breaking news
Anantha movie
-
నేరుగా ఓటీటీలో విడుదలైన అనంత.. ఎక్కడంటే?
భక్తిరస కథాచిత్రాలు అరుదుగా ఉంటాయి. ఈ మధ్య విడుదలైన యానిమేషన్ మూవీ 'మహావతార్ నరసింహ' దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా అనంత అనే భక్తిరస కథాచిత్రం సంక్రాంతి సందర్భంగా మంగళవారం నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇది పుట్టపర్తి సాయిబాబా దైవలీలల గురించి చెప్పే సినిమా.అనంత సినిమాఇంతకుముందు బాషా, అన్నామలై వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన సురేశ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను గిరీశ్ కృష్ణమూర్తి నిర్మించారు. జగపతిబాబు, సుహాసిని, వైజీ.మహేంద్రన్, నిగల్‌గళ్ రవి, తలైవాసల్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దేవా సంగీతాన్ని, గీత రచయిత స్నేషన్ మాటలు, పాటలు అందించారు.జీవిత చరిత్ర కాదుఇది సాయిబాబా జీవిత చరిత్ర కాదని, ఆయన మహిమలతో కూడిన భక్తిరస కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. పూర్తి విశ్వాసంతో బాబాను నమ్మితే ఫలితాలెలా ఉంటాయన్నది చెప్పే సినిమాయే అనంత అన్నారు. ఇందులో అందరూ అద్భుతంగా నటించారన్నారు. దేవా సంగీతం సినిమాకు పెద్ద బలం అని తెలిపారు.ఓటీటీలో నేరుగా రిలీజ్సినిమా చూసిన పలువురు ప్రముఖులు థియేటర్లలో విడుదల చేయమని కోరారన్నారు. అయితే ఓటీటీ సంస్థ కమిట్ అవడంతో హాట్‌స్టార్‌కు స్ట్రీమింగ్ హక్కులు ఇచ్చామన్నారు. ఈ సినిమా మంగళవారం అంటే జనవరి 13 నుంచి ఓటీటీలో ప్రసారం అవుతోందని, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోందని దర్శకుడు పేర్కొన్నారు.చదవండి: రజనీకాంత్ కోసమే జైలర్ 2లో నటించా: విజయ్ సేతుపతి -
‘అనంత’మూవీ రివ్యూ
టైటిల్: అనంత నటీనటులు: ప్రశాంత్ కార్తీ, రిత్తిక చక్రవర్తి, అనీష్ కురువెళ్ళ, గెడ్డం శ్రీనివాస్, లయ సింప్సన్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రినేత్ర క్రియేషన్స్ నిర్మాత : ప్రశాంత్ కార్తీ దర్శకత్వం: మదు బాబు తోకల సంగీతం: ఘంటశాల విశ్వనాథ్ విడుదల తేది: జూన్ 9, 2023 ‘అనంత’ కథేంటంటే.. రదేశ్(ప్రశాంత్ కార్తి) ఒక ప్రొఫెసర్. ప్రతి పదేళ్లకు ఒక్కసారి అతను పని చేసే యూనివర్సీటీ నుంచి వెళ్లిపోతుంటాడు. అలా ప్రస్తుతం అతను పని చేసే యూనివర్సీటీ నుంచి వెళ్తున్న క్రమంలో అతనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన సైటిస్టులు ప్రద్యుమ్న( అనీష్ కురువెళ్ళ), ధర్మా(గెడ్డం శ్రీనివాస్), శృతీ(రిత్తిక చక్రవర్తి) తదితరులు రదేశ్ ఇంటికి వస్తారు. అసలు ఈ యూనివర్సీటీ నుంచి ఎందుకు వెళ్తున్నావని రదేశ్ని ప్రశ్నించడంలో అసలు కథ ప్రారంభం అవుతుంది. రదేశ్ 15 వేల సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి. అతనికి మరణం ఉండడు.. వయసు పెరగదు. అతని వయసు గుర్తించేలోపు ఆ ప్రదేశం నుంచి వెళ్లి పోతుంటాడు.ఇదంతా ఆ సైంటిస్టులకు వివరిస్తాడు రదేశ్. అసలు రదేశ్ ఎవరు? నిజంగానే అతను 15 వేల సంవత్సరాల క్రితం పుట్టాడా? ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ప్రద్యుమ్నకు రదేశ్ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే అనంత సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మనిషి ఆయుష్షు నేపథ్యంలో సాగే కథ ఇది. డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని గతంలో ఎప్పుడు చూడని కోణంలో కథను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ మధుబాల. ఈ విషయంలో దర్శకుడు కాస్త సఫలం అయ్యాడు. మరణం లేని పాత్ర అనేది మనం పురాణాల నేపథ్యంలో తెరకెక్కే సినిమాల్లోనే చూశాం. కానీ ఇక్కడ ఒక సాధారణ కథలో అలాంటి పాత్ర పరిచయం చేయడం ఇదే తొలిసారి. స్టార్ ట్రెక్ రచయిత జెరోం బిక్స్బీ రాసిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రొఫెసర్‌కి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన అతని సహచరులు తెలుసుకున్న కొన్నిఆసక్తి కర విషయాలు ప్రేక్షకులను ఆకట్టు కుంటాయి. అయితే వాటిని మాటల్లో కాకుండా విజువల్స్‌గా తెరపై చూపించి ఉంటే మరింత ఆసక్తికరంగా ఉండేవి. ఫస్టాఫ్ మొత్తం సైంటిస్టులు ప్రశ్నలు అడగడం.. ప్రొఫెసర్ జవాబు చెప్పడం ఇలానే సాగుతుంది. ఈ క్రమంలో చరిత్ర గురించి హీరో చెప్పే కొన్ని విషయాలు ప్రేక్షకులకు జ్ఞానాన్ని అందిస్తాయి. ఆసక్తి రేపే కొన్ని అంశాలతో సెకండాఫ్ సాగుతుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఎవరెలా చేశారంటే.. గతంలో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన కొండా చిత్రంలో నక్సలైట్ నాయకుడు ఆర్కే రోల్ పోషించి ఆకట్టుకున్న ప్రశాంత్ కార్తీ ఈ సినిమాతో మరో డిఫరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రొఫెసర్ రదేశ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు.డాక్టర్ ప్రద్యుమ్న పాత్ర లో అనీష్ కురువెళ్ళ, ధర్మా గా గెడ్డం శ్రీనివాస్ లు తమ సహజ నటనతో ప్రేక్షకులను అలరించారు. శృతిగా రిత్తిక చక్రవర్తి తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఘంటశాల విశ్వనాథ్ సంగీతం ఈ సినిమాకు ప్లస్. మంచి నేపథ్య సంగీతాన్ని అందించారు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సిద్దు సొంసెట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.


