
సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.


తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్ఠాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ లో ఉత్తమ నటి అవార్డు డా.కామాక్షి భాస్కర్లని వరించింది.

‘మా ఊరి పొలిమేర 2’లో లక్ష్మీ అనే పాత్రలో ఆమె చూపించిన ఇన్‌టెన్స్ నటనకుగానూ ఆమెకు ఈ గుర్తింపు దక్కింది

అవార్డు రావడం పట్ల కామాక్షి భాస్కర్ల ఆనందం వ్యక్తం చేసింది.

ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు సినీ ప్రేక్షకులకు, అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలను తెలియజేశారు.

మా ఊరి పొలిమేర 2’ సినిమాలో నటనకుగానూ నాకు ఉత్తమ నటిగా అవార్డు రావటం నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన జ్యూరీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అవార్డు నటిగా నా బాధ్యతను మరింతగా పెంచింది. నాకు సపోర్ట్ చేసి, ఈ అవార్డు రావటానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ దీన్ని అంకితమిస్తున్నాను’ అని అన్నారు కామాక్షి భాస్కర్ల

సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది కానీ.. అవార్డు వస్తుందని ఊహించలేదన్నారు.

ఈ ప్రతిష్టాత్మక అవార్డు నా మనసులోప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు


