breaking news
Shivani Nagaram
-
షార్ట్ ఫిలింస్ నుంచి సినిమాల్లోకి.. హార్ట్స్ దోచేస్తున్న తెలుగమ్మాయి
ప్రేక్షకుల మనసుకు దగ్గరవ్వాలంటే కేవలం అందం ఉంటే సరిపోదు. ఎంచుకున్న పాత్రలో ఇమిడిపోయి నటించాలి. అలాంటి నటనతో మన పక్కింటి అమ్మాయిలా ఉందేంటి? మనింటి అమ్మాయిలానే ఉంది.. అనుకునేట్టుగా దగ్గరవుతున్న నటి శివాని నాగారం. ఆకర్షించే కళ్లు, ఆకట్టుకునే నటన ఈ తెలుగమ్మాయి సొంతం. ఈ లిటిల్ హార్ట్ గురించి మరెన్నో విశేషాలు మీకోసం..ఆ సినిమాతో క్లిక్అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాలో వెండితెరపై మెరిసిన నటి శివాని (Shivani Nagaram). మొదటి సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో శివాని కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. శివాని స్వస్థలం హైదరాబాద్. విల్లా మేరీ కాలేజీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఆమె మొదట ‘అంతర్గత’ అనే షార్ట్ ఫిల్మ్ చేసింది. తర్వాత ‘మిస్టర్ గర్ల్ ఫ్రెండ్’ అనే వెబ్ సిరీస్ చేసి తెలుగు యువతకు ముందుగానే పరిచయమైంది.చాలా అవకాశాలొచ్చాయి, కానీ..చిన్నతనం నుంచే శివాని సంగీతం, కూచిపూడి నృత్యం నేర్చుకుంది. ఖాళీ సమయాల్లో పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ క్లాసులు తీసుకోవడం తనకెంతో ఇష్టమట! సోషల్ మీడియాలో ఆమె తన తమ్ముడితో కలిసి పాటలు పాడుతూ వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటుంది. దాన్నిబట్టి ఆమెకు సంగీతంపై ఉన్న ఇష్టం అర్థమవుతుంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ హిట్ అయ్యాక, చాలా అవకాశాలు వచ్చాయి కాని, ఒప్పుకోలేదు. ఎందుకంటే అదే తరహా క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేదు. నాకు ఎప్పటికప్పుడు చేంజ్ ఓవర్ ఉండాలి.నిత్యవిద్యార్థినిఇప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది కదా.. నేనింకా యాక్టింగ్ లో చాలా నేర్చుకోవాలి. నిత్యవిద్యార్థినిగా ఉండేందుకు సిద్ధంగా ఉంటాను. నా దృష్టిలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు రెండూ గొప్పవే. నటిగా నన్ను మలచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాననే నమ్మకం నాకుంది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి. వచ్చి మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని ఎప్పుడూ కోరుకుంటాను. కాలేజీ రోజుల్నుంచే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉండేది. దాన్ని మా కుటుంబ సభ్యులూ ప్రోత్సహించారు. వాళ్లు నన్నెప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు.ఆ హీరోయిన్‌కు అభిమానినినేను హీరోయిన్ సమంతకు పెద్ద ఫ్యాన్. శ్రీదేవి గారు, సావిత్రి గారి నటన అంటే చాలా ఇష్టం. 'నువ్వు హీరోయిన్ కాకపోయుంటే ఏమయ్యేదానివి’ అని చాలామంది అడుగుతుంటారు. హీరోయిన్ కాకుంటే కచ్చితంగా సింగర్ అయ్యేదాన్ని. నాకు మ్యూజిక్, డ్యాన్స్ అంటే ప్రాణం. నాకు కథ, అందులో నా క్యారెక్టర్ చాలా ముఖ్యం. అవి నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటాను. అంతే తప్ప, గ్లామరస్ రోల్స్ మాత్రమే చేయాలని అనుకోవట్లేదు. నేను రెండు సినిమాలే చేశాను. వాటికే తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంతలా ప్రేమిస్తుండటం చూస్తే, చాలా అదృష్టవంతురాలిని అనిపిస్తుంది.చదవండి: దమ్ముంటే నాకు సైట్ కొట్టి చూడండి : హీరోయిన్ -
నటి శివానీ నగరం దసరా స్పెషల్..ఆ నమ్మకంతోనే ముందుకు
‘‘దుర్గా మాతని శక్తి స్వరూపిణి అంటారు. ప్రతి స్త్రీలోనూ అంతర్లీనంగా దుర్గా మాత ఉంటుందని నేను నమ్ముతాను. అందుకే ఎలాంటి క్లిష్టమైన సవాల్‌ను ఎదుర్కొనాల్సి వచ్చినా బలంగా, ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతున్నారు... సక్సెస్ అవుతూ, వారిని వారు సంరక్షించుకోగలుగుతున్నారు. స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచే దసరా మహిళలందరికీ పెద్ద పండగ’’ అని అన్నారు యువ నటి శివానీ నాగారం. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు నటిగా పరిచయం అయ్యారు శివానీ. ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. తెలుగు తెరపై ఈ మధ్య మెరిసిన నవ తారల్లో తెలుగమ్మాయి శివానీకి అవకాశాలు మెండుగానే ఉన్నాయి. విజయోత్సాహంలో ఉన్న శివానీ దసరా, బతుకమ్మ పండగ విశేషాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. మా కుటుంబానికి ‘దసరా’ చాలా పెద్ద పండగ. మేం అందరం కలిసి చాలా సందడిగా దసరా నవరాత్రులను చేసుకుంటాం. అలాగే బతుకమ్మ పండగను కూడా సెలబ్రేట్ చేస్తాం. రంగు రంగుల పువ్వులు సేకరించి, మా కుటుంబంలోని మహిళలతో పాటు అ పార్ట్మెంట్లోని మహిళలందరం కలిసి బతుకమ్మ ఆడతాం. దసరా అనగానే నాకు అమ్మవారు గుర్తుకు వస్తారు. మనకు ఉన్న చెడు వెళ్లిపోయి మనల్ని అమ్మవారు గుడ్ డేస్, గుడ్ స్ట్రెంత్తో ఆశీర్వదిస్తారు. మేం ఆ రోజు బంగారం కొంటాం. తొమ్మిదో రోజు ఆయుధ పూజ చేస్తాం. మా ఇంట్లో ఉన్న కార్లు, బైక్‌లకు పూల మాల వేసి, పూజలు చేస్తాం. ఇంటిని బాగా అలకరించుకుంటాం. బూరెలు, పాయసం, పులిహోర... ఇలా రకరకాల వంటకాలు చేసి, దేవుడికి పూజ చేసి, నైవేద్యం పెడతాం. ఇక నా జీవితంలో దసరా పండక్కి ప్రత్యేకమైన మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటాను. కొన్ని పండగలకు మా కజిన్స్ మా ఇంటికి వస్తారు. కొన్నిసార్లు మేం వాళ్ల ఇంటికి వెళ్తాం. అలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటాం. దసరా పండగకి సంబంధించి నా స్కూల్ డేస్‌లో కానీ, కాలేజ్ డేస్‌లో కానీ ఎలాంటి మైథలాజికల్ క్యారెక్టర్ చేయలేదు. అయితే అవకాశం వస్తే ఆ తరహా పాత్ర చేయాలని ఉంది. ఎందుకంటే ఆ పాత్రలో కొంత మహిళా సాధికారత ఉంటుందని నా నమ్మకం. ఓ నటిగా నాకు స్థిరత్వం, ఓపిక చాలా ముఖ్యం. దసరా అంటే క్లిష్టపరిస్థితులను దాటుకుని, విజయం సాధించడం. అందుకే మనకు ఓపిక, నమ్మకం ఉండాలి. చెడు రోజులను బలంగా ఎదుర్కొని, హుందాగా నెగ్గుకు రాగలగాలి. చదవండి: గోంగూర పువ్వులతో వంటలు, అద్భుత ప్రయోజనాలుకోల్కతాలో దసరా నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. నా జీవితంలో ఒక్కసారైనా నేను కోల్‌కతా వెళ్లి, దుర్గామాత పూజలో పాల్గొనాలని ఉంది. కొన్నిసార్లు నేను హైదరాబాద్‌లో బెంగాలీ సమితులకు వెళ్తాను. ప్రతి ఏడాది దసరా నవరాత్రుల ఉత్సవాల్లో ఏదో ఒకరోజు తప్పకుండా వెళ్లి, అమ్మ వారిని దర్శించుకుంటాను. అక్కడ దుర్గామాతకు హారతి ఇస్తారు. ఆ సమయంలో బెంగాలీ మహిళలు తెల్లచీర ధరించి, నుదుట ఎరుపు రంగు బొట్టు పెట్టుకుని, డ్యాన్స్ చేస్తుంటే ఆ వైబ్రేషన్సే వేరుగా ఉంటాయి. ఇక దసరా ఫెస్టివల్‌కి నా కాలేజీ డేస్ నుంచి దాండియా, గర్బా ఆడటం అలవాటు. ఎవరు దాండియా, గర్బా ఫెస్టివల్స్‌ను ఏర్పాటు చేసినా అక్కడికి మేం గ్రూప్‌గా వెళ్లి రాత్రంతా ఆడేవాళ్ళం. అంత క్రేజీగా ఉండేది. నాకు అది లవ్లీ ఎక్స్పీరియన్స్. ఇదీ చదవండి: Janhvi Kapoor అమ్మ చీర చుట్టేసి..ఫ్యాన్స్‌ను కట్టిపడేసి : అమేజింగ్ లుక్నేను స్పిరిచ్యువల్ పర్సన్నిబాధగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడనే కాదు... అవకాశం దొరికినప్పుడల్లా దేవాయాలకు వెళ్తుంటాను. గుడిని ఇల్లుగా భావిస్తాను. అలాగే ఇంటిని కూడా దేవాలయంలా అనుకుంటాను. మా కుటుంబ సభ్యులు కూడా అలానే ఉంటారు. నేను ఎక్కడకి వెళ్లినా, ఎక్కడున్నా దేవుడు అక్కడే ఉన్నారని నేను అనుకుంటాను. ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి నన్ను రక్షిస్తుందని నా నమ్మకం. నన్నే కాదు... అందర్నీ రక్షిస్తుంటుందని భావిస్తాను. ఈ నమ్మకం వల్లే జీవితంలో ముందుకు వెళ్లగలుగుతాం. ఉపవాసం అంటే స్వీయ నియంత్రణఉపవాసం గురించి ఎవరి వ్యక్తిగత అభి్ర΄ాయాలు వారికి ఉండొచ్చు. దసరా సమయంలో ఇప్పటివరకు నేనైతే ఉపవాసం ఉండలేదు. మా అమ్మ, అమ్మమ్మగార్లు ఉంటారు. అయితే ఉపవాసం చేయడం వల్ల స్వీయ నియంత్రణ కలుగుతుంది. అమ్మవారికి మన వంతుగా ఏదో ఇచ్చిన ఓ సంతృప్తి ఉంటుంది.ఓపికతో ఉండాలి మనకు మనమే స్ఫూర్తిగా నిలవాలంటే ముందు మనపై మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇదే మనకు మనం ఇచ్చుకునే మోటివేషన్. ఎంత ఓపికతో ఉంటే అంత మంచి ఫలితం వస్తుందంటారు. సహనంగా ఉంటే ఏ పనైనా సరిగ్గా అవుతుంది. అందుకే నా ఓర్పే నా శక్తి అని నమ్ముతాను. – ముసిమి శివాంజనేయులు -
ఆడియన్స్ పిచ్చోళ్లా.. ఇంత సపోర్ట్ చేస్తారా?: యంగ్ హీరో
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన స్టార్ హీరోల సినిమాలు సైతం సరిగ్గా ఆడడం లేదు. ఇలాంటి సమయంలో తక్కువ బడ్జెట్ వచ్చిన చిన్న సినిమా ‘లిటిల్ హార్ట్స్’ భారీ విజయం సాధించింది. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ చిత్రం రిలీజైన తొలిరోజే(సెప్టెంబర్ 5) హిట్ టాక్ తెచ్చుకొని.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా హీరో మౌళి మాట్లాడుతూ ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదని అన్నారు. ‘ఆడియన్స్.. పిచ్చోళ్లా మీరు. ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా. మేము అస్సలు ఊహించలేదు. మంచి సినిమా చేశామని తెలుసు. తొలి వారం కొంతమంది చూస్తారు. మౌత్ టాక్‌తో రెండో వారం నడుస్తుందేమో అనుకున్నాం. అలా అనుకొనే గట్టిగా ప్రమోషన్స్ చేశాం. అయినా కూడా ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారా రారా అనుకున్నాం. కానీ ప్రీమియర్స్, ఫస్ట్ రోజు..థియేటర్స్ అన్ని నిండిపోయాయి. ఫస్ట్‌డే రూ.2.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇది మా సినిమా బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. పిచ్చోళ్లం అయిపోయాం. మమ్మల్ని నమ్మి సినిమాకు వచ్చిన ఆడియన్స్‌కి థ్యాంక్స్. ఈ వారం ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలియదు. ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తునారనో నాకే అర్థం కాలేదు. ఎవరైనా సినిమా బాగోలేదని కామెంట్ పెడితే.. వాళ్లను తిడుతూ రిప్లై ఇస్తున్నారు. రవితేజ, నాని మొదలు ఇండస్ట్రీ పెద్దలంతా మా సినిమాను మొచ్చుకుంటూ ట్వీట్స్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇలానే కష్టపడి మంచి సినిమాలు తీస్తానని అందరికి మాట ఇస్తున్నా’ అన్నారు.సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించారు. 2009-2020 మధ్యకాలంలో జరిగే టీనేజ్ లవ్‌స్టోరీ ఇది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. యువత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. -
పెళ్లి కూతురిలా జాన్వీ కపూర్.. నివేదా చబ్బీ లుక్
పెళ్లి కూతురిలా ముస్తాబైన జాన్వీ కపూర్జిగేలు మనే డ్రస్సులో మెరిసిపోతున్న తమన్నాతెల్లని చీరలో ఓనం జరుపుకొన్న నివేదా థామస్చీరలో మరింత అందంగా అనన్య నాగళ్లఇళయరాజా పాట పాడి ఆకట్టుకున్న మడోన్నారెడ్ డ్రస్సులో 'లిటిల్ హార్ట్స్' శివానీ నాగారం View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
'లిటిల్ హార్ట్స్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
రీసెంట్ వీకెండ్లో మూడు సినిమాలొస్తే ఏ మాత్రం అంచనాల్లేని 'లిటిల్ హార్ట్స్' అనే చిన్న చిత్రం ఊహించని సక్సెస్ అందుకుంది. తొలిరోజే బ్రేక్ ఈవెన్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో లీడ్ రోల్స్ చేసిన మౌళి, శివాని నాగారంతో పాటు హీరో ఫ్రెండ్‌గా చేసిన జయకృష్ణని అందరూ ప్రశంసిస్తున్నారు. మౌళి, జయకృష్ణ యూట్యూబర్స్ అని చాలామందికి తెలుసు. కానీ కాత్యాయని పాత్రలో హీరోయిన్గా కనిపించిన శివాని ఎవరా అని సెర్చ్ చేస్తున్నారు? ఇంతకీ ఎవరీమె? డీటైల్స్ ఏంటి?ఈ సినిమాలో మౌళితో పాటు కాత్యాయని పాత్రలో శివాని కూడా ఆకట్టుకుంది. ఈమె ఇదివరకే ఓ తెలుగు సినిమాలో చేసింది. అయితే ఈమె యాక్టింగ్‌తోపాటు సింగర్ కమ్ ట్రైన్డ్ కూచిపూడి డ్యాన్సర్ కూడా. 1988లో హైదరాబాదులో పుట్టిన శివానీ.. చిన్నతనం నుంచే కూచిపూడి నేర్చుకుంది. విల్లా మేరీ కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ చేసింది. 'అంతర్గత' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా మారింది. 2020లో మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.(ఇదీ చదవండి: మహేశ్, అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్?)ఇన్ స్టాలో చూసి 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రంలో ఛాన్స్ ఉందని శివానికి తెలిసింది. అయితే హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్ ఇస్తే, అదృష్టం కలిసొచ్చి ఈమెనే హీరోయిన్గా తీసుకున్నారు. సంగీతంలో ప్రావీణ్యం ఉన్న ఈమె.. ఖాళీ సమయంలో పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. అలానే తమ్ముడితో కలిసి సాంగ్స్ పాడుతూ ఆ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తొలి సినిమా కంటే ముందు 'జాతిరత్నాలు'లో న్యూస్ ప్రెజెంటర్‌గా చిన్న పాత్రలో కనిపించింది. ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' మూవీతో కాత్యాయనిగా కుర్రాళ్ల మనసు కొల్లగొట్టేస్తోంది. ప్రస్తుతం సుహాస్ హీరోగా చేస్తున్న 'హే భగవాన్' అనే మూవీలో హీరోయిన్గా చేస్తోంది.(ఇదీ చదవండి: ‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) -
ఎరుపు రంగు చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ శివానీ నగరం (ఫొటోలు)
-
‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ
టైటిల్: లిటిల్ హార్ట్స్నటీనటులు: మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులురచన, దర్శకత్వం : సాయి మార్తండ్నిర్మాత: ఆదిత్య హాసన్సంగీతం: సింజిత్ యెర్రమల్లిసినిమాటోగ్రఫీ : సూర్య బాలాజీవిడుదల తేది: సెప్టెంబర్ 5, 2025‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ఫేమ్ హీరోయిన్ శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసుకుంది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిన్న సినిమాపై ఓ మోస్తరు అంచనాలు కూడా ఏర్పడ్డాయి. మరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా? లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?ఈ సినిమా కథ 2009-2020 మధ్య కాలంలో సాగుతుంది. నల్లి అఖిల్(మౌళి తనూజ్) చదువులో చాలా వీక్. అతన్ని ఇంజనీర్ చేయాలానేది తండ్రి గోపాలరావు(రాజీవ్ కనకాల)ఆశయం. కానీ అఖిల్ ఎంసెట్‌లో క్వాలిఫై కూడా కాడు. తనవల్ల కాదని చెప్పినా వినకుండా లాంగ్‌టర్మ్ కోచింగ్‌కి పంపిస్తాడు తండ్రి. ఆ కోచింగ్ సెంటర్లో ఉన్న కాత్యాయని(శివానీ నాగారం) పరిస్థితి కూడా అంతే. ఆమెకు మెడిసిన్ చదవడం ఇష్టం ఉండదు. కానీ పెరెంట్స్ బలవంతంగా లాంగ్‌టర్మ్ కోచింగ్‌కి పంపిస్తారు. అక్కడే అఖిల్‌కి కాత్యాయని పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమకు దారి తీస్తుంది. అఖిల్ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టగానే.. కాత్యాయని ఓ సీక్రెట్ విషయాన్ని వెల్లడిస్తుంది. అదేంటి? అఖిల్, కాత్యాయనిల ప్రేమకు ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని వీరిద్దరు ఎలా ఎదుర్కొని..ఒకటయ్యారు? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు చాలా సింపుల్‌గా, రొటీన్‌గా ఉన్నా.. తెరపై చూస్తుంటే బోర్ కొట్టదు. ఊహించే మలుపు ఉన్నా.. ఎక్కడో చూసిన సన్నివేశాలు కనిపించినా.. ఎంటర్టైన్ అవుతుంటాం. లిటిల్ హార్ట్స్ ఆ కోవలోకి చెందిన చిత్రమే. కథగా చెప్పాలంటే ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. రెగ్యులర్ రొటీజ్ టీనేజ్ లవ్‌స్టోరీ. కానీ దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు.. పంచ్ డైలాగులు సినిమాను నిలబెట్టాయి. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. టీనేజ్ అమ్మాయి/అబ్బాయిలు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా 2009-2020 మధ్య కాలేజీ చదివిన వాళ్లు ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారు. జియో సిమ్ రాకముందు అంటూ హీరోహీరోయిన్లు, వాళ్ల ఫ్యామిలీ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించారు. కోచింగ్ సెంటర్లో హీరోహీరోయిన్ల పరిచయం తర్వాత కథనం మరింత ఎంటర్టైనింగ్గా సాగుతుంది. కాత్యాయని ఇంప్రెస్ చేసేందుకు అఖిల్ చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో స్నేహితుడు వేసే పంచులు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో కామెడీ డబుల్ అవుతుంది. హీరోయిన్‌కి దగ్గరయ్యేందుకు హీరో చేసే ప్రయత్నాలు.. ఆమె బర్త్‌డే కోసం అఖిల్ చేసే సర్ప్రైజ్.. అవి ఇంట్లో వాళ్లకు తెలిసిన తర్వాత ఎదురయ్యే చిక్కులు.. ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. అయితే హీరోహీరోయిన్లు కలిసేందుకు చిన్న పిల్లలను వాడుకోవడం.. వారి మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. అలాగే ఒకటి రెండు చోట్ల డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఇబ్బందికి గురి చేస్తాయి. అయితే ప్రస్తుతం వస్తున్న యూత్‌ఫుల్ కామెడీ చిత్రాలతో పోలిస్తే.. ఇందులో వల్గారిటీ చాలా తక్కువనే చెప్పాలి. బూతు సన్నివేశాలేవి లేకుండానే కామెడీ పండించారు. ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే. ‘గోల్స్ ఎప్పుడు అందంగా ఉండాలి’ అంటూ హీరోతో ఒక డైలాగ్ చెప్పించడమే కాకుండా.. క్లైమాక్స్‌లో దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చూపించారు. యూత్ అయితే ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. అఖిల్ పాత్రలో మౌళి పర్వాలేదనిపించాడు. ఆయన కామెడీ టైమింగ్ బాగుంది. కాత్యాయని పాత్రకి శివానీ నాగారం న్యాయం చేసింది. మౌళికి జోడీగా ఆమెను ఎందుకు తీసుకున్నారనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరో స్నేహిడు మధుగా జయకృష్ణ పండించిన కామెడీ ఈ సినిమాకు మరో ప్రధాన బలమైంది. మరో స్నేహితుడిగా నిఖిల్ కూడా తన పాత్ర పరిధిమేర చక్కగానే చేశారు. రాజీవ్ కనకాల, అనిత చౌదరి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. -
థియేటర్, ఓటీటీ తేడా చూడను.. కథ, నా పాత్ర నచ్చితే చాలు : శివానీ నాగారం
‘‘లిటిల్ హార్ట్స్’ చిత్రంలో కాత్యాయని అనే కాలేజ్ గర్ల్‌గా చేశాను. ప్రేక్షకులు తమని తాము పోల్చుకునేలా నా పాత్ర ఉంటుంది. ఈ సినిమాలోని అఖిల్ (మౌళి తనుజ్ పాత్ర), కాత్యాయని స్నేహం, ప్రేమ చూస్తుంటే కళాశాల రోజులు, అలాగే విద్యార్థిగా మనం చేసిన పనులన్నీ గుర్తొస్తాయి... మేమూ ఇలాగే ఉండేవాళ్లం అనిపిస్తుంది’’ అని శివానీ నాగారం తెలిపారు. మౌళి తనుజ్, శివానీ నాగారం జంటగా సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాని బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ నెల 5న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శివానీ నాగారం మాట్లాడుతూ– ‘‘లిటిల్ హార్ట్స్’ సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమల్లి, నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం. తన ద్వారా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. సాయి మార్తాండ్ కథ, నా పాత్ర చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. మంచి కంటెంట్ ఉన్న మూవీ ‘లిటిల్ హార్ట్స్’. పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. మా సినిమా కంటెంట్ నచ్చడంతో ‘బన్నీ’ వాసు, వంశీ నందిపాటిగార్లు రిలీజ్ చేస్తున్నారు. దాంతో మా సినిమా ఓవర్సీస్లోనూ విడుదలవుతోంది. ఇక థియేటర్, ఓటీటీ అనే తేడాలు చూడను. కథ, నా పాత్ర నచ్చితే వెబ్ సిరీస్‌లు కూడా చేస్తాను. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా తర్వాత నేను, సుహాస్ కలిసి ‘హే భగవాన్’ సినిమా చేస్తున్నాం. మరో రెండు చిత్రాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.