breaking news
appraisals
-
ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన టీసీఎస్
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కొంత మంది ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) నిబంధనలను గత త్రైమాసికాల్లో పాటించని వారికి వార్షికోత్సవ ఆధారిత పనితీరు శాలరీ అప్రైజల్స్‌ను నిలిపివేసినట్లు సమాచారం.దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టీసీఎస్‌లో, ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన అనంతరం వార్షిక సైకిల్ ప్రకారం అప్రైజల్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హత కలిగిన ఫ్రెషర్లకు ఈమెయిల్ ద్వారా సమాచారం పంపిస్తారు. అలాగే సంస్థ అంతర్గత పోర్టల్ ‘అల్టిమాటిక్స్’లోనూ ఈ అప్డేట్ కనిపిస్తుంది.ఈమెయిల్లో ఏం చెప్పిందంటే..“మీ వార్షికోత్సవ అప్రైజల్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, Q2 FY26 (జూలై 2025 – సెప్టెంబర్ 2025) వరకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాటించకపోవడంతో కార్పొరేట్ స్థాయిలో తదుపరి ప్రాసెసింగ్ జరగలేదు. జనవరి 2025లో మీ వార్షికోత్సవం ఉన్నప్పటికీ Q3లోనూ WFO పాటించకపోతే, మీరు FY26 బ్యాండింగ్ సైకిల్‌కు అనర్హులవుతారు. పనితీరు బ్యాండ్ విడుదల చేయబడదు” అని ఓ ఉద్యోగికి పంపిన ఈమెయిల్లో టీసీఎస్ యాజమాన్యం పేర్కొందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకించింది.ప్రస్తుతం టీసీఎస్ ఉద్యోగులు వారానికి ఐదు రోజులు కార్యాలయం నుంచే పని చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న తొలి ప్రధాన భారతీయ ఐటీ సంస్థగా టీసీఎస్ నిలిచింది. ఇతర ఐటీ సంస్థలు సాధారణంగా వారానికి రెండు నుంచి మూడు రోజులు మాత్రమే కార్యాలయ హాజరును తప్పనిసరి చేస్తుండగా, టీసీఎస్ ఆఫీస్ హాజరును వేరియబుల్ పే, అప్రైజల్స్‌తో అనుసంధానించింది.టీసీఎస్‌లో వార్షికోత్సవ అప్రైజల్ ప్రక్రియ ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. మొదట కంపెనీ లాంఛనంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తుంది. అనంతరం సూపర్వైజర్ ఉద్యోగి గోల్ షీట్‌ను సిద్ధం చేస్తారు. సదరు ఉద్యోగి దానిని సమీక్షించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్రైజర్‌తో చర్చలు జరుగుతాయి. సంవత్సరంలో సాధించిన లక్ష్యాల ఆధారంగా పనితీరు మూల్యాంకనం నిర్వహించి, తుది బ్యాండింగ్ ఫలితాలను విడుదల చేస్తారు.కాగా 2022లో లేటరల్ నియామకాల (లాటరల్ హైర్స్) కోసం టీసీఎస్ చివరి వార్షికోత్సవ అప్రైజల్స్‌ను నిలిపివేసింది. ఇక గతేడాది టీసీఎస్ తన వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మినహాయింపు విధానంలో మార్పులు చేసింది. భారతదేశంలోని ఉద్యోగులు ప్రతి త్రైమాసికంలో వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల కోసం గరిష్టంగా ఆరు రోజుల వరకు మినహాయింపులు పొందవచ్చు. ఉపయోగించని రోజులను తదుపరి త్రైమాసికానికి మళ్లించుకునే అవకాశం లేదు.ఇది చదివారా? ఐటీ ఉద్యోగులకు మరో కఠిన నిబంధన!కార్యాలయ స్థల పరిమితులను దృష్టిలో ఉంచుకుని, ఉద్యోగులు ఒకే ఎంట్రీలో గరిష్టంగా 30 మినహాయింపు అభ్యర్థనలను సమర్పించవచ్చు. నెట్వర్క్ సంబంధిత సమస్యలను ఒకేసారి ఐదు ఎంట్రీల వరకు మాత్రమే నివేదించవచ్చు. అయితే హాజరు మినహాయింపుల కోసం బల్క్ అప్లోడ్లు లేదా బ్యాకెండ్ ద్వారా సబ్మిట్ చేయడాన్ని కంపెనీ నిషేధించింది. -
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. చిగురించిన ఆశలు
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తమ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. 2026 సంవత్సరం వేతన పెంపు కోసం ఉద్యోగుతల వార్షిక పనితీరు మూల్యాంకన చక్రాన్ని (annual performance review cycle) ప్రారంభించింది. దీంతో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జీతాల పెంపుపై (salary hike) ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అక్టోబర్ 17లోగా స్వీయ అంచనాలను సమర్పించాల్సిందిగా కంపెనీ సిబ్బందిని కోరింది.గత రెండు సంవత్సరాలుగా ఇంక్రిమెంట్లు ఆలస్యం కావడం, తక్కువ శాతం జీతాల పెరుగుదల కారణంగా ఇన్ఫోసిస్ ఉద్యోగులు నిరుత్సాహంలో ఉన్నారు. "ఇది సాధారణ ప్రక్రియే అయినా, ఈసారి మాకు మంచి పెంపు వస్తుందని ఆశిస్తున్నాం" అని ఒక ఉద్యోగి చెప్పినట్లు ఎకనమిక్ టైమ్స్ కథనం పేర్కొంది.ఎప్పుడూ ఆలస్యమే..ఇన్ఫోసిస్ సాధారణంగా అక్టోబర్-సెప్టెంబర్ మధ్య సమీక్షలు నిర్వహించి, జనవరిలో రేటింగ్స్, జూన్‌లో జీతాల సవరణలను విడుదల చేస్తుంది. కానీ గత కొన్ని సంవత్సరాలలో ఈ ప్రక్రియ తరచూ ఆలస్యం అవుతూ వస్తోంది.2024 ఆర్థిక సంవత్సరంలో జూనియర్ లెవల్ 5 (JL5) స్థాయిలో ఉన్న ఉద్యోగులు జనవరిలో వేతన పెంపు పొందగా, జేఎల్ 6, అంతకంటే పై స్థాయి ఉద్యుగులు 2025 ప్రిల్ వరకు వేచి చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ, పెంపు శాతం మునుపటి సంవత్సరంతో పోలిస్తే 5-10% తక్కువగానే ఉంది.స్వీయ మదింపు, భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టిప్రస్తుతం, ఉద్యోగులు తమ 2025 ఆర్థిక సంవత్సరం ప్రదర్శన, కష్టాలు, విజయాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించాల్సి ఉంటుంది.ఈ ప్రక్రియలో భాగంగా..* గత సంవత్సరం ముఖ్య భూమికలు వివరించాలి* అభివృద్ధి చెందాల్సిన నైపుణ్యాలను హైలైట్ చేయాలి* భవిష్యత్తు పాత్రలపై ఆకాంక్షలను పేర్కొనాలిరేటింగ్స్ ఆధారంగా "అంచనాలను అందుకున్నారు", "ప్రశంసనీయం", "అత్యుత్తమం" ఇలా వర్గీకరణలు ఇస్తారు. ఇవే జీతాల పెంపుపై ప్రభావం చూపుతాయి.టీసీఎస్ కూడా..ఇన్ఫోసిస్ మాత్రమే కాదు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా తన పనితీరు మూల్యాంకనాన్ని ప్రారంభించింది. సీ3ఏ స్థాయి ఉద్యోగులకు 2025 సెప్టెంబర్ నుండి అమల్లోకి వచ్చే విధంగా పెంపులను ప్రకటించింది. అగ్రశ్రేణి పనితీరుకు రెండంకెల వృద్ధి లభించినట్లు సమాచారం.క్యూ2 ఫలితాలు కీలకంఇన్ఫోసిస్ అక్టోబర్ 16న తన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదల చేయనుంది. విశ్లేషకుల ప్రకారం, కంపెనీ ఆర్థిక స్థితి ఆధారంగా జీతాల పెంపు ఎలాంటి పరిమాణంలో ఉండబోతోందో స్పష్టత వస్తుంది. ఈసారైనా మంచి స్థాయిలో జీతాలు పెంపు ఉంటుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ గుడ్‌న్యూస్.. ఈసారి ఎక్కువ బోనస్! -
రాష్ట్రానికి ప్రధాని మోదీ ప్రశంస
పర్యావరణ అనుమతులకోసం ప్రయత్నాలను మెచ్చుకున్న ప్రధాని సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, ఇతర ప్రాజెక్టుల కోసం పర్యావరణ అనుమతులను పొందడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నెలనెలా నిర్వహించే ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రధాని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు దీనికి హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల్లోనూ వీలైనంత త్వరగా భూముల రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేయాలని, భూముల రికార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని ప్రధాని సూచించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను సమర్థంగా అమలు చేసేందుకు ఇది అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పౌర సేవలను అందించేందుకు ఆన్లైన్ వినియోగంపై ఈ సందర్భంగా ప్రధాని ఆరా తీశారు. జిల్లా స్థాయి వరకు ఎన్ని సేవలు ప్రజలకు అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రజా విజ్ఞప్తులను వీలైనంత వేగంగా పరిష్కరించాలని, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు. అరవై రోజుల వ్యవధిలోనే ఫిర్యాదులు, విజ్ఞప్తులను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించారు.


