All India Radio program
-
ఆల్‘ఇంటి’యా రేడియో!
వన్స్ అ పాన్ ఏ టైమ్ రేడియో అంటే... ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కాదు. మన కుటుంబసభ్యురాలు! ΄÷ద్దుటే సుప్రభాతంతో నిద్ర లేపి, ప్రపంచంలో, దేశంలో ఏ మూలన ఏం జరుగుతుందో చెప్పి, బుర్ర హీటెక్కి పోకుండా చల్లని పాటలు వినిపించి... ఒక్కటా రెండా... రేడియో అంటే అంతులేని అపురూపమైన జ్ఞాపకాల సంపద....ఆకాశవాణి–రజనిమన ఆకాశవాణిని జనరంజకం చేసిన వారిలో బాలాంత్రపు రజనీకాంతరావు ఒకరు. ఆకాశవాణిలో స్వరకర్తగా, గీతరచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వహించారు. లలిత సంగీతాన్ని ఆకాశవాణి వేదికగా జనరంజకం చేశారు. 1947 ఆగస్ట్ 15 భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి, ప్రధాని నెహ్రూ ప్రసంగం తరువాత రజని రచించి, స్వర పరిచిన ‘మాదీ స్వతంత్రదేశం’ ప్రసారం అయింది.99%: ఆకాశవాణిగా ప్రసిద్ధమైన ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) ప్రపంచంలో అతి పెద్ద ప్రసార సంస్థలలో ఒకటి. 23 భాషలలో, 179 మాండలికాలలో మన దేశంలోని 99 శాతం మందికి చేరువైంది.ఆకాశవాణి – ఆధ్యాత్మికం – ఉషశ్రీరామాయణ, భారత, భాగవతాలను ఆకాశవాణి వేదికగా సామాన్యులకు చేరువ చేశారు ఉషశ్రీ. భగవద్గీత, సుందరకాండలను అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఆయన నిర్వహించిన ‘ధర్మసందేహాలు’ కార్యక్రమం చాలా జనాదరణ పొందింది. పౌరాణికాలకు సంబంధించి ఎంత జటిలమైన విషయాన్ని అయినా సులభంగా అర్థమయ్యేలా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి.1923: బాంబే రేడియో క్లబ్ కార్యక్రమాలతో 1923లో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. మొదటి న్యూస్ బులెటిన్ జనవరి 19, 1936లో ప్రసారం అయింది.ఆకాశవాణి–మహానటిమహానటి సావిత్రి సమర్పించిన జనరంజని ప్రత్యేక కార్యక్రమం 1979లో ఉగాది రోజున ప్రసారం అయింది.సిగ్నేచర్ ట్యూన్ శివరంజనిశివరంజని రాగం ఆధారంగా వాల్టర్ కౌప్మన్ ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్‌ను స్వరపరిచారు. వయోలిన్‌పై వాయించారు.జనం మెచ్చిన జనరంజనిశ్రోతలు కోరిన పాటల కార్యక్రమం ‘జనరంజని’ అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమాలలో ఒకటి. ఆదివారాలు, పండగ రోజుల్లో ప్రత్యేక జనరంజని కార్యక్రమాలు ప్రసారమయ్యేవి.బారిష్టర్ పార్వతీశం రాకతో రేడియో నవ్వింది!మొక్క పాటి ప్రసిద్ధ హాస్య నవల ‘బారిస్టర్ పార్వతీశం’ ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన నాటకాల్లో ఒకటి.రేడియోలో వేటూరి విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమైన వేటూరి సంగీత రూపకం ‘సిరికాకొలను చిన్నది’ అద్భుతమైన ఆడియో నాటిక. ఈ సంగీతక రూపకానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు.థీమ్ 2026ఈ సంవత్సరం ‘వరల్డ్ రేడియో డే’ థీమ్...‘రేడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఏఐ ఈజ్ ఏ టూల్, నాట్ ఏ వాయిస్’ -
CJI DY Chandrachud: జూనియర్లకు సరైన వేతనాలివ్వండి
న్యూఢిల్లీ: ‘‘న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి, నైపుణ్యాలు పెంచుకోవడానికి మీ వద్ద పనిచేసే యువతకు సరైన వేతనాలు, పారితోషికాలు చెల్లించడం మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి’’ అని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సూచించారు. న్యాయవాద వృత్తి చాలా సంక్లిష్టమైందని చెప్పారు. ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న నైపుణ్యాలే యువ న్యాయవాదులను ముందుకు నడిపిస్తాయని, అవి వారికి జీవితాంతం తోడ్పడుతాయని తెలిపారు. పునాది బలంగా ఉండాలని పేర్కొన్నారు. తాజాగా ఆలిండియా రేడియో ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ పలు విషయాలు వెల్లడించారు. ఈ వృత్తిలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు ఉంటాయని, ప్రారంభంలో వేతనాలు ఎక్కువగా ఉండకపోవచ్చని వెల్లడించారు. న్యాయవాద వృత్తిలోకి వచ్చేవారు కష్టపడి పనిచేయాలని, నిజాయతీగా ఉండాలని పేర్కొన్నారు. యువ లాయర్లను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. జూనియర్లకు సీనియర్ లాయర్లు గురువులుగా కొత్త విషయాలు నేరి్పస్తూనే సంతృప్తికరమైన వేతనాలు చెల్లించడం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. తాను కాలేజీలో చదువుకొనే రోజుల్లో ఆలిండియా రేడియోలో ప్రయోక్తగా పనిచేశానని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేసుకున్నారు. శాస్త్రీయ సంగీత కళాకారిణి అయిన తన తల్లి తనను ముంబైలోని ఆలిండియా రేడియో స్టూడియోకు తీసుకెళ్తూ ఉండేవారని చెప్పారు. 1975లో ఢిల్లీకి వచ్చాక ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లిష్ కార్యక్రమాలు నిర్వహించానని వివరించారు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి రేడియోలో హిందీ, ఇంగ్లి‹Ù, సంస్కృత కార్యక్రమాలు విన్నానని తెలిపారు. దేవకి నందన్ పాండే, పమేలా సింగ్, లోతికా రత్నం గొంతులకు తాను అభిమానినని చెప్పారు. -
‘రేడియో’కు ఉజ్వల భవిష్యత్
ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ నిహార కానేటి రేడియో ప్రసారాలపై గెస్ట్ లెక్చర్ తెయూ(డిచ్పల్లి) : ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ ఇప్పటికీ రేడియో మాధ్యమానికి ఉజ్వల భవిష్యత్ ఉందని ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ నిహార కానేటి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో ‘రేడియో ప్రోగ్రాం ప్రొడక్షన్’ అన్న అంశంపై ఆమె ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్నెట్ యుగంలోనూ అత్యంత ప్రజాదరణ పొందిన మాధ్యమంగా రేడియో మరింత ముందుకు పోతోందని పేర్కొన్నారు. రేడియోలో ప్రసారాల రూపకల్పన అత్యంత సవాల్‌తో కూడుకున్నదన్నారు. విద్యార్థులు రేడియోలో కెరీర్ ఎంచుకుని విజయం సాధించే అవకాశాలున్నాయన్నారు. బాలికలు తాము ఎంచుకున్న రంగంలో ఆత్మవిశ్వాసంతో వెళ్లాలన్నారు. పురుషాధిపత్యం ఉన్న సమాజంలో అడ్డంకులు, సవాళ్లకు ఎదురీదకుండా ముందుకు వెళ్లలేమని పేర్కొన్నారు. తను ఎఫ్ఎం రేడియో స్టేషన్లలో రేడియో జాకీగా, ఇంటర్నెట్ రేడియో ఖుషీ స్టేషన్లో ఆర్జేగా పని చేసిన రోజుల్లో ఎదుర్కొన్న సవాళ్లు, వృత్తిలో తాను రాణించిన విధానాన్ని ఆమె వివరించారు. మాస్ కమ్యూనికేషన్ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చి, వారిని ఉత్సాహపరిచారు. రేడియో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న నిహార కానేటితో గెస్ట్ లెక్చర్ ద్వారా విద్యార్థులకు రేడియో రంగంపై మంచి అవగాహన కలిగిందని వర్సిటీ మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి కె.రాజారాం పేర్కొన్నారు. అనంతరం నిహార కానేటిని సన్మానించారు. కార్యక్రమంలో బీవోస్ చైర్మన్ జి.చంద్రశేఖర్, అధ్యాపకులు ప్రభంజన్ యాదవ్, శాంతాబాయి, మోహన్, విద్యార్థులు పాల్గొన్నారు.


