర్లు : 56,99,015 {పస్తుతం 150 డివిజన్ల (వార్డుల)లోని ఓటర్లు :70,60,493 గడచిన ఆరేళ్లలో పెరిగిన ఓటర్లు : 13,61,478


