రైతుబంధు ఎన్నికల స్టంట్‌   | Rythu Bandhu Election Stunt | Sakshi
Sakshi News home page

రైతుబంధు ఎన్నికల స్టంట్‌  

Jun 11 2018 3:55 PM | Updated on Aug 15 2018 9:10 PM

Rythu Bandhu Election Stunt - Sakshi

మాట్లాడుతున్న బీరయ్యయాదవ్‌  

సదాశివపేట(సంగారెడ్డి) :  పంచాయతీ, ఎంపీటీసీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల కోసమే సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకం ప్రవేశపెట్టారని టీజేఎస్‌ సంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ బీరయ్యయాదవ్‌ అన్నారు, ఆదివారం స్థానిక ఐబీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు  ఎదుర్కోంటున్న ముఖ్య సమస్యలే ప్రధాన ఎజెండాగా టీజేఎస్‌ ఉద్యమిస్తుందన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణాలో ప్రజల సమస్యలను గాలికోదిలేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  ప్రచార ఆర్భాటాలకు పాకులాడుతుందన్నారు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చేలగాటమాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించకుండా, ఎన్నికల ముందు రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టడం ఏమిటని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌కు రైతులపై చిత్తశుద్ది ఉంటే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి స్వామినాథన్‌ కమిటీ సిఫారస్సులను అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీజేఎస్‌ పార్టీని జిల్లాలోని గ్రామాల్లో విస్తరించడం కోసం మండల, పట్టణ కమిటీల నిర్మాణ సభ్యత్వ నమోదు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో యువకులు పెద్ద ఎత్తున చేరుతున్నారని తెలిపారు,   కార్యక్రమంలో  జిల్లా టీజేఎస్‌ నాయకులు  వెంకటేశ్వర్లు, పులిమామిడిరాజు, సంగమేశ్వర్‌యాదవ్, నరేష్, సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement