breaking news
amar jawans
-
తొలి సంతకం చేసిన నరేంద్ర మోదీ
-
తొలి ఫైల్‌పై సంతకం చేసిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: నూతన ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజే కేంద్ర మంత్రిమండలి భేటీ అయ్యి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమైన పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలి సంతకం చేశారు. కొత్త ప్రభుత్వంలో తొలి మంత్రిమండలి సమావేశం కావడంతో భేటీపై మొదటి నుంచి ఉత్కంఠ నెలకొంది. దానికి అనుగుణంగానే కొన్ని కీలక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుంది. దేశ రక్షణ నిధి నుంచి అమరులైన సైనికుల పిల్లలకు ఇచ్చే ఉపకారవేతనాలను పెంచుతూ.. నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు రెండువేల నుంచి 2500కు, విద్యార్థినులకు 2250 నుంచి 3వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర పారామిలటరీ బలగాలతో పాటు, రాష్ట్రంలో అమలు అయ్యే పోలీసు కుటుంబాలకు కూడా ఈపథకాన్ని వర్తించే విధంగా రూపకల్పన చేశారు. ఏడాదికి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన వారి నుంచి ఇకపై ఎంపిక చేయనున్నారు. మొదటి సమావేశంలోనే బడ్జెట్ ప్రధాని కార్యాలయంలో మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో హోంమంత్రి అమిత్‌షా సహా 24మంది కేబినెట్ మంత్రులు, 9మంది స్వతంత్ర హోదా కల్గిన మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. నూతన ప్రభుత్వంలో జూన్ 17 నుంచి జూలై 26 వరకు పార్లమెంట్ తొలి సమావేశాలు నిర్వహించాలని కేంద్రమంత్రి మండలి నిర్ణయించింది. జూన్ 19న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక చేపట్టనున్నారు. మొదటి సమావేశంలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భేటీలో నిర్ణయించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : తొలి సంతకం చేసిన నరేంద్ర మోదీ ప్రధాని మోదీతో సహా.. కేంద్ర మంత్రులుగా పలువురు గురువారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వారందరికీ శుక్రవారం శాఖలను కేటాయించారు. మంత్రులు ఆయా శాఖల బాధ్యతలను చేపట్టిన మరుక్షణమే ప్రధాని మోదీ అధ్యక్షత కేంద్ర మంత్రిమండలి సమావేశమయింది. దేశాన్ని ఏవిధంగా అభివృద్ధి పథంలో నడిపించాలి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశానికి ముందు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులనందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. -
అమర జవాన్లకు సెల్యూట్
న్యూఢిల్లీ/లక్నో/జైపూర్: ఉద్వేగం ఉప్పొంగింది. భావోద్వేగాలు పెల్లుబికాయి. మాతృ దేశ సేవలో నేలకొరిగిన అమర జవాన్లకు తుది వీడ్కోలు పలికేందుకు దేశమంతా కదిలొచ్చింది. మేమున్నామంటూ బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచింది. పుల్వామా దాడిలో అసువులు బాసిన ధీశాలుల అంత్యక్రియలు శనివారం దేశవ్యాప్తంగా వారివారి స్వస్థలాల్లో అధికార లాంఛనాలతో జరిగాయి. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన తమ వారి పట్ల గర్వం ఓ వైపు, తమలో ఒకరు ఇక లేరని వేదన మరోవైపు. ఇలా ఒక్కో కుటుంబానిది ఒక్కో కథ..ఒక్కో వ్యథ. ఇంతటి విషాద సమయంలో జాతి అంతా ఒక్కటై ముష్కరుల కుట్రకు బలైన భరతమాత ముద్దు బిడ్డల సేవలను శ్లాఘిస్తూ ఘనంగా నివాళులర్పించింది. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించింది. చాలా ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాల్ని మూసేశారు. తమ గ్రామానికి చేరుకున్న అమర జవాన్ల భౌతికకాయాల్ని కడసారి చూసేందుకు ప్రజలు వీధుల్లో రోడ్లకు ఇరు వైపులా నిలబడ్డారు. పలువురు కేంద్ర మంత్రులు ఢిల్లీ నుంచి తమ స్వరాష్ట్రాలకు వెళ్లి అక్కడి మంత్రులతో కలసి వీర జవాన్ల అంతిమ యాత్రలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం కప్పిన జవాన్ల భౌతిక కాయాలను ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలకు సమీపంలోని విమానాశ్రయాలకు తరలించి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వారివారి స్వగ్రామాలకు తీసుకెళ్లారు. ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామంలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి చితికి నిప్పంటించగా, రాజస్తాన్‌లో రెండు నెలల పసిగుడ్డుతో తండ్రి అంత్యక్రియలు నిర్వహించడం కంటతడిపెట్టించింది. రాజస్తాన్‌లో... రోషితాష్ లాంబా(జైపూర్), నారాయణ్‌లాల్ గుర్జార్(రాజసమంద్), జీత్‌రామ్(భరత్పూర్), భగీరథ్‌సింగ్(ధోల్పూర్), హేమరాజ్ మీనా(కోట)ల అంతిమయాత్రలో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ‘పాకిస్తాన్ ముర్దాబాద్’, ‘భారత్ మాతాకీ జై’నినాదాలు మిన్నంటాయి. ఉత్తరాఖండ్‌లో.. ఉద్ధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని మహ్మద్‌పూర్ గ్రామంలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి వీరేంద్రసింగ్ చితికి నిప్పు పెట్టిన దృశ్యం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ సహచరుడికి మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. ఇక డెహ్రాడూన్‌లో జరిగిన మోహన్‌లాల్ అంత్యక్రియలకు అశేష జనం హాజరయ్యారు. పంజాబ్‌లో.. మోగా జిల్లాలోని గలౌటీ కుర్ద్ గ్రామంలో అమర జవాను జైమల్ సింగ్ మృతదేహానికి ఐదేళ్ల ఆయన కొడుకు గురుప్రకాశ్ నిప్పు అంటించాడు. గురుదాస్‌పూర్‌లో మణిందర్ సింగ్ భౌతికకాయానికి ఆయన తమ్ముడు, సీఆర్పీఎఫ్ జవాన్ అయిన లక్వీర్ సింగ్ దహన సంస్కారాలు నిర్వహించాడు. ఇక రూప్‌నగర్‌లో 26 ఏళ్ల కుల్వీందర్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజలు పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుల్వీందర్ సింగ్ భౌతికకాయాన్ని చూసి ఆయనకు కాబోయే భార్య సొమ్మసిల్లిపడిపోవడం అక్కడున్న వారిని కలచివేసింది. ఒడిశాలో.. పుల్వామా దాడిలో మరణించిన తమ రాష్ట్రానికి చెందిన అమర జవాన్లకు విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. జగత్సింగ్పూర్ జిల్లాకు చెందిన ప్రసన్నకుమార్ సాహూ, కటక్‌కు చెందిన మనోజ్కుమార్ల భౌతికకాయాలను స్వీకరించేందుకు భువనేశ్వర్ విమానాశ్రయానికి వేలాది మంది తరలివచ్చారు. మహారాష్ట్రలో.. అమర జవాన్లు నితిన్ శివాజీ రాథోడ్(36), సంజయ్ సింగ్ దీక్షిత్(47)ల భౌతికకాయాలను శనివారం ఔరంగాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వగ్రామాలకు పంపించారు. తమిళనాడులో.. అమర జవాన్లు జి.సుబ్రమణ్యం, సి.శివచంద్రన్ భౌతికకాయాలకు తిరుచిరాపల్లి విమానాశ్రయంలో నిర్మలా సీతారామన్ నివాళులర్పించారు. కర్ణాటకలో.. ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న అమర జవాన్ 33 ఏళ్ల హెచ్. గురు భౌతికకాయానికి ముఖ్యమంత్రి కుమారస్వామి నివాళులర్పించారు. ఉత్తరప్రదేశ్‌లో.. కానౌజ్ జిల్లాలో అమర జవాన్ ప్రదీప్ సింగ్ యాదవ్ అంత్యక్రియల సందర్భంగా ఆయన పదేళ్ల కూతురు సుప్రియ సొమ్మసిల్లింది. ఆయన రెండో కూతురు రెండున్నరేళ్ల చిన్నారిది అక్కడేం జరుగుతోందో అర్థం చేసుకోలేని పరిస్థితి. రాష్ట్రంలోని మహరాజ్‌గంజ్, ఆగ్రా, మేన్పురి, ఉన్నావ్, కాన్పూర్, దెహాట్, చందౌళి జిల్లాల్లోనూ అమర జవాన్ల అంత్యక్రియల్లో ఇలాంటి గంభీర వాతావరణమే కనిపించింది. మాతృదేశ సేవలో నేలకొరిగిన సైనికుల సాహసాలను కీర్తిస్తూ వేలాది మంది ప్రజలు నినాదాలు చేశారు. పుల్వామా దాడికి కారకులను శిక్షించాలని అంత్యక్రియలకు హాజరైన మంత్రులు, అధికారుల్ని డిమాండ్ చేశారు. దియోరియా జిల్లాలో.. సీఎం యోగి ఆదిత్యనాథ్ వస్తేనే తన భర్త విజయ్ మౌర్య అంత్యక్రియలకు అంగీకరిస్తానని ఆయన భార్య విజయ్ లక్ష్మి పట్టుపట్టారు. మంత్రి అనుపమా జైస్వాల్, ఇతర నాయకులు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చందౌళిలో అవధేశ్ యాదవ్ అంత్యక్రియలు గంగా నదీ తీరంలో నిర్వహించారు. మహరాజ్‌గంజ్‌లోని ఓ పాఠశాలకు అమర జవాను పంకజ్ త్రిపాఠి పేరు పెడతామని కేంద్ర మంత్రి శివప్రతాప్ శుక్లా ప్రకటించారు. తుదిహార్లో మహేశ్ యాదవ్ భౌతికకాయం వద్ద రోదిస్తున్న బంధువు.. కర్ణాటకలోని దొడ్డి గ్రామంలో విలపిస్తున్న హెచ్ గురు కుటుంబసభ్యులు ఆగ్రాలో కుశల్‌కుమార్ భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యుల రోదన.. కోల్‌కతాలో సుదీప్బిశ్వాస్ భౌతికకాయం వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు -
విద్యాసాయంపై పరిమితి వద్దు
న్యూఢిల్లీ: విధుల్లో వైకల్యం పొందిన, అమరులైన జవాన్ల పిల్లలకు ప్రతినెలా రూ.10,000 చొప్పున అందిస్తున్న విద్యా సాయంపై గరిష్ట పరిమితిని ఎత్తివేయాలని రక్షణ శాఖ ఆర్థికశాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ జవాన్ల పిల్లలకు అందిస్తున్న విద్యా సాయం రూ.10 వేలు దాటరాదని గతేడాది జూలై 1న కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ‘జవాన్ల పిల్లలకు అందిస్తున్న విద్యాసాయంపై గరిష్ట పరిమితిని ఎత్తివేయాలని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నాం’ అని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. విద్యాసాయంపై కేంద్రం గరిష్ట పరిమితిని విధించడంపై త్రివిధ దళాల్లో పెద్దఎత్తున అప్పట్లో అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో ఆర్మీ, నేవీ, వాయుసేనకు చెందిన చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ(సీవోఎస్‌ఈ) ఈ పరిమితిని ఎత్తివేయాలని రక్షణశాఖకు లేఖ రాసింది. 1972లో తీసుకొచ్చిన పథకం కింద ప్రస్తుతం స్కూళ్లు, కళాశాలలు, ఇతర వృత్తివిద్యా సంస్థల్లో చదువుకునే జవాన్ల పిల్లలకు విద్యను పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. -
అమర జవాన్లకు ఘన నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్మీ డే సందర్భంగా అమర జవాన్లకు సోమవారం త్రివిధ దళాధిపతులు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని అమర జవాన్ జ్యోతి వద్ద పుప్పగుచ్ఛాలు ఉంచి అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ సునీల్ లంబా, ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనావో తదితరులు అంజలి ఘటించారు. దేశరక్షణలో ప్రాణాలను కోల్పోయిన అమర వీరుల సేవలను స్మరణకు తెచ్చుకున్నారు. 1948 లో చిట్టచివరి బ్రిటిష్ కమాండర్ 'సర్ ఫ్రాన్సిస్ బచ్చర్' నుంచి భారతీయ సైన్యం తొలి కమాండర్-ఇన్-చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ కెఎం.కరియప్ప బాధ్యతలు స్వీకరించారు. అందుకు గుర్తుగా ప్రతి ఏడాది జనవరి 15న ‘ఆర్మీ డే’ నిర్వహిస్తారు. -
అమర జవాన్లకు ఘన నివాళి
తీవ్రవాదుల దాడిలో మరణించిన అమర జవాన్లకు నర్సరీ రైతులు తమ శైలిలో నివాళులర్పించారు. వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, స్థానిక పల్ల వెంకన్న నర్సరీలో వివిధ రకాల మొక్కలతో కూర్పు ఏర్పాటు చేశారు. దేశ రక్షణలో ఎల్లవేళలా పోరాడే సైనికుల సేవా నిరతి ప్రతిక్షణం మనం స్మరించుకోవాలని నర్సరీ రైతులు పల్ల సత్యనారాయణమూర్తి, పల్ల సుబ్రహ్మణ్యం, పల్లగణపతి, పల్ల వెంకటేష్ తెలిపారు. – కడియం