ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ సుహాసిని పుట్టినరోజు నేడు (ఆగస్టు 15)
చెన్నైలో అది కూడా సినిమా ఫ్యామిలీలోనే ఈమె పుట్టి పెరిగింది.
ఈమె తండ్రి చారు హాసన్.. ప్రముఖ నటుడు. కమల్ హాసన్‌కి ఇతడు అన్నయ్య.
1981 నుంచి ఇండస్ట్రీలో ఉన్న సుహాసిని.. ప్రస్తుతం అడపదడపా తల్లి పాత్రలు చేస్తోంది.
ప్రముఖ దర్శకుడు మణిరత్నంని సుహాసిని 1988లోనే పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు.
కెరీర్ విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవితో బోలెడన్ని సినిమాలు చేసింది.
మంచు పల్లకీ, ఛాలెంజ్, రాక్షసుడు, మంచి దొంగ, మరణ మృదంగం, చంటబ్బాయ్, కిరాతకుడు వీళ్ల కాంబోలో వచ్చిన మూవీస్.
ఇలా చిరు కెరీర్‌లోనే సక్సెస్ అయిన సినిమాల్లో సుహాసిని కూడా కీలక పాత్ర పోషించడం విశేషం.
దీంతో పాటు అప్పట్లో యూత్ కలల రాణిగానూ ఎందరో కుర్రాళ్ల మనసుని సుహాసిని దోచుకుంది.


