amount recovered
-
2017లో రూ.10 వేలు పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు రూ. 3.28 లక్షలొచ్చాయి
సూరత్: ఏటీఎంలో విత్‌డ్రా చేసినప్పుడు కొన్నిసార్లు డబ్బులు రావు. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వస్తుంది. కానీ మన అకౌంట్లో అమౌంట్ కట్ అవుతుంది. అలాంటప్పుడు ఐదారు రోజుల్లో రీఫండ్ అవుతుందని బ్యాంకులు చెబుతాయి. రీఫండ్ అవుతాయి కూడా. కానీ గుజరాత్‌కు చెందిన ఈ వ్యక్తి అకౌంట్లోకి అమౌంట్ రీఫండ్ రాలేదు. బ్యాంకుల చుట్టూ తిరిగి, చివరకు న్యాయ పోరాటానికి దిగాడు. తొమ్మిదేళ్ల తరువాత.. అతడు కోల్పోయిన రూ.10వేలకుగాను రూ.3.28 లక్షలు వసూలు చేశాడు. వివరాల్లోకి వెళ్తే సూరత్‌కు చెందిన ఓ వ్యక్తి 2017, ఫ్రిబవరి 18న సూరత్‌లోని ఉద్నా ప్రాంతంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎమ్‌కు వెళ్లాడు. రూ.10 వేలు విత్‌డ్రా చేసేందుకు ప్రయతి్నంచాడు. నగదు రాలేదు.. కానీ కాసేపటికి డబ్బులు కట్ అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచి్చంది. అదే నెల 21న దుంభాల్ ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సమస్యను పరిష్కరించాలని బ్యాంకుకు మెయిల్స్ కూడా పెట్టాడు. చివరకు ఆర్బీఐని ఆశ్రయించాడు. ఏటీఎమ్ సెంటర్లోని సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా పరిశీలించాలని కోరాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో 2017 డిసెంబర్ 20న వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు. ఆ ఏటీఎమ్ ఎస్బీఐకి చెందినదని బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) వాదించింది. ఆ బ్యాంకుదే బాధ్యతని కోర్టుకు తెలిపింది. వినియోగదారుల ఫోరమ్ బీఓబీ వాదనను తోసిపుచి్చంది. లావాదేవీకి సంబంధించి బ్యాంకు ఆధారాలను చూపించాలని పేర్కొంది. అంతేకాదు, ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఆ మొత్తాన్ని ఐదు రోజుల్లోగా రీఫండ్ చేయాల్సి ఉండగా.. బీఓబీ చేయలేదని ఫోరమ్ గుర్తించింది. బ్యాంక్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి.. రూ.10వేలపై 9శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. చెల్లింపు ఆలస్యమైనందుకుగానూ.. రోజుకు రూ.100 చొప్పున ఫైన్ వేసింది. డబ్బు పోగొట్టుకుని అతడు పడ్డ మానసిక వేదనకు రూ.3,000, న్యాయపరమైన ఖర్చుల కోసం మరో రూ.2,000.. ఈ పరిహారం మొత్తం రూ. 3,28,800గా నిర్ణయించింది. వినియోగదారునికి చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. -
‘ఏటీఎం’ మోసగాడి అరెస్ట్
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లాలో ఏటీఎంలకు వచ్చే వారిని ఏమార్చి, కార్డులను తారుమారు చేసి వారి డబ్బులను కాజేస్తున్న ఓ మోసగాడిని శనివారం అరెస్టు చేసినట్లు మంచిర్యాల పట్టణ సీఐ ఎడ్ల మహేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం పట్టణంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో చెరకు రసం వ్యాపారి సింద కృష్ణ ఈనెల 12న ఐబీ చౌరస్తాలోని ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. కానీ, డబ్బులు రాకపోవడంతో కృష్ణ వెనుదిరుగుతుండగా వెనకాలే ఉన్న ఓ వ్యక్తి తాను డ్రా చేసి ఇస్తానంటూ కృష్ణ ఏటీఎం తీసుకున్నాడు. ఇతను కూడా డబ్బులు రావడం లేదని చెప్పి కృష్ణకు ఏటీఎం వాపసిచ్చాడు. కానీ, ఆ వ్యక్తి కృష్ణకు అసలు ఏటీఎం కాకుండా, తన వద్ద ఉన్న మరో నకిలీ ఏటీఎంను ఇచ్చాడు. ఏటీఎం దగ్గరి నుంచి కృష్ణ వెళ్లిపోగానే, ఆ వ్యక్తి తన దగ్గరున్న కృష్ణ అసలు ఏటీఎం కార్డు ద్వారా రూ.14,500లను డ్రా చేసుకుని ఉడాయించాడు. తన సెల్‌కు మెసేజ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించిన కృష్ణ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా డబ్బులు కాజేసిన వ్యక్తిని బెల్లంపల్లి ఓసీపీ–కేకే–2లో నివాసముండే ఉంటున్న గంధం మహేందర్‌గా పోలీసులు గుర్తించారు. మోసపోయిన కృష్ణకు నిందితుడు ఇచ్చిన ఏటీఎం కార్డు వివరాల ఆధారంగా విచారించి, శనివారం బస్టాండ్ దగ్గర నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు మహేందర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివరించారు. ఇతని నుంచి రూ.14,500 నగదుతోపాటు, మరో 3 డమ్మీ ఏటీఎం కార్డులను స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై మారుతితోపాటు సిబ్బంది జైచందర్, సత్యం పాల్గొన్నారు. -
ఆకస్మిక దాడులు.. 6.5 కోట్ల నగదు పట్టివేత
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీగా హవాలా సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో డీఆర్ఐ అధికారులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించి పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు వారి వద్ద నుంచి రూ.6.5 కోట్ల నగదుతో పాటు 21 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు.. హవాలా నిర్వహించి మోసాలకు పాల్పడుతున్న స్థావరాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు ఓ అధికారి తెలిపారు. హవాలా గ్యాంగులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.


