breaking news
Aceh province
-
ఇండోనేషియాలో భారీ భూకంపం : 54 మంది మృతి
జకర్త: ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. ఉత్తర సుమత్రా దీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో బుధవారం రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప ధాటికి భారీ నిర్మాణాలు సైతం నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 54 మంది మృతిచెందగా, వందమందికి పైగా గాయాలైనట్టు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తర సుమత్రాలోని బందా అసెకు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 2004లో పశ్చి సుమిత్ర ద్వీపంలోని అచీ ప్రావెన్స్ సముద్ర గర్భంలో వచ్చిన భూకంపం వల్ల ఏర్పడిన సునామీతో దాదాపు రెండు లక్షల మంది మరణించిన సంగతి తెలిసిందే. -
ఇండోనేషియాలో భారీ భూకంపం
-
ఇండోనేషియాలో భూకంపం
సులవేసి ద్వీపకల్పంలో ఈ రోజుల తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 5.7గా నమోదు అయిందని యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. వాయువ్వ గొరొన్టలో నగరంలో మంగళవారం తెల్లవారుజామున 3.11 నిమిషాలకు ఆ భూకంపం చోటు చేసుకుందని తెలిపింది. అయితే ఎటువంటి నష్టం చోటు చేసుకోలేదని పేర్కొంది. ఇండోనేషియాలో్ ఇటీవల తరుచుగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జులైలో అచీ ప్రావెన్స్లో సంభవించిన భూకంపం వల్ల 35 మంది మరణించగా, వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.