breaking news
baby body
-
అంబులెన్స్ డ్రైవర్ అమానుషం
మహారాణిపేట (విశాఖ) : విశాఖపట్నం కేజీహెచ్‌లో ఇదో అమానుష ఘటన. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రుల పనితీరుకు అద్దంపట్టిన దారుణం. అనారోగ్యంతో మృతిచెందిన రెండు నెలల పసికందును, ఆ చిన్నారి తల్లిదండ్రులను కేజీహెచ్ అంబులెన్స్ డ్రైవర్ నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన ఘోర ఉదంతమిది. దిక్కుతోచని, నిస్సహాయ స్థితిలో ఆ తల్లిదండ్రులు రాత్రిపూట విగత జీవితో ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికెళ్లారు. అందరినీ కదిలించే ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ మడ్రేబు గ్రామానికి చెందిన సేదరి శైలు, అర్జున్ దంపతులకు రెండు నెలల కిందట చిన్నారి జన్మించింది.పాపకు శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఈనెల 8న విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం పసికందు మృతిచెందింది. పాప మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లడానికి కేజీహెచ్ అంబులెన్స్‌లో బయల్దేరారు. కొంతదూరం వెళ్లాక కొత్తవలస జంక్షన్లో అంబులెన్స్ డ్రైవర్ వీరిని దించేశాడు. తమ వద్ద డబ్బుల్లేవని, స్వస్థలానికి తీసుకెళ్లమని తల్లిదండ్రులు ప్రాథేయపడ్డా కనికరించలేదు. దీంతో వారు తెలిసిన వారి ద్వారా డబ్బులు తెప్పించుకుని, ఆటోలో రూ.6 వేలకు సరియా వరకు వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి సమయంలో పాప మృతదేహాన్ని మోసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.వేడుకున్నా కనికరించలేదు..ఇక ఈ దారుణంపై బాధితులు శైలు, అర్జున్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కేజీహెచ్ అంబులెన్స్ డ్రైవర్ చాలా నిర్దయగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బుల్లేవని చెప్పినా వినకుండా పాప మృతదేహంతో ఉన్న తమను కొత్తవలస జంక్షన్లో బాధ్యతారహితంగా వదిలేశాడని ఆరోపించారు. దీంతో రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఐదు కిలోమీటర్ల మేర పాప మృతదేహాన్ని మోసుకుంటూ ఇంటికి చేరుకున్నామని వారిరువురూ విలపిస్తూ చెప్పారు. అంబులెన్స్ డ్రైవర్‌పై చర్య తీసుకోవాలని, సరియా నుంచి మాడ్రేబు వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. -
ఏమైందో తెలియదు కానీ.. పాపం పసిపాప..
కావలి రూరల్: ఆడ పిల్ల భారమైందా? అనైతిక సుఖం పాపానికి రూపమై అడ్డంగా మారిందా? ఏమైందో తెలియదు కానీ.. ముక్కు పచ్చలారని మూడు నెలల పసిబిడ్డ నిర్జీవమై చెరువు నీటిలో తేలియాడింది. ఈ ఘటన మండలంలోని ఆముదాలదిన్నె సమీపంలో తాళ్లపాళెం చెరువులో ఆదివారం ఈ ఘటన వెలుగుచూసింది. కావలి రూరల్ పోలీసుల సమాచారం మేరకు.. తాళ్లపాళెం చెరువు నీటిలో గుర్తుతెలియని చిన్నారి మృతదేహం ఉన్నట్లు ఆముదాలదిన్నె వీఆర్ఓ సమాచారం అందించడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. 3 నెలల చిన్నారి పాపగా గురించారు. చిన్నారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడేళ్ల క్రితం స్పెర్మ్‌తో పండంటి బిడ్డ
సాక్షి, హైదరాబాద్ : ఏడేళ్ల క్రితం ముందు జాగ్రత్తతో ఆ దంపతులు భద్రపరుచుకున్న స్పెర్మ్.. ఇప్పుడు వారికి పండంటి బిడ్డను ప్రసాదించింది. కేన్సర్ చికిత్సకు వెళ్లే ముందు వైద్యుల సలహా మేరకు ఆయన తన వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంకులో భద్రపరుచుకున్నాడు. దాన్ని వినియోగించిన ఐసీఎస్ఐ (ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజక్షన్) ద్వారా ఇప్పుడు వారు తల్లిదండ్రులయ్యారు. 2012లో 23 ఏళ్ల కార్తీక్ (పేరు మార్చాం)కు వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య మెడియాస్టినల్ ట్యూమర్ (కేన్సర్)తో బాధపడుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చికిత్సలో ఎదురయ్యే దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని.. అతడి వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంకులో భద్రపరుచుకోమని వైద్యుడు సలహా ఇచ్చారు. దీంతో 2012లో కేన్సర్ చికిత్స ప్రారంభానికి ముందు కార్తీక్ తన వీర్యాన్ని ఒయాసిస్ ఫెర్టిలిటీ బ్యాంకులో భద్రపరిచాడు. సంవత్సరం క్రితం ఆయన కేన్సర్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అయితే.. కిమోథెరపీ, రేడియోథెరపీ మోతాదుల కారణంగా తండ్రి అయ్యే సామర్థ్యాన్ని కోల్పోయాడు. ఈ క్రమంలో భద్రపరిచిన వీర్యం ద్వారా సంతానం పొందాలని నిర్ణయించుకున్న ఆ దంపతులు.. ఒయాసిస్ ఫెర్టిలిటీని సంప్రదించారు. ఐసీఎస్‌ఐను మాక్స్(మాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్) వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 2019లో పిండాన్ని తయారుచేసి.. మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. అలా గర్భం దాల్చిన ఆ మహిళ గత వారం పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇటీవలే ఆస్పత్రి నుంచి తల్లిబిడ్డలు డిశ్చార్జయ్యారు. -
మృతశిశువును కొరుక్కుతిన్న ఎలుకలు