హీరోయిన్ ఆనందిగా తమిళ సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈమె పుట్టినరోజు నేడు.
తమిళ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ తెచ్చుకున్నప్పటికీ ఈమె తెలుగమ్మాయే.
వరంగల్‌లో పుట్టి పెరిగింది. చెప్పడం మర్చిపోయాం ఈమె అసలు పేరు రక్షిత.
చిన్నప్పుడు ఓంకార్ హోస్ట్ చేసిన ఆట డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేసింది కూడా.
పెద్దయిన తర్వాత 'బస్ స్టాప్' మూవీతో నటిగా మారింది. ఈ రోజుల్లో, నాయక్ సినిమాలు చేసింది.
దీని తర్వాత దాదాపు తమిళ చిత్రాలకే పరిమితమైపోయింది.
మధ్యలో జాంబీరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విధి సినిమాలు చేసింది గానీ బ్యాడ్ లక్.
తమిళంలో 'కాయల్' మూవీతో బోలెడు గుర్తింపు తెచ్చుకోవడంతో తన పేరుని కాయల్ ఆనంది అని మార్చుకుంది.
ఇక 2021లో అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్‌ని పెళ్లి చేసుకుంది. అయితేనేం ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది.


