వాసనతోనే కడుపు నిండుతుందట!

Smell is enough for stomach - Sakshi

వాషింగ్టన్‌: ఊబకాయం, బరువు పెరగడం ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. దీంతో బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకుంటూ బతికేస్తున్నారు. నోరూరించే ఆహార పదార్థాలు కనిపించినప్పుడల్లా తినాలా? వద్దా? అంటూ వారిలో ఓ యుద్ధమే జరుగుతుంది. మానసికంగా బలవంతులైతే ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇచ్చి తమను తాము నియంత్రించుకుంటారు. అదే బలహీనులైతే.. ‘ఈ ఒక్కసారికే..’ అని తమకుతాము సర్దిచెప్పుకొని లాగించేస్తారు. తీరా తిన్నాక మళ్లీ సమస్య మొదటికి వచ్చేసిందంటూ బాధపడతారు. 

అయితే ఇలాంటివారు ఇకపై అలా బాధపడాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. పిజ్జా, బర్గర్, బిర్యానీ వంటి కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినకూడని పరిస్థితిలో ఉంటే.. వాటిని తినకుండానే, తిన్నామనే సంతృప్తి పొందొచ్చని చెబుతున్నారు. ఓ రెండు నిమిషాలపాటు సదరు ఆహార పదార్థాల వాసన చూస్తే చాలట.. తిన్నామన్న సంతృప్తి కలుగుతుందని.. ఆ తర్వాత తీసుకునే ఆహారం ఏదైనా తక్కువగా ఆరగిస్తామని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. ఆహార పదార్థాల సువాసన వల్ల పూర్తి సంతృప్తి లభించి కడుపు నిండినట్లు అనిపించడమే దీనికి కారణమట. యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది.

Read latest World News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top