breaking news
Ajay dev
-
అడ్డంగా ఇరుక్కున్నారుగా!! పచ్చ బొట్టు సాక్షిగా బయటపడ్డ పచ్చి నిజం
-
రెచ్చిపోదాం.. రచ్చ చేద్దాం
సాక్షి, పుట్టపర్తి: దాడి ఏదైనా.. గొడవ ఎక్కడ జరిగినా.. రాజకీయ రంగు పూసి ‘రెచ్చిపోదాం.. రచ్చ చేద్దాం’ తరహాలో కూటమి పార్టీల నాయకులు తయారయ్యారు. నిందితులకు వైఎస్సార్సీసీ ముద్ర వేసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణపై దాడి ఘటనే ఇందుకు నిదర్శనం. ఈ నెల 21వ తేదీన మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకల అనంతరం అజయ్‌దేవ్ అనే యువకుడు గర్భిణిపై దాడి చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ‘నిండు గర్భిణిని వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణంగా కొట్టాడు’ అంటూ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి అజయ్‌దేవ్ జనసేన పార్టీ కార్యకర్త. అతడిపై వైఎస్సార్సీపీ ముద్ర వేయడంతో పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని చితకబాదారు. నడవలేని స్థితిలోనూ రోడ్డు మీద ఊరేగిస్తూ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కానీ, గంటల వ్యవధిలోనే అజయ్ జనసేన కార్యకర్త అని తేలిపోయింది. అతడిని రిమాండ్‌కు పంపిన తర్వాత అసలువిషయం బయటకు వచ్చింది. అతడు జనసేనకు చెందినవాడని స్వయంగా అతని సోదరి రజిత, జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యుడు అమర్ కార్తికేయ వెల్లడించారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిగా చెప్పారు. తనకు పదేళ్ల నుంచి అజయ్ తెలుసని, ఎల్లో మీడియా అత్యుత్సాహంతో అతడిని వైఎస్సార్సీపీ కార్యకర్తగా చిత్రీకరించిందని అమర్ మండిపడ్డారు. పవన్‌కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో అతడు పాల్గొన్న ఫొటోలు విడుదల చేశారు. ‘‘పవన్‌కళ్యాణ్ అంటే అజయ్‌కు విపరీతమైన అభిమానం. ముందు నుంచి నా సోదరుడు జనసేనలోనే కొనసాగుతున్నాడు. అనవసరంగా వైఎస్సార్సీపీ కార్యకర్త అని ముద్ర వేశారు’’ అని అజయ్‌దేవ్ సోదరి రజిత బుధవారం వీడియో విడుదల చేశారు. అజయ్‌దేవ్ వైఎస్సార్సీపీ అని తొలుత ప్రచారం కావడంతో మంత్రి నారా లోకేశ్ కామెంట్ చేశారు. ‘ఇదేం పైశాచికం జగన్ గారూ’ అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. మరి లోకేశ్ ఇప్పుడు ఏమంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లోకేశ్ ఏం చెబుతారు? ఉషశ్రీచరణ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు అజయ్‌దేవ్ విషయంలో హోం మంత్రి అనిత స్పందించాలి. ఘటనకు ఠక్కున రాజకీయ రంగు పూసి ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది. రామగిరిలో దళిత బాలికపై, హిందూపురంలో అత్తా కోడలిపై గ్యాంగ్ రేప్ విషయంలో కూటమి పార్టీల నాయకులు ఎందుకు నోరు మెదపలేదు? కానీ, అజయ్‌దేవ్ వైఎస్సార్సీపీ కార్యకర్త అనే అనుమానంతో చకచకా ప్రయోగాలు చేశారు. ఇప్పుడు నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ ఏమి చెబుతారు? -
YSRCP కాదు.. పక్కా జనసేన.. వాడికి పవన్ అంటే పిచ్చి.. అజయ్ దేవ్ చెల్లి షాకింగ్ నిజాలు
-
ఎల్లో మీడియా ఎఫెక్ట్.. జనసేన కార్యకర్తకు పోలీసుల కోటింగ్!
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీపై బురదజల్లాలని పచ్చ మీడియా, పోలీసులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కదిరిలో గర్భిణిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గర్భిణిపై దాడి చేసిన అజయ్ దేవ్ వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్త కాదని.. అతడు జనసేన యాక్టివ్ కార్యకర్త అని ఆ పార్టీ నేత అంగీకరించారు. దీంతో, ఈ కేసులో మరో టర్న్ తీసుకుంది.వివరాల ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణిపై అజయ్ దేవ్ దాడి చేశాడు. దీంతో, నిందితుడు అజయ్.. వైఎస్సార్సీపీ కార్యకర్త అంటూ ఎల్లో మీడియా కలరింగ్ ఇచ్చింది. తప్పుడు కథనాలను ప్రచురించింది. పచ్చ మీడియా ప్రచారాన్ని నమ్మిన కదిరి పోలీసులు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్త అని భావించి.. అతడిపై పోలీసులు తమదైన మార్క్‌తో కోటింగ్ ఇచ్చారు. అనంతరం, పోలీసుల విచారణలో తీవ్రంగా గాయపడిన నిందితుడిని కదిరి పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంతేకాకుండా.. అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే, నిందితుడు అజయ్ జనసేనకు చెందిన వ్యక్తి అని తాజాగా వెలుగులోకి వచ్చింది. అజయ్ దేవ్ తమ పార్టీ కార్యకర్తేనని స్థానిక జనసేన ఎంపీటీసీ అమర్ బహిరంగంగా అంగీకరించారు. అజయ్‌కి వైఎస్సార్సీపీకి సంబంధం లేదన్నారు. అజయ్ చేతిపై పవన్ కల్యాణ్ పచ్చబొట్టు కూడా ఉందని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ అజయ్ దేవ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఏదైనా ఘటన జరిగిన వెంటనే నిందితులను వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా ఎల్లో మీడియా, పోలీసులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ నేతలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. నిందితుడు జనసేన కార్యకర్త అజయ్‌పై ఫిర్యాదు చేసిన గర్భిణీ.. ఇతనికి దాయాదులని, తన తండ్రిని తిట్టిందన్న కోపంతో ఆమెను అజయ్ తోసేశాడని స్థానికులు చెబుతున్నారు. -
రాణించిన అజయ్
జింఖానా, న్యూస్‌లైన్: అజయ్ దేవ్ 6 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంతో యంగ్ సిటిజన్ జట్టుకు విజయం దక్కింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కన్సల్ట్ జట్టు 36 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ చేసిన యంగ్ సిటిజన్ మూడు వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసి విజయం సాధించింది. కన్సల్ట్ జట్టు ఆటగాడు మహేష్ 2 వికె ట్లు తీశాడు. మరో మ్యాచ్‌లో బాయ్స్ టౌన్ జట్టు ఆటగాడు ప్రగున్ ధూబే(134 నాటౌట్), అజ్మత్ ఖాన్ (90) చెలరేగడంతో 186 పరుగుల భారీ తేడాతో ధ్రువ్ ఎలెవన్ జట్టుపై విజయం సాధించింది. బాయ్స్ టౌన్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగగా, మూడు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ధ్రువ్ ఎలెవన్ జట్టు 98 పరుగుల వద్ద కుప్పకూలింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు విజయానంద్: 148 (విక్రాంత్ 37; సాత్విక్ 7/45), మణికుమార్: 151/3 (సిద్ధార్ధ 60, రామ్‌దేవ్ 39, రాహుల్ 33). గ్రీన్లాండ్: 228/7 (శ్రీచరణ్ 36, సుందర్ 66; కౌషిక్ 3/39), సత్య సీసీ: 136 (కౌషిక్ 50; ప్రత్యూష్ 3/41, ఆశిష్ 3/2). టీమ్ కెఎన్వి: 298 (వరుణ్ గౌడ్ 109, రుత్విక్ 100 నాటౌట్), ఫ్యూచర్ స్టార్: 119 (అశోక్ 34; అక్షిత్ 5/25) విజయ్ భరత్: 152 (నరసింహ 41; షాజీల్ 6/56), హైదరాబాద్ పాంథర్స్ ఎలెవన్: 155 (జీషాన్ అలీ ఖాన్ 102 నాటౌట్, అక్రమ్ 32 నాటౌట్).


