
నేడు (ఆగస్టు 29న) నాగ్ బర్త్డే. ఈరోజు ఆయన 65వ పడిలోకి అడుగుపెట్టాడు.

అక్కినేని నాగార్జున.. వందకుపైగా సినిమాలు చేశాడు. మాస్, క్లాస్, యాక్షన్, భక్తి.. ఇలా అన్నిరకాల చిత్రాలూ పోషించాడు.

తన కెరీర్లో ఏకంగా తొమ్మిది నందులు అందుకున్నాడు. అటు మన్మథుడిగా, ఇటు అన్నమయ్యగా అలరించాడు.

శివ, గీతాంజలి, హలో బ్రదర్, సిసింద్రీ, నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య, ఆజాద్, బావ నచ్చాడు, మన్మథుడు, శివమణి, నేనున్నాను, మాస్, శ్రీరామదాసు, రాజన్న, మనం, బంగార్రాజు, నా సామిరంగ.. ఇలా తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమాలెన్నో ఉన్నాయి.


తన ఫిట్నెస్తో కుర్ర హీరోలకు పోటీనిస్తున్న ఈయన ప్రస్తుతం కుబేర సినిమాలో నటిస్తున్నాడు.


బిగ్బాస్ షోతో బుల్లితెర వీక్షకులను సైతం అలరిస్తున్నాడు.

































