ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌లో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో పాకిస్తాన్ ....
మిర్పూర్: ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌లో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో పాకిస్తాన్ తలపడుతుంది. తమ తొలి మ్యాచ్‌లో ఘోరమైన బ్యాటింగ్‌తో భారత్ చేతి లో చిత్తయిన పాక్ తొలి విజయంపై దృష్టి పెట్టింది. తుది జట్టులో ఖుర్రం స్థానంలో ఇమాద్‌కు చోటు దక్కవచ్చు. మరోవైపు యూఏఈ బౌలింగ్‌లో ఆకట్టుకున్నా... బ్యాటింగ్ వైఫల్యంతో ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. గతంలో పాక్, యూఏఈ మధ్య మూడు వన్డేలు జరిగినా... టి20 మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనుండటం ఇదే తొలిసారి. మరోసారి పిచ్ ఆరంభంలో పేస్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది.
రాత్రి 7 గంటల నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో
ప్రత్యక్ష ప్రసారం