breaking news
beeraiah
-
రైతుబంధు ఎన్నికల స్టంట్
సదాశివపేట(సంగారెడ్డి) : పంచాయతీ, ఎంపీటీసీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం ప్రవేశపెట్టారని టీజేఎస్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ బీరయ్యయాదవ్ అన్నారు, ఆదివారం స్థానిక ఐబీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కోంటున్న ముఖ్య సమస్యలే ప్రధాన ఎజెండాగా టీజేఎస్ ఉద్యమిస్తుందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణాలో ప్రజల సమస్యలను గాలికోదిలేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు పాకులాడుతుందన్నారు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చేలగాటమాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించకుండా, ఎన్నికల ముందు రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్కు రైతులపై చిత్తశుద్ది ఉంటే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి స్వామినాథన్ కమిటీ సిఫారస్సులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీజేఎస్ పార్టీని జిల్లాలోని గ్రామాల్లో విస్తరించడం కోసం మండల, పట్టణ కమిటీల నిర్మాణ సభ్యత్వ నమోదు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో యువకులు పెద్ద ఎత్తున చేరుతున్నారని తెలిపారు, కార్యక్రమంలో జిల్లా టీజేఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, పులిమామిడిరాజు, సంగమేశ్వర్యాదవ్, నరేష్, సుధాకర్ పాల్గొన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
బిక్నూరు: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిక్నూరు మండలం కాచేపూర్లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సంగెపు బీరయ్య(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారిలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుధ్ఘాతంతో రైతు మృతి
ధర్మారం: వ్యవసాయ మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు కరెంట్షాక్కు గురై మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం బచ్చయ్యపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చెంచు బీరయ్య(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.