దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్.
తను నటించిన మొదటి చిత్రం ధడక్.
తొలి సినిమాతోనే బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకుంది. హిందీలో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ దేవర సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరలో హీరోయిన్‌గా నటిస్తోంది.
అలాగే రామ్‌చరణ్‌తోనూ ఓ సినిమా చేస్తోంది.
ఆ తర్వాత విజయ్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకోనుందని ప్రచారం జరిగింది.
అంతలోనే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఈ విషయాన్ని పక్కన పెడితే తాజాగా ఆమె జిమ్‌లో చెమటలు చిందిస్తోన్న వీడియోను షేర్ చేసింది.
తన కష్టతరమైన వర్కవుట్స్ చూసిన అభిమానులు గ్రేట్ జాబ్ అని కామెంట్లు చేస్తున్నారు.


