
న్యూఢిల్లీ: ఆసియా కప్ టోర్నమెంట్‌కు సన్నాహాల్లో భాగంగా భారత పురుషుల హాకీ జట్టు ఈ నెలలో ఆ్రస్టేలియాలో పర్యటించనుంది. ఆగస్టు 15 నుంచి 21 వరకు జరిగే ఈ పర్యటనలో టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును సోమవారం ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యం వహిస్తాడు. కర్ణాటకకు చెందిన డిఫెండర్ సీబీ పూవణ్ణ తొలిసారి జాతీయ సీనియర్ జట్టులోకి ఎంపికయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో భారత జట్టుకు శిక్షణ శిబిరం జరుగుతోంది. ఈ పర్యటన కోసం భారత జట్టు శుక్రవారం బెంగళూరు నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది.
భారత పురుషుల హాకీ జట్టు: కృషన్ పాఠక్, సూరజ్ (గోల్‌కీపర్లు), సుమిత్, జర్మన్‌ప్రీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ (కెపె్టన్), సంజయ్, అమిత్ రోహిదాస్, నీలం సంజీప్, జుగ్‌రాజ్ సింగ్, పూవణ్ణ (డిఫెండర్లు), రాజిందర్ సింగ్, రాజ్‌కుమార్ పాల్, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, రబిచంద్ర సింగ్, విష్ణుకాంత్ సింగ్ (మిడ్‌ఫీల్డర్లు), మన్‌దీప్ సింగ్, శిలానంద్ లాక్రా, అభిõÙక్, సుఖ్‌జీత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, సెల్వం కార్తీ, ఆదిత్య లలాగే (ఫార్వర్డ్స్).