breaking news
Asia Cup tournament T20
-
Asia Cup 2022: ‘ఆసియా’ అందుకునేందుకు..
దుబాయ్: టి20 ప్రపంచ కప్‌కు ముందు ఈ ఫార్మాట్లో ఉపఖండపు ప్రధాన జట్లు సన్నాహకానికి సన్నద్ధమయ్యాయి. ద్వైపాక్షిక సిరీస్‌లు కాకుండా కొంత విరామం తర్వాత భారత జట్టు కూడా రెండుకంటే ఎక్కువ జట్లు ఉన్న టోర్నీలో బరిలోకి దిగుతోంది. దాంతో ఆసియా కప్ టోర్నమెంట్ ఆసక్తికరంగా మారింది. ఆతిథ్యం ఇవ్వాల్సిన శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో చేతులెత్తేయడంతో చివరి నిమిషంలో వేదిక యూఏఈకి మారింది. తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే ఈ సమయంలో ఆటగాళ్లకు ఇది కూడా సవాల్. టి20 ప్రపంచ కప్ జరిగే ఆస్ట్రేలియాతో పోలిస్తే పిచ్‌లు, పరిస్థితుల్లో చాలా వ్యత్యాసం ఉన్నా, తమ ఆటగాళ్లను పరీక్షించుకునేందుకు అన్ని జట్లూ ప్రయత్నిస్తాయి. భారత్, పాకిస్తాన్ మధ్య కనీసం రెండు మ్యాచ్‌లతో పాటు మరో మ్యాచ్ కూడా జరిగే అవకాశం ఉండటంతో టోర్నీ పై అభిమానుల ఆసక్తి మరింత పెరిగేలా చేసింది. 2020లో జరగాల్సిన టోర్నీ కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చి రెండేళ్లు ఆలస్యంగా జరుగుతోంది. జట్ల వివరాలు: (గ్రూప్ ‘ఎ’)భారత్, పాకిస్తాన్, హాంకాంగ్. (గ్రూప్ ‘బి’) శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్. ఫార్మాట్: తమ గ్రూప్‌లోని రెండు జట్లతో ఆడిన అనంతరం టాప్–2 టీమ్‌లు ముందంజ వేస్తాయి. అక్కడ మిగిలిన మూడు టీమ్‌లతో తలపడాల్సి ఉంటుంది. టాప్–2 జట్లు ఫైనల్‌కు చేరతాయి. ఐదు టీమ్‌లు నేరుగా టోర్నీలో అడుగు పెట్టగా, క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా హాంకాంగ్ అర్హత సాధించింది. దుబాయ్, షార్జాలలో మ్యాచ్‌లు జరుగుతాయి. సెప్టెంబర్ 11న ఫైనల్ నిర్వహిస్తారు. టోర్నీ చరిత్ర: ఆసియా కప్‌ను ఇప్పటి వరకు 14 సార్లు నిర్వహించారు. 1984–2018 మధ్య ఈ టోర్నమెంట్లు జరిగాయి. అత్యధికంగా 7 సార్లు భారత్ విజేతగా నిలవగా, శ్రీలంక 5 సార్లు టోర్నీ గెలిచింది. పాకిస్తాన్ 2 సార్లు ట్రోఫీని అందుకుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా భారత్ బరిలోకి దిగుతోంది. 2018లో వన్డే ఫార్మాట్లో జరిగిన టోర్నీలో రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీమిండియా టైటిల్ సాధించింది. 2016లో కూడా ప్రపంచకప్‌కు కొద్ది రోజుల ముందు ఈ టోర్నీని టి20 ఫార్మాట్లోనే నిర్వహించారు. చదవండి: IND vs PAK Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్.. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రోహిత్ డుమ్మా; కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే.. -
ఆసియా కప్ టి20 టోర్నీ రద్దు
కొలంబో: శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీ రద్దయింది. కరోనా నేపథ్యంలో టోర్నీని నిర్వహించే స్థితిలో తాము లేమని శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈఓ యాష్లే డి సిల్వా ప్రకటించారు. వాస్తవానికి ఈ టోర్నీ గత ఏడాది పాకిస్తాన్లో జరగాల్సింది. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్లో భారత్ పర్యటించే అవకాశం లేకపోవడంతో టోర్నీ వేదికను పాక్ నుంచి శ్రీలంకకు మార్చారు. ఈ టోర్నీలో పాల్గొనాల్సిన అన్ని జట్లు అంతర్జాతీయ క్రికెట్లో రెండేళ్లపాటు బిజీగా ఉండటంతో ఆసియా కప్ 2023 వన్డే వరల్డ్‌కప్ తర్వాత జరిగే అవకాశముంది. ఆసియా కప్‌ను 2016 నుంచి రొటేషన్ పద్ధతిలో వన్డే, టి20 ఫార్మాట్లలో నిర్వహిస్తున్నారు. -
పాకిస్తాన్ గాడిలో పడేనా..!
మిర్పూర్: ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌లో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో పాకిస్తాన్ తలపడుతుంది. తమ తొలి మ్యాచ్‌లో ఘోరమైన బ్యాటింగ్‌తో భారత్ చేతి లో చిత్తయిన పాక్ తొలి విజయంపై దృష్టి పెట్టింది. తుది జట్టులో ఖుర్రం స్థానంలో ఇమాద్‌కు చోటు దక్కవచ్చు. మరోవైపు యూఏఈ బౌలింగ్‌లో ఆకట్టుకున్నా... బ్యాటింగ్ వైఫల్యంతో ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. గతంలో పాక్, యూఏఈ మధ్య మూడు వన్డేలు జరిగినా... టి20 మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనుండటం ఇదే తొలిసారి. మరోసారి పిచ్ ఆరంభంలో పేస్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం