కొందరు హీరోయిన్లు చూడటానికి అందంగా, నాజుగ్గా ఉంటారు.
అయితే గ్లామర్ మాత్రమే కాకుండా వాళ్లలో మరిన్ని టాలెంట్స్ కూడా ఉంటాయి.
అలాంటి వాళ్లలో టాలీవుడ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ ఒకరు.
మధురై పుట్టి పెరిగిన ఈ చిన్నది.. పదేళ్లు దుబాయిలో పైచదువులు చదివింది.
మిస్ ఇండియా యూఏఈ పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో పాల్గొంది.
2016 నుంచి తెలుగు, తమిళ భాషల్లో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది.
అందం, యాక్టింగ్.. ఇలా అన్నీ ఉన్నప్పటికీ అదృష్టం పెద్దగా కలిసిరావట్లేదు.
ఈమెలో మరిన్ని ఎక్స్ ట్రా టాలెంట్స్ కూడా ఉన్నాయండోయ్. అదే కారు రేసింగ్, బ్యాడ్మింటన్.
తమ్ముడితో కలిసి ఫార్ములా కారు రేసింగ్‌లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటుంది.
బ్యాడ్మింటిన్‌లోనూ తనదైన ప్రతిభ చూపిస్తూనే ఉంది. ఆయా సందర్భాల్లో ఫొటోలని పోస్ట్ చేసింది.
ఇవన్నీ చూస్తుంటే బై మిస్టేక్ హీరోయిన్ అయిపోయిందేమో అనిపిస్తుంది. లేదంటే రేసర్‌గా దూసుకెళ్లేదేమో!


