ట్రాన్స్‌ఫార్మర్ పేలి ఏఈ మృతి | AE died due to transformer blast | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్ పేలి ఏఈ మృతి

Oct 7 2015 9:07 AM | Updated on Apr 3 2019 3:52 PM

ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఈ నాగరాజు చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు.

చంద్రగిరి: ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఈ నాగరాజు చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నరిశింగాపురం గ్రామ సమీపంలోని శ్రీ పద్మావతి కార్లిడెట్ కంటైనర్స్ ఫ్యాక్టరీ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ ట్రాన్స్ పార్మర్‌కు మరమ్మత్తులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ పేలి మంటలు వ్యాపించాయి.

ఆ సమయంలో అక్కడే ఉన్న నాగరాజుకు మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను 108 సాయంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో చైన్నైలోని అపోలోకు తీసుకువెళ్లారు. కాగా.. శరీరంలోని అధిక భాగాలు కాలిపోవడంతో.. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement