చైన్నె: ఫెంగల్ విలయతాండవానికి కడలూరు, విల్లుపురం జిల్లాలు చిగురుటాకుల్లా వణికిన విషయం తెలిసిందే
చరిత్రలో ఎన్నడూ లేనంతగా అతిభారీ వర్షాలను చూసిన గ్రామీణ ప్రజలు కన్నీటి మడుగులో మునిగిపోయారు
వరద విలయంలో చిక్కుకున్న పుదుచ్చేరి వాసులకు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎం రంగస్వామి భరోసా ఇచ్చారు
తీరంలో ఆపి ఉన్న 20 కార్లు, రెండు టిప్పర్‌లు సహా మరికొన్ని వాహనాలు కొట్టుకెళ్లాయి. సుమారు రెండు కీ.మీ దూరం వరకు ఈ వాహనాలను వరద లాక్కెళ్లింది
బురదలో కూరుకు పోయిన తమ వాహనాలను వెలికి తీసేందుకు యజమానులు కుస్తీ పడుతున్నారు


