పల్లె పండుగకు రెక్కలు కట్టుకుని

kadapa airport rush with passengers in sankranthi season - Sakshi

సాక్షి కడప :  సంక్రాంతి పండుగ సమీపించే కొద్ది సొంతూర్లకు వచ్చేందుకు ఎ్కడ అవకాశాలు ఉంటే అక్కడికి ప్రయాణికులు పరుగులు పెడుతున్నారు.ఇప్పటికే రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రత్యేక వాహనాల్లో వెళ్లేందుకు అగచాట్లు పడుతున్న వీరు ప్రస్తుతం విమానాల వేటలో పడ్డారు..ఏది దొరికినా సొంతూరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఏయిర్‌పోర్టులలో కొత్త సందడి
జిల్లా కేంద్రమైన కడప నుంచి ఇటీవలే పలు విమానాలు ప్రారంభించిన నేపథ్యంలో వాటికి ప్రస్తుతం   డిమాండ్‌ ఏర్పడింది.కడప నుంచి హైదరాబాద్‌తో పాటు చెన్నై, తదితర ప్రాంతాలకు వెళ్లేవారు.. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారితో కడప ఎయిర్‌పోర్టు జనంతో కిటకిటలాడుతోంది

పెరిగిన ప్రయాణికులు
సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించుకునేందుకు సొంతూర్లకు తరలి వస్తున్నారు. బిజినెస్, ఉద్యోగాలు, చదువుకునే నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు మొదటగా బస్సులు, రైళ్లలో ప్రయత్నించినా ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో రద్దీగా నెలకొంది. దీంతో విమానాల వైపు తరలుతున్నారు. ఇంతకుముందు 70 శాతం ప్రయాణికులతో నడుస్తున్న ట్రూజెట్‌ విమాన సర్వీసులు ప్రస్తుతం 90 నుంచి 95 శాతం ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి.  హైదరాబాదు నుంచి విమానం కడపకు రావడం, ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్లడం...అక్కడి నుంచి మైసూరు వెళ్లి తర్వాత మళ్లీ కడప మీదుగానే హైదరాబాదు సర్వీసు నడుస్తోంది.

రెండు రోజులుగా ఎక్కువగా ప్రయాణం
 పండుగ సమీపించంతో విమానాల్లో వెళ్లే ప్రయాణీకుల సంఖ్య రెండురోజులుగా పెరిగింది. సాధారణ రోజుల్లో కంటే ప్రస్తుతం పండుగ పరిస్థితులతో 15 నుంచి 20 శాతం మంది విమానంలో  ప్రయాణిస్తున్నారు. సర్వీసుకు సంబంధించి అటునుంచి బాగానే వస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా వెళ్లేవారి సంఖ్య అధికంగానే ఉంది.    – భవ్యన్, ట్రూజెట్‌ మేనేజర్, కడప.

ఎయిర్‌పోర్టులో పండుగ కళ
 సంక్రాంతి పండుగతో ఎయిర్‌పోర్టు జనంతో కళకళలాడుతోంది. వచ్చేవారు, పోయేవారితో ఎప్పుడూ రద్దీగా కనిపిస్తోంది. – పూసర్ల శివప్రసాద్, డైరెక్టర్, కడప ఎయిర్‌పోర్టు

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top