భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు తన చిరకాల ఆశయం దిశగా తొలి అడుగు వేసిన విషయం తెలిసిందే.
విశాఖపట్నంలో తన కలల ప్రాజెక్టు పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి గతేడాది నవంబరులో శ్రీకారం చుట్టింది. పునాది పడినట్లు తెలిపింది. ఇక ఇప్పుడు ఆ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సింధు ఇన్‌స్టా స్టోరీలో ఓ ఫొటోను పంచుకుంది కలలు రూపుదిద్దుకుంటున్నాయి అని సింధు పేర్కొంది
కాగా సింధు గతేడాది డిసెంబరులో వైవాహిక బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నాటి నుంచి భర్తతో కలిసి దిగిన ఫొటోలను సింధు వరుసగా పోస్ట్ చేస్తోంది
తాజాగా తన అకాడమీ పనులకు సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేసింది
పెళ్లి తర్వాత ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో భాగమైన సింధు.. ప్రస్తుతం ఇండోనేషియా ఓపెన్‌తో బిజీగా ఉంది
సింధు పెళ్లినాటి ఫొటో
విశాఖపట్నంలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి పునాది పడిన నాటి ఫొటోలు


