breaking news
Abhignan kids care School
-
సంప్‌లో పడి బాలుడు దుర్మరణం
-
నిన్న స్కూల్లో చేరిన బాలుడు ఈరోజు సంప్‌లో దుర్మరణం
హైదరాబాద్: నిన్ననే స్కూల్లో చేరిన ఓ బాలుడు, స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈరోజు అదే స్కూల్లోని సంపులో పడి దుర్మరణం చెందాడు. వనస్థలీపురంలోని అభిజ్ఞాన్ కిడ్స్ కేర్ స్కూల్లో ఈ విషాద ఘటన జరిగింది. వచన్ అనే రెండున్నరేళ్లబాలుడిని తల్లిదండ్రులు నిన్ననే స్కూల్లో చేర్చారు. ఈ రోజు వచన్ స్కూల్లోని సంపులో పడిపోయిన విషయాన్ని అక్కడి ఆయా గానీ, ఇతరులుగానీ గుర్తించలేదు. వారు గుర్తించేసరికి బాలుడు మృతి చెందాడు. సంపులో పడిన బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం స్కూల్‌కు తాళాలు వేసి పరారయ్యారు.