breaking news
AFC Cup Football Tournament
-
భారీ మార్పునకు ఫిఫా ప్లాన్.. భారత్‌కు బిగ్ చాన్స్!
ఫిఫా ప్రపంచకప్ 2026 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. 48 జట్లు బరిలోకి దిగితే అందులో నుంచి నాలుగు జట్లు సెమీస్‌లో ప్రవేశించాయి. తొలి సెమీస్‌లో ఫ్రాన్స్‌తో స్పెయిన్, రెండో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఇక అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఫిఫా ప్రపంచకప్ సూపర్ సక్సెస్ అయింది. 2022తో పోలిస్తే ఈసారి ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ పెరిగింది. ముఖ్యంగా క్రికెట్‌ను ఎక్కువగా అభిమానించే భారత్ లాంటి దేశాల్లోనూ ఈసారి ఫిఫా క్రేజ్ మాములుగా లేదు. కేరళ, బెంగాల్‌కు తోడు దేశంలోని ప్రధాన నగరాల్లో ఫిఫాకు సంబంధించి ప్రత్యేక హోర్డింగ్‌లు, స్టార్ ఆటగాళ్ల కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీల్లో ఒకటిగా నిలిచిన ఫిఫాను మరింత విస్తరించే యోచనలో ఫిఫా సమాఖ్య అడుగులు వేస్తోంది. 2030 ఫిఫా ప్రపంచకప్ నాటికి టోర్నీలో పాల్గొనే జట్ల సంఖ్య 48 నుంచి 64కు పెంచాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినోతో ఫిఫా సమాఖ్య బృందం సమావేశమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇలా చేయడం వల్ల ఫుట్‌బాల్‌లో అతిపెద్ద వేదిక అయిన ఫిఫాలో పోటీపడాలనే కల ప్రతీ దేశానికి కలుగుతుందని గియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. ఒకవేళ వచ్చే ప్రపంచకప్ లేదా ఆ తర్వాత జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇది జరిగితే భారత్‌కు అవకాశమెంత ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నో ఏళ్ల నుంచి ఫిఫాలో ఆడాలన్న భారత్ కల నెరవేరుతుందా? దీనికి సంబంధించిన అవకాశాలెంత అనేది ఒకసారి పరిశీలిద్దాం.అలా అయితేనే భారత్‌కు చాన్స్!వచ్చే ఫిఫా ప్రపంచకప్ (2030) నాటికి 64 జట్లు పాల్గొంటే ఆసియా ఖండం నుంచి భారత ఫుట్‌బాల్ జట్టుకు అవకాశం ఉంటుందా అంటే చెప్పలేం. అది రాబోయే నాలుగేళ్లలో మన జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) ర్యాంకింగ్స్‌లో భారత్ 24వ స్థానంలో కొనసాగుతుంది. ఒకవేళ 2030 ఫిఫా నాటికి 64 జట్లకు అవకాశం కల్పిస్తే ఆసియా ఖండం నుంచి క్వాలిఫై అయ్యే జట్ల సంఖ్య 11 లేదా 12కు పెరగనుంది. ఫిఫా ర్యాంకింగ్స్ ఆధారంగా జపాన్, సౌత్ కొరియా, ఇరాన్, ఆస్ట్రియా, సౌదీ అరేబియాలు నేరుగా టాప్ ఐదు స్థానాలకు అర్హత సాధిస్తాయి. ఖతార్, ఇరాక్, ఉజ్బెకిస్తాన్, యూఏఈ, జోర్డాన్ జట్లు మిగతా నాలుగు స్థానాలకు పోటీ పడనున్నాయి. ఒకవేళ 11 లేదా 12 జట్లకు అవకాశం కల్పిస్తే భారత్ ఈ స్థానాలకు పోటీ పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండు స్థానాలకు కూడా ఒమన్, బహ్రెయిన్, సిరియా, చైనా, వియత్నాం, థాయ్‌లాండ్‌ల నుంచి భారత్‌కు గట్టి పోటీ ఉండనుంది. అది కూడా భారత్ ప్రస్తుతమున్న 24వ ర్యాంక్ నుంచి 15వ ర్యాంకుకు చేరుకుంటేనే ఫిఫాకు అర్హత సాధించే అవకాశముంటుంది. ఎందుకంటే ఫిఫా ప్రపంచకప్ అర్హతకు ఆసియా ఖండం నుంచి 15 అత్యుత్తమ జట్లకు మాత్రమే క్వాలిఫయింగ్ పోటీలకు అర్హత కల్పించడం జరుగుతుంది. ఈ లెక్కన 2030లో భారత్ ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే వచ్చే నాలుగేళ్లలో మెరుగైన ప్రదర్శనతో టాప్-15లో చోటు దక్కించుకోవాల్సిన అవసరముంది.2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో 32 దేశాలు పాల్గొన్నాయి. తాజా ప్రపంచకప్‌లో ఆ సంఖ్యను 48కి పెంచారు. ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే ఫిఫా ప్రపంచకప్ ఖండాంతరాలను దాటి విశ్వవ్యాప్త క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్న తరుణంలో ఫిఫా జట్ల సంఖ్యను మరింత పెంచాలనే నిర్ణయానికి రావడం అభినందించాల్సిన అంశం.Read: సీఎస్కే కోచ్ పదవికి స్టీఫెన్ ప్లెమింగ్ గుడ్ బై -
థ్రిల్లింగ్ మ్యాచ్ అనంతరం తన్నుకున్న భారత్, అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు
ఏఎఫ్సీ ఆసియాకప్ క్వాలిఫయింగ్‌లో భాగంగా భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ యుద్ద వాతావరణాన్ని తలపించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకుంటూ.. తిట్టుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. కోల్‌కతాలోని వీఐబీకే స్టేడియంలో శనివారం రాత్రి భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సునీల్ చెత్రీ సేన(టీమిండియా) 2-1 తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. ఆఖరి వరకు డ్రా దిశగా సాగిన ఈ మ్యాచ్‌లో 85వ నిమిషంలో భారత్‌కు వచ్చిన ఫ్రీకిక్ గోల్ అవకాశాన్ని సునీల్ చెత్రీ చక్కగా ఉపయోగించుకున్నాడు. తన మ్యాజిక్‌తో మ్యాచ్‌లో భారత్ తొలి గోల్ చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే అఫ్గన్స్ కూడా ధీటుగా బదులిచ్చారు. ఆట 88వ నిమిషంలో అఫ్గన్ మిడ్ ఫీల్డర్ జుబైర్ అమిరి హెడర్ గోల్ చేశాడు. దీంతో నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో ఉన్నాయి. అదనపు సమయంలో భారత్ స్ట్రైకర్ సాహల్ అబ్దుల్ సమద్ సూపర్ గోల్ కొట్టడంతో భారత్ 2-1తో ఆధిక్యంలో వెళ్లడంతో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి అసలు కథ ఇక్కడే మొదలైంది. ఓడిపోయామన్న బాధను అఫ్గన్ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు. పెవిలియన్ వెళ్తున్న ఇద్దరు భారత ఆటగాళ్ల వైపు దూసుకొచ్చిన అఫ్గన్ ఆటగాళ్లు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. చీటింగ్ చేసి మ్యాచ్ గెలిచారంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనికి భారత్ ఆటగాళ్లు కూడా కౌంటర్ ఇవ్వడంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన భారత్ గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సర్ది చెప్పాలని చూడగా అతన్ని కూడా తోసేశారు. ఇలా చూస్తుండగానే పెద్దదిగా మారిన గొడవ పతాక స్థాయికి చేరుకుంది. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరిని ఒకరు తోసుకుంటూ కొట్టుకున్నంత పని చేశారు. ఈ క్రమంలో ఇదంతా గమనించిన ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్(ఏఎఫ్సీ) అధికారులు గ్రౌండ్లోకి పరిగెత్తుకొచ్చి ఆటగాళ్లను విడదీసి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఏఎఫ్సీ గొడవకు కారణమేంటి.. ఇందులో తప్పెవరిది.. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం కొసమెరుపు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డోపై అత్యాచారం కేసు.. కోర్టు కీలక తీర్పు ఓవైపు భారత్, సౌతాఫ్రికా మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు -
నేటి నుంచి ఆసియా కప్ టోర్నీ.. 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత..
43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ మహిళల ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. 12 జట్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్ నేడు ముంబైలో మొదలుకానుంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత్ నేడు ఇరాన్‌తో తలపడుతుంది. ఇరాన్‌తో గతంలో మూడుసార్లు ఆడిన భారత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్ రెండుసార్లు రన్నరప్‌గా (1979, 1983) నిలిచింది. -
బెంగళూరు ఎఫ్‌సీ సంచలనం
బెంగళూరు: ఏఎఫ్సీ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత్‌కు చెందిన బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ కొత్త చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి భారత క్లబ్‌గా బెంగళూరు ఎఫ్‌సీ రికార్డు సృష్టించింది. బుధవారం ఇక్కడ జరిగిన సెమీ ఫైనల్లో (రెండో రౌండ్) బెంగళూరు 3-1 తేడాతో మలేసియా జట్టు, డిఫెండింగ్ చాంపియన్ జొహొర్ దారుల్ తక్జీమ్పై విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ సెమీస్ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. దాంతో ఓవరాల్ స్కోరింగ్‌లో బెంగళూరు 4-2తో ఆధిక్యం ప్రదర్శించి తుది పోరుకు అర్హత సాధించింది. జట్టు తరఫున సునీల్ ఛెత్రి (41, 66వ ని.)రెండు గోల్స్ చేయగా, జువానన్ (75వ నిమిషం) మరో గోల్ సాధించాడు. జొహొర్ జట్టు ఆటగాడు సఫీఖ్ రహమాన్ (11వ నిమిషం) ఏకై క గోల్ నమోదు చేశాడు. ఫైనల్లో బెంగళూరు ఎఫ్‌సీ...అల్ ఖువా అల్ జవియా (ఇరాక్ ఎరుుర్‌ఫోర్స్ క్లబ్) జట్టుతో తలపడుతుంది.


