bhajana
-
అభ్యర్థుల ప్రచార పాట్లు!
ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లడగటం పాత పద్ధతి. పశ్చిమ బెంగాల్లో అభ్యర్థులు ప్రచారం రూటు మార్చారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వింత పాట్లు పడుతున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని కుండను పగుల గొట్టడం వంటి ఆటలు ఒకరు ఆడుతుంటే.. మరొక అభ్యర్థి బార్బర్ అవతారమెత్తారు. ఇంకొకరు ఏకంగా వంటింట్లోకి వెళ్లి చపాతీలు చేస్తే.. మరొకరు గుడిలో భజన కీర్తనలు పాడే పరమ భక్తుడిగా మారిపోయారు.చపాతీలు చేస్తూ... అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ ఇక్కట్లు అందరికీ తెలిసిందే. హుగ్లీలోని పుర్సురాలో గ్యాస్ లేక కట్టెల పొయ్యితో కుస్తీలు పడుతున్న ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు టీఎంసీ అభ్యర్థి పార్థ హజారీ. ఓ ఇంట్లో నేరుగా కిచెన్‌లోకి వెళ్లి మట్టి పొయ్యిపై రొట్టెలు చేశారు. సునాయాసంగా రొట్టె చేసి తన పాక కళను ప్రదర్శించారు. ‘‘గతంలో నేను రొట్టెలు చేశాను. వంట గురించి కొంత తెలుసు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక చాలా కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి. వారికి సాయం చేయాలని ప్రయతి్నంచాను’’ అని చెప్పుకొచ్చారు.కళ్లకు గంతలు కట్టుకుని.. రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలో అసాధారణమైన ఎన్నికల ప్రచారం జరుగుతోంది. రంజాన్ పండుగ సందర్భంగా స్థానికంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ చంద్ర బౌరీ సంప్రదాయ ‘హండీ ఫోడ్’ ఆట ఆడారు. కళ్లకు గంతలు కట్టుకుని, కుండను కర్రతో పగలగొట్టడానికి ప్రయతి్నంచారు. అయితే కుండ పగులగొట్టడంలో ఆయన విఫలమైనప్పటికీ.. జరగబోయే ఎన్నికల్లో బీజేపీ కూడా ఇలాగే ఓడిపోతుందని సింబాలిక్ చెప్పాలనుకున్నారు. దీనిని బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే అనూప్ కుమార్ సాహా విమర్శించారు. కళ్లు మూసుకుని బీజేపీని ఓడించడం సాధ్యం కాదంటూ అధికార పారీ్టపై తవ్రంగా స్పందించిన ఆయన.. సామాన్య ప్రజలను ఆకట్టుకోవడానికి క్షురకుడి అవతారమెత్తారు. సాహా దుబ్రాజ్‌పూర్‌లో ఒక గ్రామస్తుడికి ఏకంగా గడ్డమే గీశారు! ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.సీపీఎం అభ్యర్థి పూజలు పానిహటిలో సీపీఎం పార్టీ అభ్యర్థి కల్తాన్ దాస్‌గుప్తా పార్టీ సిద్ధాంతాలను పూర్తిగా పక్కకు పెట్టి మరీ ఏకంగా మహోత్సవ్ తళా ఘాట్ ఆలయంలో ప్రార్థనలతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇలాంటి వైరుధ్యాలు గతంలో కూడా చోటుచేసుకున్నాయని దాస్‌గుప్తా చెప్పారు. మాజీ రాష్ట్ర మంత్రి, దివంగత సుభాష్ చక్రవర్తి సైతం ఒకప్పుడు తారాపీఠ్ ఆలయంలో ఇలాగే ప్రార్థనలు చేసి పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చకు తెరలేపారు. గోపీబల్లవ్పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బీజేపీ రాజేశ్ మహతో ఏకంగా భక్తుడి అవతారమెత్తారు. ఝార్గ్రామ్ అటవీ ప్రాంతంలోని పటాశిముల్లో ఇంటింటి ప్రచారానికి ముందు హరి నామ సంకీర్తన పాడారు. గ్రామస్తులతో కలిసి భక్తి గీతాలు ఆలపించారు. సభలో ప్రజలపై గులాల్ చల్లుతూ ఆడుకున్నారు.‘మత్స్య’ రాజకీయాలు బీజేపీ అధికారంలోకి వస్తే మాంసాహారాన్ని నిషేధిస్తుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బిధాన్నగర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ శరద్వాత్ ముఖర్జీ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సాల్ట్ లేక్‌లోని ఐఏ మార్కెట్లో ఆయన ‘కట్ల’ చేపను చేతిలో పట్టుకుని మరీ ప్రచారం చేశారు. ‘‘బెంగాలీ సంస్కృతిలో చేపలు, అన్నం ప్రధానాహారం. అలాంటిది, బీజేపీ గెలిస్తే చేపలను తినకుండా నిషేధం విధిస్తుందని టీఎంసీ తప్పుడు ప్రచారం చేస్తోంది’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘బెంగాలీలకు చేప ఆహారం మాత్రమే కాదు. మన సంప్రదాయం. మన గుర్తింపులో ఒక భాగం. చేప లేకుండా ఏ శుభకార్యమూ ప్రారంభం కాదు. చివరకు పెళ్లి పత్రికలతో కూడా చేపను పంపిస్తారు. అందుకే చేప ద్వారానే నా ప్రత్యర్థులకు సందేశం పంపాలనుకుంటున్నా. చేపలు, అన్నంపై నిషేధం సంగతి అలా ఉంచితే... ప్రజలు కనీసం ఒక చేప ముక్కను కూడా కొనలేని దుస్థితిని టీఎంసీ పాలన తీసుకొచ్చింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజలు రెండింతలు ఎక్కువగా చేపలు తినగలుగుతారు’ అని పేర్కొన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
క్లబ్బుల్లో భక్తి పారవశ్యం.. 20 వేల కోట్లకు పైగా బిజినెస్
సాక్షి స్పెషల్ డెస్క్: మసక వెలుతురు, దట్టమైన పొగలు, నియాన్ లైట్లు, తెల్లవార్లూ సాగే ‘టకీలా’ షాట్ల సేవనం.. ఇవన్నీ ఇప్పుడు పాత కాలపు యూత్ ఫ్యాషన్. కొత్త ట్రెండ్ ఏమిటో తెలుసా? ‘ఆధ్యాత్మిక ఓలలాట’! భక్తి భావనల ‘దమ్ మారో దమ్’! నైట్ క్లబ్బుల్లో జరుగుతున్నఈ ‘సోబర్ రేవ్’ (మందు లేని మత్తు) పార్టీలు తాజా ఇండియన్ ట్రెండ్! అక్కడ డీజే బేస్ చప్పుళ్ల బదులు.. వేద మంత్రాల వైబ్రేషన్లు వస్తుంటే, దేహం తాదాత్మ్యం చెంది స్టెప్పులేస్తుంది.ఆలయాలు దాటిన పారవశ్యంఇప్పటి వరకు, ప్రశాంతత అలుముకుని ఉండే గుడులకు, ఇంట్లో జరిగే జాగరణలకు మాత్రమే పరిమితమైన మన భక్తి ధ్యానం.. ‘ఎరీనా ఎరా’ (స్టేడియం రేంజ్ స్టేజ్) లోకి అడుగుపెట్టింది. భక్తికి కార్పొరేట్ గ్లామర్ తోడై, భజన్ క్లబ్బింగ్ అనే కాన్సెప్ట్ జీవం పోసుకుంది.కాక్‌టైల్స్‌కు బదులుగా తేనీరు జెన్–జెడ్ మెట్రో కుర్రకారు పూర్తిగా పంథా మార్చేశారు. మూస నైట్ క్లబ్‌ల గందరగోళాన్ని వదిలేసి, ఆధ్యాత్మిక క్లబ్బులలోకి క్యూ కడుతున్నారు. చేతిలో కాక్టెయిల్ గ్లాసులకు బదులు వేడి వేడి కుల్హద్ చాయ్ పట్టుకుని.. రాధికా దాస్, కేశవమ్ వంటి కళాకారుల భజన పాటలకు చిందులేస్తున్నారు.‘సన్ బర్న్’ కే సవాలుగా నిలిచి..!అంతర్జాతీయ స్థాయి ఎల్.ఈ.డి స్క్రీన్లు, మెరిసిపోయే స్ట్రోబ్ లైట్లు, అదిరిపోయే సౌండ్ సిస్టమ్‌తో ఈ భజన్ క్లబ్బింగ్ జరుగుతోంది. ఎంతలా అంటే ఈ ఈవెంట్స్ ఇప్పుడు ‘సన్ బర్న్’ వంటి పాశ్చాత్య శైలి ఇండియన్ మ్యూజిక్ ఫెస్టివల్స్‌కు గట్టి పోటీ ఇస్తున్నాయి.పెరుగుతున్న ఆదరణ– మూస క్లబ్ కంటే భజన్ ఈవెంట్లలో జనం ఎక్కువ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. స్పాన్సర్ చేసే బ్రాండ్లకు కూడా ఈ కాన్సెప్ట్ లాభదాయకంగా ఉంటోంది.– ఆల్కహాల్, గొడవలు లేని ఈ వాతావరణం కుటుంబాలను, యువత ఇద్దరినీ ఆకట్టుకుంటోంది.– భారత ప్రభుత్వం 2026 బడ్జెట్లో ఇలాంటి ‘కల్చరల్ ఎకానమీ’ని దేశ ఆర్థికాభివృద్ధికి ఒక చోదక శక్తిగా గుర్తించటం కూడా భజన్ క్లబ్బింగ్‌కు ప్రాధాన్యం తెచ్చిపెట్టింది.సాంస్కృతిక సునామీ పరిశ్రమ దిగ్గజాలు ఈ భజన్ క్లబ్బింగ్ కల్చర్‌ను ముద్దుగా ‘భారత్కోర్’ అని పిలుస్తున్నారు. ఇదేమీ చిన్న మార్పు కాదు, ఏకంగా రూ. 20,000 కోట్ల లైవ్ ఈవెంట్స్ మార్కెట్‌ను ముంచెత్తుతున్న ఒక సాంస్కృతిక సునామీ!మార్చిలో సాజ్–ప్రఖర్ టూర్2026 మార్చిలో ‘సాజ్–ప్రఖర్’ బృందం దేశవ్యాప్త టూర్ ప్రారంభం కానుంది. ఢిల్లీ, ముంబై, జైపూర్ లుధియానా వంటి నగరాలను సాజ్, ప్రఖర్ దంపతులు భక్తి మత్తులో ముంచేయనున్నారు. సంప్రదాయ భక్తి సంగీతానికి (భజనలు) ఆధునిక క్లబ్ శైలిని సమ్మిళతం చేయటం వీరి ప్రత్యేకత.‘మన్ కీ బాత్’లో ప్రస్తావన!2026 జనవరి 25న ప్రసారం అయిన 130 వ ‘మన్ కి బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రెండ్ గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన సైతం ఈ కొత్త ఒరవడిని ‘భజన్ క్లబ్బింగ్’ గా పేర్కొనటంతో దీనికి ఎక్కడ లేని ప్రాముఖ్యం లభించింది.ప్రధాని ఏమన్నారంటే..‘‘మన దేశంలో భజనలు, కీర్తనలు శతాబ్దాలుగా మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. అయితే నేటి జెన్–జెడ్ యువత ఆ భక్తిని తమదైన శైలిలో, ఆధునిక జీవన విధానానికి అనుగుణంగా మార్చుకోవడం విశేషం. ఇది ఆధునికత, సంప్రదాయాల అద్భుతమైన సమ్మేళనం’’ -
జానపద గాయకుడిపై కరెన్సీ నోట్ల వర్షం.. వీడియో వైరల్..
గాంధీనగర్: నటులు, గాయకులు, ఇతర కళాకారులపై కొందరు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తారు. గజరాత్ ప్రముఖ జానపద గాయకుడు కృతిన్ గాధ్వీకి సరిగ్గా ఇలాగే జరిగింది. ఆయన పాటలు పాడుతుండగా.. కొందరు కరెన్సీ నోట్ల వర్షం కురిపించి ఇష్టాన్ని చాటుకున్నారు. ఆయనపై రూ.10, 20, 50, 100 నోట్లు గుమ్మరించారు. 'వల్సాద్ అగ్నివీర్ గో సేవా దళ్' నిర్వహించిన భజన కార్యక్రమంలో ఇలా జరిగింది. మార్చి 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వందల మందిని కృతిన్ గాధ్వి తన గాత్రంలో అలరించి ఉత్సాహపరిచారు. అయితే గోవుల సేవ కోసం ఫండ్స్ సేకరించేందుకు ఈ భజన నిర్వహించారు నిర్వహకులు. దీంతో ఈ డబ్బునంతా ఛారిటీకే ఇస్తున్నట్లు గాధ్వీ తెలిపారు. #WATCH | People showered money on singer Kirtidan Gadhvi at an event organised in Valsad, Gujarat on 11th March pic.twitter.com/kH4G1KUcHo — ANI (@ANI) March 12, 2023 విరాళాల సేకరణ కోసం ఇలా భజనలు నిర్వహించడం గుజరాత్లో కొత్తేంకాదు. స్వామి వివేకానంద ఐ టెంపుల్ ట్రస్టు కూడా కొత్త కంటి ఆసుపత్రి కోసం ఇలాంటి కార్యక్రమం నిర్వహించి ఫండ్స్ సేకరించింది. చదవండి: ఇదేం ధమ్కీరా నాయనా.. అండ్రాయిడ్ ఫోన్ ఫ్రీగా ఇచ్చి తెలివిగా రూ.లక్షలు కాజేశారు.. -
భజన వీడియోకు ముగ్ధురాలైన కంగనా
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ముక్కుసూటి మనిషి. మనసులో ఏదీ దాచుకోదు. తనకు ఏమనిపించినా నిర్మొహమాటంగా బయటకు చెప్తుంది. ఈ వైఖరి వల్ల కొందరు ఆమెను మెచ్చుకున్నప్పటికీ చాలామంది నొచ్చుకుంటారు కూడా! ఇదిలా వుంటే తాజాగా ఆమె ఓ వీడియోను చూసి మైమరిచిపోయింది. ఓ పల్లెలో సాంప్రదాయంగా రెడీ అయిన మహిళలు, అమ్మాయిలు భజన చేస్తూ పాట పాడుతుండగా ఓ యువతి ఆ పాటకు లయబద్ధంగా కాళ్లు కదుపుతూ నాట్యం చేస్తోంది. ఇందులో అందరూ సాంప్రదాయ దుస్తులే ధరించి ఓ వరుస క్రమంలో ముందుకు వెళ్తున్నారు. కనుల విందుగా కనిపిస్తున్న ఈ వీడియో వినసొంపుగానూ ఉంది. "ఇది కర్ణాటకలో జరిగే ఓ ఆధ్యాత్మిక భజన. ఇలాంటివి ఇంకెక్కడ జరుగుతున్నాయి అనుకున్నా. కానీ పల్లెల్లో ఇలాంటి సంస్కృతి, సాంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయి" అని ఇది నిరూపిస్తోంది అంటూ స్మిత ప్రకాశ్ అనే మహిళ ఈ వీడియోను షేర్ చేసింది. దీన్ని కంగనా తిరిగి షేర్ చేస్తూ 'ఇలాంటి మనోహరమైన దృశ్యాలకు అంతం అనేది ఉండదు, ప్రతి రోజు ఇలాంటివి ఏదో ఒకటి ఇంకా కొత్తగా వస్తూనే ఉంటాయి. ఈ దేశంతో మనల్ని ప్రేమలో పడేలా చేస్తాయి' అని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన చాలామంది నిజంగానే ఈ భజన మనోహరంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇక కంగనా సినిమాల విషయానికొస్తే.. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన ‘తలైవి’ చిత్రంలో నటిస్తోంది. బుధవారం జయలలిత జయంతి సందర్భంగా ‘తలైవి’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న ‘తలైవి’ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. మరోవైపు యాక్షన్ మూవీ 'థాకడ్'లో నటిస్తుండగా ఇది దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేయాలనుకుంటున్నారు. చదవండి: మంచుకొండల్లో కల తీర్చుకుంటున్న బాలీవుడ్ క్వీన్ రౌడీగా మారిన అభిషేక్.. సీఎం అవుతాడట! -
‘భజన బ్యాచ్’తో వస్తోన్న యప్‌టీవీ
సాక్షి, హైదరాబాద్: ప్రాంతీయ టీవీ చానెల్స్‌తో ఒప్పందం చేసుకుని.. ఆయా కార్యక్రమాలను విదేశాల్లో ప్రసారం చేసే ఆన్లైన్ వేదిక యప్ టీవీ తాజాగా వెబ్ సిరీస్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఇది సొంతంగా సీరియల్స్‌ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భజన బ్యాచ్ పేరుతో.. వెబ్ సిరీస్‌ని నిర్మిస్తున్నట్లు యప్ టీవీ యాజమాన్యం తెలిపింది. దర్శకుడు మారుతి అందించిన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చిన్న వాసుదేవ రెడ్డి (ఐడ్రీమ్), యప్‌టీవీ స్టూడియోలు సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యప్ టీవీ యాజమాన్యం మాట్లాడుతూ.. 12 ఎపిసోడ్లుగా సాగే ఈ వెబ్ సిరీస్‌లో పోసాని కృష్ణమురళి, గెటప్ శ్రీను, జెమిని సురేష్, దీప నాయుడు, జోగి కృష్ణరాజు, షకలక శంకర్, బుల్లెట్ భాస్కర్, గణపతి, గోవింద్, సుధాకర్ రాఘవ, అప్పారావ్ వంటి ప్రముఖ హస్యనటులు నటిస్తున్నారని తెలిపారు. భజన బ్యాచ్ అనేది కామిక్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కనున్నట్లు తెలిపారు. భజనలే బతుకుతెరువుగా బండి లాగిస్తున్న ఓ వ్యక్తి వారసత్వంగా తన పిల్లలకు కూడా భజనలు నేర్పుతాడు. అయితే ఇది వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేసింది.. వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారు.. ఈ సందర్భంగా ఏర్పడిన పరిణామాలు వంటి అంశాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. పంచ్‌లు, కామెడీ సన్నివేశాలు, ఆసక్తికర ట్విస్ట్‌లతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యప్ టీవీ ఫౌండర్, సీఈఓ ఉదయ్ నందన్ రెడ్డి మాట్లాడుతూ, ‘ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఉత్తమమైన ప్రాంతీయ అంశాలను అందించడమే మా ప్రధాన ధ్యేయం. ఈ క్రమంలో మేము మరో గొప్ప సిరీస్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాము’ అని తెలిపారు. అంతేకాక ‘భజన బ్యాచ్’ అనేది ప్రధానంగా యువతనే కాక అన్ని వయసుల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు ఉదయ్ నందన్ రెడ్డి. -
ఆరాధ్యుడి ఆరాధనకు అంకురార్పణ
– రాయరు 345వ ఆరాధనోత్సవాలు ప్రారంభం – కన్నుల పండువగా ధ్వజారోహణ మంత్రాలయం: కురుస్తున్న విరుల వాన.. మోగుతున్న మంగళవాయిద్యాలు.. ధ్వనిస్తున్న వేద మంత్రోచ్ఛారణలు..దాససాహిత్య మహిళల హరిదాస కీర్తనలు, భజనలు.. భక్తుల హర్షధ్వానాల మధ్య శ్రీరాఘవేంద్రస్వామి 345వ సప్త రాత్రోత్సవాలు ప్రారంభయమ్యాయి. బుధవారం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతత్వంలో ఉత్సవాల అంకురార్పణ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ముందుగా గజరాజు స్వాగతం పలుకుతుండగా పీఠాధిపతి రాయరు మూల బందావన దర్శనం చేరుకుని విశేష పూజలు గావించారు. శ్రీమఠం ముంగిట గజరాజు, గోమాత, తురగ(అశ్వం)పూజ భక్తిశ్రద్ధలతో కానిచ్చారు. శ్రీమఠం ప్రాకార శిఖరాగ్రం నుంచి పూలు కురిపిస్తుండగా పీఠాధిపతి ధ్వజారోహణతో వేడుకలకు అంకురార్పణ పలికారు. అడ్మినిస్ట్రేటివ్, పీఆర్వో, క్యాస్, ఏఏవో, మేనేజర్ కార్యాలయాల్లో లక్ష్మి, రాయరు చిత్ర పటాలకు పూజలు చేశారు. రాత్రి డోలోత్సవ మండపంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు ఊంజల సేవ, చెక్క, వెండి, బంగారు, నవరత్న రథోత్సవాలు జరిపారు. విశ్వమోహనుడి పర్వం : సుభుదేంద్రతీర్థులు, పీఠాధిపతి శ్రీరాఘవేంద్రస్వామి ఉత్సవాలు కేవలం మంత్రాలయం మఠంలోనే కాకుండా విశ్వమంతటా నిర్వహించబడుతోందని పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు పేర్కొన్నారు. వేడుకల ప్రారంభోత్సవంలో పీఠాధిపతి మాట్లాడుతూ భువనమోహనుడు రాయరు ఆరాధన రోజుల్లో భక్తులకు కరుణచూపుతో ఆశీర్వదిస్తారన్నారు. రాయరు మహిమలు అమోఘమన్నారు. భక్తుల కల్పతరువుగా ప్రాణకోటి సుభిక్షానికి మూల గురువుగా నిలుస్తారన్నారు. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భక్తులు, పోలీస్ యంత్రాంగం సహకరించాలని కోరారు. ఏడు రోజుల పాటు భక్తులకు సకల సౌకర్యాలు క్షేత్రంలో ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పీఠాధిపతి పూర్వాశ్రమ తండ్రి, గురువు గిరియాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ మునిస్వామి పాల్గొన్నారు. శ్రీమఠంలో ఎంపీ బుట్టారేణుక రాఘవేంద్రస్వామి దర్శనార్థం బుధవారం కర్నూలు ఎంపీ బుట్టారేణుక మంత్రాలయం వచ్చారు. ముందుగా ఆమె గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకుని రాఘవేంద్రుల మూల బందావనంకు పూజలు చేసుకున్నారు. అనంతరం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు శేషవస్త్రాలు, రాఘవేంద్రుల జ్ఞాపిక, ఫల,పూల మంత్రాక్షితలతో ఆశీర్వదించారు. మఠం మేనేజర్ శ్రీనివాస రావు పూర్ణకుంభంతో ఎంపీకి ఆహ్వానం పలికారు. ఆమెతోపాటు సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు గోరుకల్లు కష్ణ ఉన్నారు.


