breaking news
AE died
-
ఏపీలో విషాదం.. గోదావరిలోకి దూకి ఏఈ కుటుంబం ఆత్మహత్య!
సాక్షి, రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన మత్స్యకారులు అతి కష్టం మీద ఒకరిని కాపాడారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పిఠాపురానికి చెందిన నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34), మనవడు కలిసి గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో నూకరాజు, మీనా, సౌజన్య గల్లంతు కాగా.. నూకరాజు మనవడిని మత్స్యకారులు గుర్తించి ప్రాణాలతో కాపాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన ముగ్గురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే, వీరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. -
ట్రాన్స్ఫార్మర్ పేలి ఏఈ మృతి
చంద్రగిరి: ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఈ నాగరాజు చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నరిశింగాపురం గ్రామ సమీపంలోని శ్రీ పద్మావతి కార్లిడెట్ కంటైనర్స్ ఫ్యాక్టరీ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ ట్రాన్స్ పార్మర్కు మరమ్మత్తులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ పేలి మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న నాగరాజుకు మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను 108 సాయంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో చైన్నైలోని అపోలోకు తీసుకువెళ్లారు. కాగా.. శరీరంలోని అధిక భాగాలు కాలిపోవడంతో.. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.


